top of page
Writer's pictureNeeraja Prabhala

ఉగాది శుభాకాంక్షలు


'Ugadi subhakankshalu' New Telugu Poem

ఉగాది శుభాకాంక్షలు తెలుగు కవిత

(ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత)




అందరికీ శోభకృత్ నామ ఉగాది శుభాకాంక్షలు🌷🌷


శుభములనిచ్చి శోభను చేకూర్చే శోభకృత్ ఉగాదికి స్వాగతం - సుస్వాగతం.

ఆనందోత్సాహంతో నూతన సంవత్సరానికి ఆహ్వానం పలుకుదాం.🌷🌷


క్రొంగొత్త మావిచిగురులు తిన్న కోయిల కుహూకుహూ రాగాలనాలపించగా,

ఉషోదయ వెలుగులతో వచ్చెను ఉగాది,

ఇంటింటా శోభలను తెచ్చెను శోభకృత్.

ఇంతులు ఇంటింటా రంగవల్లులు దిద్దగా,

పడతులు పూబంతుల రెక్కలద్ది వాటికి మరింత అందాన్ని తెచ్చె.


చరవాణీలు సెల్ఫీ చిత్రాలతో క్లిక్ మనియె. పడతులు వాటిని ఫేస్బుక్, వాట్సప్ లలో పెట్టగా,

లైక్సులు, కామెంట్లతో ఆ సైట్లు కనువిందు చేసె.

పచ్చని మామిడి తోరణాలతో వాకిళ్లు కళకళలాడె.

పట్టు పావడా, పూలఓణీలను ధరించి సోయగాల పడతులు సందడి సేయ,

యువకుల మదిలో మానసవీణ మ్రోగె.


ఓరచూపులు చూస్తున్న పడతుల మది గర్వాతిశయముతో ఉప్పొంగె.

భక్తుల రాకతో దేవాలయాలు కిటకటలాడగా,

కనులారా దేవుని చూడలేని మదనతో భక్తులు వెనుతిరిగె.

పండితులు పంచాంగ శ్రవణం సేయ,

పెద్దలు తమ రాశిఫలాలను తెలుసుకునే ఉత్సుకత చూపె.


ప్రసారమాధ్యమాలు వాసిగా రాశిఫలాలను చూపె.

పల్లె లోగిళ్లు పాడిపంటలతో పొంగి పొరలాలని కర్షకులు వాంఛించె. యువతీయువకుల రాకతో పట్నంలోని హోటళ్లు క్రిక్కిరిసె.

కాసుల గలగలలతో కాషియర్ల ముఖం వెలిగె.

జీవితాలలో వెలుగులు నింపే శోభకృత్,

అందరికీ శోభను చేకూర్చి సుఖశాంతులనిచ్చున్.

….. నీరజ హరి ప్రభల.

నీరజ హరి ప్రభల గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం



మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.

లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.

మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.

గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత్రి పరిచయం :


30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ఉత్తమ రచయిత్రి బిరుదు పొందారు



"మన తెలుగు కధలు " వేదిక మిత్రులందరికీ నమస్కారం. నా పేరు నీరజ ప్రభల. నాది చాలా చిన్న కుగ్రామంలో చాలా సాంప్రదాయ కుటుంబంలో జననం. అగ్రహారం. నాన్న గారు బాలకృష్ణ మూర్తి గారు బ్రాంచి పోస్ట్ మాస్టర్, వ్యవసాయ దారుడు, పంచాయతీ ప్రెసిడెంట్. అమ్మ కమల గృహిణి . మేము ఆరుగురం సంతానం. నాకు ముగ్గురు అక్కయ్యలు, ఇద్దరు అన్నయ్యలు. అందరిలోకీ నేనే ఆఖరిదాన్ని. చిన్న దాన్ని. నాకు చిన్న వయసులోనే వివాహం. మేము విజయవాడలో ఉంటాము. నేను గృహిణిని. మా వారు వాసుదేవశర్మ. రిటైర్డ్ లెక్చరర్. మాకు ముగ్గురు అమ్మాయిలు. మా కూతుళ్ళు, అల్లుళ్ళు సాఫ్ట్ వేర్ ఇంజనీర్లుగా డెన్మార్క్ , అమెరికాలలో సెటిలయ్యారు. మా ముగ్గురు అమ్మాయిలు చిన్నప్పటి నుంచీ కర్ణాటక సంగీతం నేర్చుకుని అనేక పోటీలలో గెలుపొంది , ప్రతి సం.. త్యాగరాజ ఉత్సవాలలో కచేరీలు చేసి ప్రముఖ విద్వాంసుల ప్రశంసలు పొందటం నా అదృష్టంగా ఎల్లప్పుడూ భావిస్తాను. అంతేకాకుండా పాడుతా తీయగా, పాడాలనుంది, రాగం- సంగీతం మొ.. ప్రోగ్రాములలో పాల్గొని పెళ్ళైనాక కూడా విదేశాల్లో కచేరీలు చేస్తూ అందరిచే ప్రశంసలు పొందుతున్నారు. ప్రస్తుతం మాకు ఇద్దరు మనవరాళ్ళు, ఒక మనవడు. నాకు చదువంటే చాలా చాలా ఇష్టం. పిల్లలు సెటిలయ్యాక B.Com, MA సంస్కృతం, MAఇంగ్లీష్, MA తెలుగు చేశాను. సంగీతం - సాహిత్యం నాకు ప్రాణం. సంగీతం నేర్చుకున్నాను. ఇప్పుడు వీణ కూడా నేర్చుకుంటున్నాను. టైపు, షార్ట్ హాండ్ ప్రధమ శ్రేణి లో ఉత్తీర్ణత. కధలు-కవితలు వ్రాస్తాను. మీ అందరి ప్రోత్సాహంతో కధలు, కవితలు వ్రాస్తున్నాను . నాకధలు లోగడ పత్రికలలో కూడా ప్రచురితమైనవి. గార్డెనింగ్, స్టిచింగ్, అల్లికలు, సాఫ్ట్ టాయ్స్ బొమ్మలు, డ్రాయింగ్ , ఫాబ్రిక్ పెయింటింగ్, రంగవల్లులు, క్రియేటివ్ ఆర్టికిల్స్ తయారీ మొ.. నా హాబీ. అమ్మ , నాన్న గారు స్వర్గస్ధులయ్యి 10 సం.. అయినది. నాకు నా మాతృభాష తెలుగు అంటే చాలా చాలా ఇష్టం, అభిమానం‌, గౌరవం. ఈ వేదిక మీద మిమ్మల్నందరినీ పరిచయం చేసుకోవడం నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. నా కధలను ఆదరించి ప్రోత్సాహిస్తున్న మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు.🙏🙏

58 views0 comments

댓글


bottom of page