top of page

ఉపాయం లో అపాయం!

#PVPadmavathiMadhuNivrithi, #పివిపద్మావతిమధునివ్రితి, #UpayamloApayam, #ఉపాయంలోఅపాయం, #TeluguChildrenStories


Upayamlo Apayam  - New Telugu Story Written By - P V Padmavathi Madhu Nivrithi Published In manatelugukathalu.com On 21/03/2025

ఉపాయం లో అపాయం! - తెలుగు కథ

రచన: పి. వి. పద్మావతి మధు నివ్రితి


1)

"మంచి - మాధవ్" మరియు "అందాల వింధ్య" ల కాలేజీ చదువులు పూర్తి అయ్యాయి. పెళ్లి చేసుకొని, ఆదర్శ ప్రేమ జీవితాన్ని కొనసాగించాలి అని నిర్ణయించుకున్నారు.. ఆ చిన్ననాటి స్నేహితులు, పవిత్ర హృదయాలు, తేనె మనస్సుల - లేత మనస్సుల.. ప్రేమికులు. చిన్నపటి నుండి ఆ పవిత్ర హృదయాలకు ఒక్కరంటే ఒక్కరికీ ప్రాణం. వారిది హృదయపూర్వకంగా - పూరితంగా పెనవేసుకున్న బంధం (పాఠశాల రోజుల నుండే). 


అదే మాటను ఇరువురు కలిసి వెళ్ళి.. వింధ్య 'మామయ్య' చెవిన వేశారు. వింధ్య హైదరాబాద్ ఊరి శివార్న, కాలేజీ పక్కనే ఉన్న, తన మామయ్య ఇంట్లో ఉండి కాలేజీ చదువులు పూర్తి చేసింది. ఎందుకు అలా? (హైదరాబాద్) నగరం నుండి రోజూ కాలేజీ కి వెళ్ళి రావటానికి.. రాను పోను.. కాలేజీ బస్సులో.. రోజూ 4 గంటలు పట్టేది (ట్రాఫిక్ జామ్ వల్ల). ప్రయాణానికి సమయం వృధా అయ్యి పాఠాలు చదవటానికి సమయం దొరికేది కాదు కాబట్టి. 


2) 

ఈ వార్త వినగానే వింధ్య 'మామయ్య' గుండె నొప్పితో కుర్చీ నుండి అమాంతం కింద పడ్డారు. అతడికి హార్ట్ - ఆటాక్ వచ్చింది ఈ నిజం భరించ లేక. వెంటనే ఆసుపత్రి లో చేర్పించారు అతడిని. అతడు వింధ్య చేతులు పట్టుకుని "అమ్మా వింధ్య, నేను ఇక బ్రతకను.. నా కడ కోరిక తీర్చడం నీ బాధ్యత కాదా" అన్నారు మూల్గుతూ. 


"అదేంటో చెప్పు మామయ్య" అన్నది వింధ్య కన్నీటి పరంతో. 


"నా కొడుకు వినయ్ ను పెళ్లి చేసుకో. చిన్నపటి నుండి నీ మీద ఆశలన్నీ పెట్టుకొని జీవిస్తున్నాడు, మేమంతా కూడా అదే ఆశించాం", అన్నారు 


వింధ్య "సరే మామయ్య, ‘వినయ్ అబ్బాయి’ నే పెళ్లాడుతా" అన్నది. 


"ఈ రోజే ఆ పని ముగించాలి. నేను ఎప్పుడు పోతానో నాకే తెలియదు", అంటూ ఆమె చేయి పట్టుకొని ఒట్టు కూడా వేయించుకున్నారు 'మామయ్య'. 


"ఈ ఆసుపత్రి గది పెద్ద హాల్ లా ఉన్నది. ఇప్పుడే ఆ పెళ్లి తంతు.. సాంప్రదాయ పద్దతిలో ఇక్కడే ముగించాలి. ఏ క్షణాన పోతాను నాకే తెలియదు" అన్నారు అందాల వింధ్య యొక్క 'మామయ్య' రొప్పుతూ.. ఆయాసంతో. 


3)

చిన్న పెళ్లి మంటపం అక్కడే అదే హాల్ (పెద్ద గది) లో తయారు చేశారు. అన్ని ఏర్పాట్లు చేశారు. ఆసుపత్రి వారికి డబ్బులు భారీగా సమర్పించుకుంటే ఒప్పుకున్నారు. డబ్బుకు లోకం దాసోహం కాదా?.. అన్నట్టు. 


పురోహితుడిని పిలిపించారు. నగరంలో ఉన్న కొంతమంది స్నేహితులను, చుట్టాల వారిని, వీడియో - ఫొటోగ్రాఫర్లను పిలిపించారు. 


వింధ్య - వినయ్ లను ఒకరికొకరు ఎదురుగా కూర్చో పెట్టారు పెళ్లి బట్టలతో. 


పురోహితుడు ఏవో మంత్రాలు చదివారు కాసేపు. 


ఇద్దరి (పెళ్లి కూతురు - పెళ్లి కొడుకు) నడుమ బట్ట కట్టారు. బట్ట అటువైపు నుండి వరుడు తాళి కట్టాడు వింధ్య కు. అందరూ అక్షింతలు జల్లారు. 


4)

ఆశ్చర్యం. వెంటనే మంచం మీద పడుకున్న 'మామయ్య' గట్టిగా నవ్వుతూ నిలబడ్డారు. "హ హ హ" అంటూ బిగ్గరగా. అందరికీ అర్థమయి పోయింది. అప్పుడే ఆ క్షణాన. 'మామయ్య' గుండె నొప్పి నటించి ప్రేమికులైన అందాల వింధ్య - మంచి మాధవ్ ల ప్రేమ - జోడి ను విడగొట్టి, ధనవంతురాలయిన వింధ్యను తన కోడలు గా చేసుకొని.. ఆమె ఆస్తులు - అంతస్తులు కొట్టేయాలని - కాజేయాలని పన్నాగం పన్నారని. 


5)

ఇంకో ఆశ్చర్యం.. పెళ్లయిన జంట నడుమ ఉన్న బట్ట తొలగించ గానే అటు ఉన్నది తాళి కట్టిన మనిషి మంచి మాధవ్! వినయ్ కాదు!


అసలేం జరిగింది???.. ఆ క్షణాన, వినయ్ ను పక్కకు నెట్టి, ఆ క్షణాన మంచి మాధవ్ తాళి కట్టాడు అందాల వింధ్య మెడలో. 


"ఇంత మోసం చేస్తారా", అంటూ గర్జించాడు 'మామయ్య'. 


అందాల వింధ్య తెలివిగా ఇలా అన్నది. 


"గుండె నొప్పి అంటూ నువ్వు వేసిన ఉపాయంతో అపాయం జరిగింది నీకు..

నువ్వు గుండె నొప్పి అనగానే.. నీ pulse rate (పల్స్ రేట్) చూసాను, నీ చేయి పట్టుకుని. అది మామూలు గానే (72 బీట్స్ పర్ సెకండ్) ఉన్నది. నీ గుండె నొప్పి నటన అని తెలుసుకొని మంచి మాధవ్ కి చెప్పేశాను". 


"అంతే కాదు. నువ్వు నా ఆస్తి కాజేయాలని లాయర్ ను కలిశావని, నా ఆస్తి వివరాలు కూడా అడిగావని లాయర్ వద్ద తెలుసుకున్నాను". 


"మోసాన్ని మోసం తోనే జయించాలి అంటారు. అయినా నిన్ను నేను యే మోసం లేకుండా జయించాను మామయ్య. 'వినయ్ అబ్బాయి' తో పెళ్ళి అని మాట ఇచ్చాను. వినయ్ తో అని కాదు. మంచి - మాధవ్ ను మించిన వారు ఉండరు ‘వినయం’ లో, మంచితనంతో. ఈ విషయం లోకం అంతా విదితమే కదా.. తెలుసు కదా". 


6)

"నా ఆస్తి కావాలి అంటే నేనే ఇచ్చేస్తా కదా మామయ్య. ఇంత నాటకం ఆడా లా.. మోసం చేయాలా?.. నీ స్వంత కూతురు అయితే ఇలాగే చేస్తావా? ఇలా ఆమె గొంతు కోస్తావా ఆమె ప్రేమను భంగ పరిచి?.. డబ్బు దురాషకు, డాలర్ మోజుకు లోనై?.. చీ చీ.. ఇక్కడ కంస మామ రాక్షస యుగం నడుస్తుందా?".. అంటూ ప్రశ్నించింది అందాల వింధ్య, కన్నీరు కారుస్తూ. లోకాన్ని కూడా ప్రశ్నించింది అనటం సబబు. మామయ్య తల దించుకున్నాడు కంట తడితో. 


ఆ తరువాయి అతడి భార్య వద్దకు వెళ్ళింది, "అత్తా అని నిన్ను చిన్న నాటి నుండి హృదయ రాగం తో పిలిచాను. దానికి ఇదా నువ్వు ఇచ్చే బహుమతి?.. ఇక్కడ తాటకి, లంకిణి, పూతన రాకసి యుగం నడుస్తుందా.. ఇదా లోకం?".. అంటూ దీన స్వరం లో పలికింది. అత్త తల దించుకున్నది అశ్రు బిందువులతో. 


ఆ తరువాయి వినయ్ వద్దకు వెళ్ళి ఇలా అన్నది అందాల వింధ్య, 

"చిన్నప్పుడే నేను మనస్పూర్తిగా మంచి మాధవ్ కు హృదయం అర్పించిన సంగతి నీవు ఎరుగవా? మా ఇరువురి పెళ్లి ఆ నాడే హృదయ-విలీనము గా అయిపోయింది అని నీకు తెలుసు కదా. నిన్ను తోబొట్టువుగ మంచి అనురాగం తో చూసుకున్నందుకు మంచి పాఠం నేర్పావు సోదరా! వాహ్.. నీ డబ్బు - డాలర్ ప్రేమకు జోహార్. ఇక్కడ శిశుపాల రాక్షస యుగం నడుస్తుందా?", అంటూ చితికల బడింది అందాల వింధ్య. వినయ్ తల దించు కున్నాడు సిగ్గుతో, కన్నీటి తో. 


7)

మామయ్య - అత్త - మరియు వారి కొడుకు వినయ్ కళ్ళలో పశ్చాత్తాపంతో నీళ్ళు తిరిగాయి. "మమ్మల్ని క్షమించండి వింధ్య - మాధవ్" అని వేడుకున్నారు. పెళ్లయిన ఇద్దరినీ మనస్పూర్తిగా దీవించారు. 


ఆ చల్లటి "అందాల సంధ్యా" సమయాన (సాయింత్రం వేళ).. "హాయి" చేకూరుస్తూ ఉన్న "సంధ్యా" సమయాన.. అందరూ మళ్లీ ఇంకోసారి అక్షింతలు జల్లారు.. ఆ ప్రేమ జంట.. అదే యిప్పుడు పెళ్ళైన జంట పై.. ఈ సారి మనస్ఫూర్తిగా.. నిండు హృదయాలతో.. పవిత్ర హృదయాలతో - సంతోష పూరిత మనస్సులతో. 


ఉపాయం లో అపాయం.. ఎత్తుకు పై ఎత్తు.. అంటే ఇదేనేమో. 


చిన్ననాటి ప్రేమికుల "దిగ్విజయ ప్రేమ బంధం" - "వివాహ బంధం" - "హృదయ విలీన బంధం" అంటే ఇదేనేమో!

-------- X X X ---- కథ సమాప్తం ---- X X X ------


నీతి:

1)

ఆస్తులు అంతస్తులు, డాలర్ వ్యామోహం, డబ్బు దురాశ.. కుళ్ళు కుతంత్రాలతో.. జీవించ కూడదు మనిషన్నాక. మరి ఎలా?.. మంచిని పంచుతూ పెంచుతూ.. ప్రోత్సాహం చేస్తూ.. జీవించటం.. అసలైన మానవ జాతి లక్షణం. 


2) దేవుడు చేసిన మనుషులు అన్నాక.. ప్రేమతో జీవించాలి. యుద్ధాలతో, కక్షలతో, బాధ ఇచ్చే నిర్వహణ తో.. చంపు-కుంటూ కాదు.. కొట్లాట, హాని, క్షోభ, మోసం, గిల్లి కజ్జాలు, మనో వేదన, కష్టం - నష్టం:- ఇస్తూ, చేస్తూ కాదు. 


3) 

మనుషులు కాస్త దూరంగా మెలిగితే జోక్యం లేకుండా.. , ఎక్కడి-దక్కడ మరచి పోతే (ఇంకో చెవి నుండి వదిలేస్తే).. హాయిగా సుఖ సంతోషాలతో జీవించ వచ్చు.. చాడీలు లేకుండా.. పగ - ప్రతీకారాలు లేకుండా. 


4)

మంచి మాటలు - చేతలు - ఆచరణ - సంతోష పూరిత నిర్వహణ మరియు ఆనంద పూరిత పరిష్కారాల తీరు లో.. తరచు.. శిక్షణ ఇస్తే అందరికీ (చిన్న - పెద్ద, ఆడ - మగ).. అప్పుడు "అందరూ మంచి వారే".. గా మారిపోతారు. 


లోకం స్వర్గ సీమ లా మారిపోతుంది (అనటం అతిశయోక్తి కాదు). సమాజం నుంచి మనుషులకు వచ్చిన చెడులు, డబ్బు దురాశ - డాలర్ వ్యామోహం, ఆస్తుల - అంతస్థుల దురాశ.. అంతరించి పోతాయి.. అదృశ్యం అయిపోతుంది.. పటాపంచలు అయిపోతాయి. జీవితంలో వసంతం కురుస్తుంది అందరికీ. మది - హృదయం పవిత్ర - నిర్మాణాత్మక త తేజోవంతమైన ఆలోచనలతో విరాజిల్లుతుంది.. సూర్య కాంతి తో మంచి ప్రగతి - అభ్యుదయం - ఐశ్వర్యం.. అనే వెలుగును వ్యాపింప చేస్తుంది అన్ని దిక్కుల్లో



---------- కథ - నీతులు సమాప్తం ---------


పి. వి. పద్మావతి మధు నివ్రితి  గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం:

 నేను స్నేహపూరిత ఎడ్యుకేటర్ [Friendly Educator cum (1 to 1 cum TEAM'S) HAPPY Developer] ను. బౌధ్ధ నగర్, సికింద్రాబాద్ లో ఉంటాను. స్పీడ్ వేదిక్ మాథ్స్ (Speed vedic Maths), గణితం (regular Maths), ఇతర విషయాలు బోధిస్తాను. 


మా బృందం (team), వివిధ విషయాల పై, ప్రపంచానికంతా సబ్జెక్టివ్ క్విజ్ (పాఠాలు) (Subjective) క్విజ్ అందిస్తుంది ఉచితంగా [*P V Madhu - World - Theoretical (Subjective) Quiz Teachers TEAM ద్వారా]. (వేల సంఖ్య లో పాఠాలు - అధ్యాయాలు అందించాము ఇప్పటిదాకా). 


మా విద్యార్థులు ఆబ్జెక్టివ్ (Objective) క్విజ్ అందిస్తారు ఉచితంగా ప్రపంచానికంతటా [*Miss Nivriti Sreelekha World (Objectives) Quiz Teachers TEAM ద్వారా]. (ఇప్పటికీ వందల సంఖ్యలో అందించారు)


నేను, మా విద్యార్థులు, మా తల్లి - దండ్రులు, కుటుంబ సభ్యులు... అనేక అంశాల పై (సమాజ సమస్యలకు పరిష్కారాలు, ప్రోత్సాహకరపు సంతోష కరపు నిర్వాహకము, తేలికగా విద్య - బోధన పద్ధతులు... ఇతరత్రా విషయాలపై)... ఆంగ్ల - తెలుగు దిన - మాస పత్రికలకు... తరచూ లేఖలు వ్రాస్తాము. వందల సంఖ్య లో మా లేఖలు ప్రచురణ అయ్యాయి. 


మా విద్యార్థుల బృందం (*Miss Nivriti Sreelekha World (Objectives) Quiz Teachers' TEAM)... ఇప్పటివరకు Bill Gates Notes Blog కు 550 పై చిలుకు లేఖలు వ్రాసింది. (సమాజాన్ని ఉద్ధరించే అంశాలపై, పరిష్కారాల సూచనలు, ప్రోత్సాహపు - నిర్వహణ పై). 


మా (+ మా విద్యార్థుల) బృందం యొక్క క్విజ్ లు ప్రతి వారం డెక్కన్ క్రానికల్ ఆదివారం సంచిక (Deccan Chronicle daily newspaper Sunday edition) లో ప్రచురణ అవుతాయి (వందల సంఖ్యలో ఇప్పటిదాకా అయ్యాయి). మా - మా విద్యార్థుల బృందాన్ని ప్రోత్సహిస్తున్న అన్ని పత్రికలకు ధన్యవాదాలు. 


మా - మా విద్యార్థుల బృందానికి నోబెల్ లారేట్ ల మరియు ప్రపంచ నాయకుల వద్ద నుండి (ప్రశంస - ప్రోత్సాహపు) లేఖలు వచ్చాయి. అవి మా అందరికీ ఎన లేని ఉత్తేజం - ఉల్లాసం - శక్తి ఇచ్చాయి. 



మాకు విద్య పై, తెలుగు మరియు గణితం పుస్తకాలు, పత్రికలు చదవడం పై (చిన్నపటి నుండి) మక్కువ - ఇష్టం కలిగించింది మా అమ్మ గారు (పి. వి. పద్మావతి). ఆవిడ ఒక గణిత విశ్రాంతి టీచర్. మా మనసుల్లో - గుండెల్లో ఎప్పటికీ ఉంటారు. మాకు చిన్నపటి నుండి ఇంట్లో అన్ని విషయాలలో పాఠాల - సందేహాల సృష్టీకరణ చేసేవారు. చిట్కాలు చెప్పేవారు. ఒక పెద్ద భరోసా గా ఉండేవారు. 


 ఆవిడ ప్రోత్సాహం వల్లనే మేము చిన్న తెలుగు కథలు వ్రాసాము. వ్రాస్తున్నాము... ఇప్పటికీ. కొన్ని బాలభారతం, బొమ్మరిల్లు, చంద్ర ప్రభ, సాహితీ కిరణం, ఇతరత్ర పత్రికల్లో ప్రచురణ అయ్యాయి. 


మా నాన్న గారు ఒక విశ్రాంత ఉద్యోగి. మాకు ఆంగ్లం మరియు సాంఘీక శాస్త్రం పై మక్కువ వచ్చేలా ప్రోత్సహించారు. వారి (మరియు కుటుంబ సభ్యుల) ప్రోత్సాహం - చలువ వల్లనే నేను ఇంజనీరింగ్, పి. జి చేయగలిగాను. 


ధన్యవాదాలు "మా తెలుగు కథలు" టీమ్ - బృందానికి. వారి ప్రోత్సాహం - సంతోష పూరిత నిర్వహణ - awards - rewards స్ఫూర్తి దాయక నిర్వాహకానికి. ఇది No. 1 website అవ్వాలి ప్రపంచంలో అని ఆశిస్తూ... 


పి. వి. పద్మావతి మధు నివ్రితి

(సికింద్రాబాద్, తెలంగాణ, భారత్)


ఈ: pvmadhu39@gmail. com


(మా theoretical subjective క్విజ్, మా విద్యార్థుల Objective క్విజ్ కావలసిన వారు మాకు మా ఈమెయిల్ ద్వారా తెలియ జేయ వచ్చు. ఉచితంగా ఈమెయిల్ ద్వారా పంపిస్తాము). 






 
 
 

Comments


bottom of page