top of page

తీర్చలేని ఋణము



'Tirchaleni Runam' - New Telugu Article Written By Sudarsana Rao Pochampally 

Published In manatelugukathalu.com On 19/02/2024

'తీర్చలేని ఋణము' తెలుగు వ్యాసం

రచన : సుదర్శన రావు పోచంపల్లి


మానవుడు తనకు జన్మనిచ్చిన జననీ జనకులు,విద్యనేర్పిన గురువు ఈ ముగ్గురే కాక లక్షలాది జనులకు ఋణపడి ఉండుట సహజము.


నిత్య జీవితములో తిండి,బట్ట,గూడు ఇత్యాది అవసరాలకు మనకు తెలియకుండానే ఇతరుల సహాయము పొందుతున్నాము-మనకంటె పూర్వము బతికినవారి సేవలు కూడా తరతరాలు అనుభవించుచున్నాము.


ఉదాహరణకు--మనము తినే తిండి రైతు పండించుతాడు- ఆ రైతుకు అవసరమగు వ్యవసాయ పనిముట్లు అనగా నాగలి,కర్రు,తాళ్ళు,బండి,కుండ,మున్నగునవి ఇతరులు సమకూర్చుతారు-కర్రు చేయాలంటె ఇనుము కావాలి - ఆ ఇనుము గనులద్వారా పైకి తీయాలి- పూర్వపు శాస్త్రజ్ఞులు ఎంతో శ్రమపడి భూమి నుండి ఇనుమును పొందే విధానము కనుగొన్నారు- ఆ ప్రక్రియకు యంత్రాలు అవసరము- ఆ యంత్రాలకు ఇంధనము అవసరము, ఇనుమును తీయడము కనుగొన్నదెట్లనో చమరు తీయడము కూడా శాస్త్రజ్ఞులు కనుగొనబడినదే-


అట్లనె బట్టలు కట్టుకోవాలంటే దాని చరిత్ర ఇలాగే ఉంటుంది- నివాసానికి ఇల్లు కట్టుకోవాలంటే వేలాది మంది శ్రమ ఉంటుంది- అంటె మనిషి ప్రతి కదలికలో నిత్యము మనకు తెలియకుండానే లక్షలాది జనుల శ్రమను ప్రత్యక్షంగా,పరోక్షంగా పొందుతున్నాము. ఇది మనిషి వాళ్ళకు బాకీ పడ్డ ఋణము. నేటి ఆధునిక యుగములో ఇంకా ఎక్కువ మంది శ్రమను అనుభవించుచున్నాము.


సైకిలు, కారు, బస్సు, రైలు, విమానము, లాంటి వాహనాలేకాక - వినోద కార్యక్రమాలు, విద్యా సంస్థలు, రకరకాల తినుబండారాలు, క్రీడలు, సంగీతము, దేవాలయాలు, పూజలు, వ్రతాలు, వివాహ వేడుకలు.. ఇలా చెప్పుకుంటూపోతె అంతే లేదు- అంటే మనము ఎంతో అగణిత జనానికి ఋణపడి ఉన్నామన్న మాట- కావున మానవుడు తనవంతు బాధ్యతగా జనానికి ఉపయోగపడే ఏదైన సహకారము అందించుటవిద్యుక్త ధర్మము. అయినా అందరి ఋణము తీర్చలేనిదే.

***

సుదర్శన రావు పోచంపల్లి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.


గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం:

పేరు-సుదర్శన రావు పోచంపల్లి

యాదాద్రి భువనగిరి జిల్లాలోని జిబ్లక్పల్లి గ్రామము.(తెలంగాణ.)

వ్యాపకము- సాహిత్యము అంటె అభిరుచి

కథలు,శతకాలు,సహస్రములు,కవితలు వ్రాస్తుంటాను

నేను విద్యాశాఖలో పనిచేస్తు పదవి విరమణ పొందినాను,

నివాసము-హైదరాబాదు.




16 views0 comments

Comments


bottom of page