top of page

త్రాసు

తెలుగు బాలల కథ


'Trasu' - New Telugu Story Written By Lakshmi Nageswara Rao Velpuri

Published In manatelugukathalu.com On 15/09/2024

'త్రాసుతెలుగు కథ

రచన : లక్ష్మీనాగేశ్వర రావు వేల్పూరి


విశాఖపట్నం జిల్లాలోని ఒక గ్రామం పేరు 'జాగారం'.

అందులో ఉన్న ప్రజలందరూ వ్యవసాయం మీద ఆధారపడే వాళ్లే, ఆ గ్రామంలో వారానికి రెండు మూడు సార్లు ఒక పెద్ద సంత జరుగుతుంది, అదే మెయిన్ రోడ్డు కావడం వలన చుట్టుపక్కల గ్రామాల ప్రజలందరూ అక్కడకు వచ్చి కోళ్లు, మేకలు, ఆవులు, కూరగాయలు, ధాన్యం పప్పు దినుసులు అనేక రకములైన వస్తువులను కొనుక్కుంటూ ఉండేవారు.

 

అదే రోడ్డు లో ఎంతో పేరు పొందిన 'సోమయ్య శెట్టి గారి బేకరీ' ఒకటి ఉన్నది, అందులో కమ్మని నేతితో చేసిన పిండి వంటలు, రకరకాల కేకులు మంచి రుచికరముగా ఉండడంతో, రైతాంగం కూడా ఎంతో ఇష్టంగా కొనుక్కుపోయేవారు. ఆ బేకరీ కి నెయ్యి సప్లై చేసేవాడు భీమయ్య. ఒక సన్న కారు రైతు, ఎన్నో ఏళ్లుగా ఇంట్లో నెయ్యి కాచి, కేజీ ప్యాకెట్లుగా కట్టి, అటు సంతలోను, ఇటు సోమయ్య శెట్టి బేకరీ కి అమ్మేవాడు. సంతలో అమ్మిన నెయ్యికి చిన్న చిన్న ప్యాకెట్లు కట్టి, పది రూపాయలు, 20 రూపాయలు చొప్పున, డబ్బులు కాకుండా వస్తువులు కుటుంబ పోషణకి తీసుకునే వాడు, ఎందుకంటే భీమయ్యకు డబ్బు విలువ తెలియదు, సోమయ్య శెట్టి బేకరీ కి మాత్రం ఒక కేజీ ప్యాకెట్ కట్టి ఇచ్చేవాడు.


 భీమయ్య తన ఇల్లు గడవక, ఎంతో కష్టపడి రాత్రి పగలు నెయ్యి తయారు చేసి, సంతలో అమ్ముడవకపోతే, ఎవరికో ఒకరికి ఆ ప్యాకెట్లు ఇచ్చి తగిన వస్తువులు తీసుకునేవాడు, అలాగే సోమయ్య శెట్టి బేకరీ కి ఒక కేజీ ప్యాకెట్ ఇవ్వగానే 

ఆ వ్యాపారి కూడా రెండు బ్రెడ్డ్ ప్యాకెట్లు ఇచ్చేవాడు.

 

ఆరోజు సంత అయిపోయిన తర్వాత, బేకరీ కి వెళ్లి సోమయ్య శెట్టికి తన దగ్గర ఉన్న నెయ్యి ప్యాకెట్ ఇవ్వగానే, “ఏరా భీమయ్య! ఈ మధ్య నెయ్యి వాసన తగ్గిపోతుంది. జాగ్రత్తగా చూడు”, అనగానే “అలాగే బాబయ్య!” అని అనగానే రెండు బ్రెడ్ ప్యాకెట్లు నెయ్యికి బదులుగా ఇచ్చాడు సోమయ్య. 


 ఆరోజు ఎందుకొ “ఒరేయ్ ఉండరా! నెయ్య ప్యాకెట్ బరువు తగ్గింది, కాటా లో వేస్తాను”, అంటూ తన దగ్గరున్న కాటాలో తూచాడు. 


అంతే ఒక్క ఉదుటన బయటకు వచ్చి, “ఏరా ఎన్నాళ్ళుగా ఈ మోసం చేస్తున్నావ్?, నేను బరువు తూచటం లేదనే కదా, తగ్గించి ప్యాకెట్ ఇస్తున్నావు, ఇదిగో చూడు ఇది 800 గ్రాములే ఉంది, అంటే కేజీకి 200 గ్రాములు తగ్గించి నన్ను మోసం చేస్తున్నవు. మూడేళ్లగా నీ దగ్గర నెయ్య కొంటూ, నేను ఎంత మోసపోతున్నానో.. నీ పని తేలుస్తా ఉండు! నిన్ను పోలీసులుకు పట్టిస్తాను” అంటూ వీరావేశంతో ఊగిపోయాడు సోమయ్య శెట్టి. 


ఈ గొడవంతా చూస్తున్న ప్రజానీకం కూడా “ఒరేయ్ భీమయ్య! ఎంత మోసం రా నువ్వు, సోమయ్య శెట్టి గారిని మోసం చేస్తావా, నీలాంటి వాడిని పోలీసులకు పట్టిస్తేనే మన గ్రామం బాగుపడుతుంది”, అంటూ అందరూ భీమయ్యను తిట్ట సాగేరు.


 భీమయ్య కూడా భయంతో “అయ్యా! నేను చెప్పేది వినండి, నేను తూచలేదు. నా దగ్గర ఎలాంటి త్రాసు గాని, కాటా గాని లేదు. నేను అజ్జాయింపుగా, నెయ్యి ప్యాకెట్లు కట్టి, సంత లో అమ్మి, అలాగే సోమయ్య శెట్టి గారి కూడా ఒక పెద్ద ప్యాకెట్ కట్టి, బేకరీ కి ఇచ్చేవాడిని. నాకు కూటికి గతి లేదు, కాటా కొనలేను అయినా ఎలాగో అలాగా కుటుంబాన్ని ఇలా నెయ్యి ప్యాకెట్లు కట్టి, వాళ్ళ దగ్గర వంట సరుకులు తీసుకుని, కుటుంబాన్ని పోషిస్తున్నాను. నాలో ఎలాంటి దురభిప్రాయం లేదు. సోమయ్య శెట్టి గారు కూడా ఏనాడూ నాకు డబ్బులు ఇవ్వలేదు. అసలు దాని ఖరీదే ఏంతో తెలీదు. 


ఆయన ఇచ్చిన రెండు బ్రెడ్ ప్యాకెట్లు, నా పిల్లలకు మూడు రోజులు తిండికి వస్తుంది. అందుకే అలాగే అలవాటయింది. నన్ను క్షమించండి బాబయ్య”, అంటూ వాపోయాడు భీమయ్య. 


 కానీ సోమయ్య శెట్టి ఒక పెద్ద వ్యాపారి అయి ఉండి, ఎక్కడ పరువు పోతుందన్న భయంతో వెంటనే పోలీస్ కంప్లైంట్ ఇచ్చాడు. ఎందుకంటే గ్రామంలో సోమయ్య శెట్టి బేకరీ కి, మరెవరు మోసం చెయ్యరని, ఒకసారి ఇలాగా కంప్లైంట్ ఇస్తే మొత్తం అందరూ సప్లయర్స్ కి భయం వేస్తుంది, తన బేకరీ కి సరైన వస్తువులు అమురుతాయి, అన్న ఉద్దేశంతో భీమయ్య మీద పోలీసులు కంప్లైంట్ చేశాడు. 

 పోలీస్ స్టేషన్లో ఇన్స్పెక్టర్ గారి దగ్గరకు భీమయ్యను తీసుకువెళ్లి “సార్!, ఎన్నో ఏళ్లుగా ఇతను నా బేకరీ కి నెయ్య సప్లై చేస్తూ, నన్ను నిలువునా ముంచాడు. ఎందుకంటే కేజీ అని ప్యాకెట్ అని ఇస్తూ, ఆ ప్యాకెట్లు 800 గ్రాముల నెయ్యి మాత్రమే ఉన్నది. నెయ్యి తగ్గేసరికి ఈరోజు నేను కాటా వేస్తే, అసలు నిజం బయటికి వచ్చింది. ఇలా ఎన్నో ఏళ్లుగా నా దగ్గర రెండు బ్రెడ్డ్ ప్యాకెట్లు తీసుకొని, నెయ్యి ఇచ్చేవాడు. కనుక ఈ దొంగ భీమయ్యకు మీరు బుద్ధి చెప్పాలి. నేను వీడి వల్ల ఎంతో నష్టపోయాను” అంటూ చెప్పేసరికి ఇన్స్పెక్టర్ గారు “ఏరా భీమయ్య.. అది నిజమేనా?” అంటూ గద్దించాడు.


“నమస్తే సార్! నాకేమీ తెలియదండి. నేను కేజీ నెయ్యి అని చెప్పి, మూడేళ్లుగా సార్ బేకరీ కి ఇస్తున్నాను. ఆయన కూడా ఏ రోజు తక్కువ ఉందని చెప్పలేదు. ఈరోజే ఎప్పుడు లేనిది, కాటాలో వేసి తూచాక అది 800 గ్రాములే ఉందని, నేను మోసం చేశానని నామీద ఫిర్యాదు చేశారు. కానీ నేను ఒక సన్న కారు రైతునీ, పొలాలు సరిగ్గా పండగ, తిండి కూడా కష్టమై, ఏదో ఒకలాగా నా దగ్గర ఉన్న ఆవులు దగ్గర నుంచి, పాలు తీసి, ఎంతో రుచిగా ఉండే వరకు, కాచి నెయ్యి చేసి సంతలో తిండి వస్తువులకు చిన్న చిన్న ప్యాకెట్లు ఇచ్చేవాడిని.


 అలాగే శెట్టి గారికి కూడా ఒక కేజీ ప్యాకెట్ లాగా కట్టి, ఆ బేకరీ కి ఇచ్చేవాడిని. నేను అత్యంత బీద రైతును కాబట్టి, నా దగ్గర తూచడానికి ఒక కాటా లేదు. అంత అజ్జయింపుగా కట్టి బేకరీకు ఇచ్చేవాడిని. సోమయ్య శెట్టి గారు కూడా ఏ రోజు నేను తెచ్చిన నెయ్యి ప్యాకెట్ దాని ధర కూడా నాకు తెలీదు. కానీ ఆయన ఎప్పుడూ డబ్బులు ఇవ్వలేదు, రెండు1/2 కేజీ బ్రెడ్ ప్యాకెట్లు పట్టుకెళ్ళమని ఇచ్చేవాడు. వాటితో మూడు నాలుగు రోజులపాటు కుటుంబ పోషణ చేసుకునేవాడినీ, అంతకన్నా మరి ఏమీ లేదు సార్”, అంటూ కళ్ళ నీళ్లు పర్యంతమైన భీమయ్యను, 

“ఒరేయ్! అసలే నెయ్యి చాలా ఖరీదు, నువ్వు దానికి డబ్బులు తీసుకోకుండా, శెట్టి గారిచ్చిన రెండు బ్రెడ్ ప్యాకెట్లు తీసుకొని అమాయకంగా వెళ్లిపోయావు. సరే, అది మీ ఇద్దరి మధ్య వ్యాపారం గనుక, నువ్వు తక్కువ నెయ్యి ఇచ్చి మోసం చేశావు. శెట్టి గారు, మీకు భీమయ్య ఇచ్చిన నెయ్యి ప్యాకెట్ ఒకసారి ఇటు ఇవ్వండి”, అని చెప్పి, భీమయ్య దగ్గర ఉన్న రెండు బ్రెడ్ ప్యాకెట్లు కూడా తీసుకుని “ఒక్కసారి ఉండండి! ఎవరిది మోసమో తేల్చేస్తాను”, అంటూ ఇన్స్పెక్టర్ గారు కానిస్టేబుల్ ని పిలిచి “బజార్ కెళ్ళి ఒక కాటా అడిగిపట్రా!” అని పంపించారు. 


 కానిస్టేబుల్ మార్కెట్లో ఎవరినో అడిగి కాటా తెచ్చి, ఇన్స్పెక్టర్ గారి టేబుల్ మీద పెట్టాడు. ముందు భీమయ్య నెయ్యి ప్యాకెట్ ని తూచారు, సరిగ్గా శెట్టి గారు చెప్పినట్టే 800 గ్రాములే ఉంది. ఆ తర్వాత భీమయ్య ఇచ్చిన, రెండు బ్లడ్ ప్యాకెట్లను కాటలో పెట్టి తూస్తే, దాని బరువు 700 గ్రాములే ఉంది. ఇదంతా చూస్తున్న సోమయ్య శెట్టి కాళ్లు చేతులు చల్లబడిపోయాయి, 


ఇన్స్పెక్టర్ గారు మాట్లాడుతూ, “సోమయ్య శెట్టి గారు, మీరు ఎనిమిది వందల గ్రాముల నెయ్య తీసుకుని, ఎంతో చవకగా దొరికే రెండు బ్రెడ్ ప్యాకెట్లు అవి కూడా 700 గ్రాములు అమాయకుడైన సోమయ్య కు ఇచ్చి ఇన్ని సంవత్సరాలుగా మోసం చేస్తున్నారు. అసలు డబ్బులకైతే నెయ్య చాలా ఖరీదు. అలాంటిది రెండు బ్లడ్ ప్యాకెట్లు ఇచ్చి అమాయకుడైన భీమయ్యను మోసం చేస్తున్నారు. ముందు మీకు శిక్ష పడాలి!” అని అనగానే, "తను తీసిన గోతిలో తానే పడ్డట్టు" సిగ్గుతో తలవంచుకున్నాడు సోమయ్య శెట్టి. 


“సార్ తప్పైపోయింది, గ్రామంలో మరి ఎవరు తనని మోసం చేయకూడదు, అన్న ఉద్దేశంతో నా పరువు పోతుందన్న భయంతో, భీమయ్య మీద కంప్లైంట్ ఇచ్చాను, నిజంగానే భీమయ్యకు రావలసిన నష్టపరిహారం ఇచ్చుకుంటాను, నా తప్పుకు క్షమించండి!” అంటూ ఇన్స్పెక్టర్ గారినీ ప్రార్థించగానే, ఆయన ఎంతో ఆనందంతో, “ఒరేయ్

 భీమయ్య!, నీకు జరుగుబాటు లేకపోతే, ఎవరిని

 మోసం చేయకుండా, నీ వ్యాపారానికి తగ్గట్టు సోమయ్య శెట్టి గారి ఇచ్చే నష్టపరిహారంతో, ఒక మంచి 'త్రాసు' కొనుక్కొని న్యాయబద్ధంగా తూకం వేసి, మరి నెయ్యిప్యాకెట్లు కట్టి, సంతలోను, అక్కడున్న బజారులోనూ, డబ్బు కు అమ్మి, బాగుపడు.


'వస్తు మార్పిడి విధానం' వలన పురాతన కాలంలో ఎంతోమంది నష్టపోవడం వలన, ఈ రకమైన వస్తువు అమ్మి డబ్బు తీసుకోవడం ప్రభుత్వ అమలుపరిచింది”, అని చెప్పగానే, భీమయ్య వెంటనే ఇన్స్పెక్టర్ గారి కాళ్ళ మీద పడి, 

“నన్ను రక్షించారు బాబయ్యా!, నేను ఎవరిని మోసం చేయకుండా త్రాసు కొని, సరైన ధరకు డబ్బులుకి అమ్మి, మంచి పేరు తెచ్చుకుంటానండి”, అంటూ అనేసరికి, అక్కడ కూడిన ప్రజానీకం 'పోలీస్ఇన్స్పెక్టర్ గారి' సమయస్ఫూర్తికి, న్యాయనిబద్ధతకు, హర్షద్వానాలు తెలియజేశారు. 

**********************

వేల్పూరి లక్ష్మీనాగేశ్వర రావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.



రచయిత పరిచయం : 

నమస్కారాలు. నా పేరు వేల్పూరి లక్ష్మీనాగేశ్వర రావు. వైజాగ్ లో టాక్స్ కన్సల్టెంట్ గా పని చేస్తున్నాను.కథలు చదవడం, తీరిక సమయాల్లో రచనలు చేయడం నా హాబీ. నా కుమార్తె సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేస్తోంది. శ్రీమతి వైజాగ్ లోనే ఒక ప్రైవేట్ స్కూల్ లో టీచర్ గా పనిచేస్తోంది.నా కథలను ఆదరిస్తున్న పాఠకులకు నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.  





38 views0 comments

Kommentare


bottom of page