శ్రీక్రోధి నామ సంవత్సర శుభాకాంక్షలు - ఉగాది
పండుగ శుభాకాంక్షలు
'Ugadi Panduga Subhakankshalu' - New Telugu Poem Written By Ayyala Somayajula Subrahmanyam Published In manatelugukathalu.com On 09/04/2024
'ఉగాది పండుగ శుభాకాంక్షలు' తెలుగు కవిత
రచన : అయ్యల సోమయాజుల సుబ్రహ్మణ్యము
(ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత)
పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
సప్త స్వరాలు, సరసవినోదాలు
సురుచిరు హాస్యాలు, నవరస
భరితాలు, సాహితీపరిమళాలు
కోకిల గానాలు, పంచాంగశ్రవణాలు
షట్రుచుల మేలు కలయికగా
సర్వులూ ఆరోగ్యవంతులుగా
దేశము సుభిక్షంగా ఉండాలని
ఈ ఉగాది పండుగ
శ్రీ క్రోధి నామ సంవత్సర చైత్రరథం
మీకు జైత్రయాత్ర నివ్వాలని
కోరుకుంటూ
పండుగ శుభాకాంక్షలతో
అయ్యలసోమయాజుల
సుబ్రహ్మణ్యము &
ఉదయసుందరి.
Comments