top of page
Writer's pictureMutyala Laxma Reddy

తిరిగి రాలేని నీకోసం..



'Tirigi Raleni Neekosam' - New Telugu Poem Written By M. Laxma Reddy

Published In manatelugukathalu.com On 19/06/2024

'తిరిగి రాలేని నీకోసం..' తెలుగు కవిత

రచన: M. లక్ష్మా రెడ్డి


వేచి వేచి ఏనాడు ఆగుతుందో తెలియని నా హృదయ స్పందన..

నేనేనా.. ఇది నిజమేనా..

కల గానీ .కథ గానీ కాదుగా..

నిజమేనని నమ్మేదెలా..

నిరీక్షణం ఇక గతమేనా..

నీవేనా ఎదుట, కల కాదని.. నీవేనని..ఎద వినదేలా..వినేదెలా..

అనుక్షణం.. జ్ఞాపకాల్లో కరిగి,

ఊహల్లో ఊరేగి, 

నిద్దరలేని రాత్రుల్లో.. కన్నీటిగా మారి

రావని..తెలిసి..


గుండెనిండా గురుతులని..

మనసు వదలని నీ మాటలని..


పొరలు పొరలుగా కమ్మేస్తున్న దుఃఖానికి...

నీ రాక.. ఓ అద్భుతం ..ఆశ్చర్యం... 

పదాలకందని  అనుభవం


అసలు నువ్వేనా. . ఎలా.. ఇదెలా ..అసలెలా..

రావనే.. లేవనే..కాదనే .. ఇలా అలవాటైన నా మనసుకి.. నిన్నిలా..?

ఓ ప్రశ్నగా..పరిచయం లేని పలకరింపులా...ఉంది

గతం దేవత లేని చీకటి గుడిలా మిగిలే కదా.. 

వెన్నెలే లేదుగా..

మరి.. ఈ వేళ..ఈ వెలుతురేల..

నువ్వెలా..అసలు నువ్వేనా..?

అయినా..ఈ ప్రశ్నలేల? నువ్వొచ్చేసావ్ కదా..


కానీ..ఉన్నమాట..నువు లేవని..ఒంటరితనంతో ప్రేమలో పడ్డానేమో..

నిను చూస్తే ఓ భయం.. ఈసారి నువు నిష్క్రమిస్తే..తను కూడా దరిచేరదని.. నాకే దారి మిగలదని..


నువు రావని నాతో నేనే కాస్త స్నేహం చేసా..

ఈసారి నువ్వొదిలేస్తే.. నాతో నేనే మాట్లాడ్డం.. లోకం నన్ను పిచ్చోడని పిలవడం...ఖాయమే.. ఎద తట్టుకోలేని గాయమే..


నువు కాదన్నావనే కాగితాలతో బంధం పెంచుకున్నా..

ఈ నీ రాక శాశ్వతం కాకుంటే..

ఆ అక్షరాలూ నా సావాసం కూడదంటే..

ఘడియ గడిచేదెలా..జ్ఞాపకాలు కరిగేదెలా..


నీ రాక నిజమేగా.. నువు ఎప్పటికీగా..

నిమిషం నీవొదిలినా..ఒంటరిగా మిగల్లేనుగా..

చావూ తోడు రాక.. ఊపిరీ నేనున్నానక..

ఎటూ కాక.. ఏమీ లేక..

అడుగూ పడక.. నిలబడనూ లేక..

కూలిపోతూ..కుమిలిపోతూ..

నీ పేరే పెదాల పైన..

నీ రూపే .. ఎదన.. 

కడదాక..కాటిదాక..

అందుకే.. ఇప్పుడు 

ఎప్పటికీ అని మాటివ్వు.. వీడనని పెనవేసుకో..

మరణమూ విడదీయని..బంధమై అల్లేసుకో..


అలా కాకుంటే.. 

అలా కాదు..కానీ నీతో నేను..?

నువ్విలా కాదు.. నేను ఉంటాను.. కానీ..లాంటి 

నియమాలు..  షరతులు ఉంటే.. ఏం పర్లేదు .


నాకిలానే బావుంది..

నీ జ్ఞాపకాలు తుంపరగా నను తాకుతుంటాయి..

ఆ అల్లర్లు.. ఊపిరై నను నడిపిస్తుంటాయి..

రేపు  ..నువ్వొస్తావనే ఆశ ఈరోజుని అందంగా మార్చేస్తుంటే..

నీ మాటలు.. పరిమళమై పెనవేసుకుంటుంటే..

నీ ప్రేమ.. అమృతమై..నను అజరామరం చేస్తుంటే..


చిరుగాలీ.. నీలా నను హత్తుకునే..

ఈ చీకటీ.. నీలా నను అల్లుకునే..

నా తుది శ్వాస వరకు..

ఎద ఎదిరిచూపు నీకొరకు..

సెలవు..నేస్తమా..

రాని ప్రియురాలికి..అర్థం లేని ప్రేమకి..

రాణి..ఈ హృదయానికి..

అర్హత లేని నా ప్రేమకి..

సెలవు... 

ప్రేమతో.. 



M. లక్ష్మా రెడ్డి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

 ఇక్కడ క్లిక్ చేయండి.


విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం

ఇక్కడ క్లిక్ చేయండి.


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ 


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.

గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం:

https://www.manatelugukathalu.com/profile/laxmareddy

నేను లక్కీ.. లక్మారెడ్డి 

రసాయన శాస్త్ర బోధన వృత్తి.. ప్రైవేటు కళాశాలే సుమా..

అడపా దడపా.. కలం కాగితం కనబడగానే...మనసు మాటలు అక్షరాల రూపంలోకి దొర్లి.. మనసు తేలిక అవుతుంది...ఆ ప్రయాసలోనే.. ఆ ప్రహసనం లోనే.. నా కవితలు.. చిన్ని కథానిక లాంటి నాలుగు పంక్తులు..

నచ్చితే..ఒకాట చెప్పండి.. ఇంకోటి రాస్తాను..

నచ్చకుంటే భేషుగ్గా చెప్పండి... ఇంకాస్త పద్ధతిగా రాస్తాను...

ధన్యవాదాలు...



46 views0 comments

Comments


bottom of page