'Vaidarbhi Vivaham - 1/3' - New Telugu Poems Written By Sudarsana Rao Pochampally Published In manatelugukathalu.com On 14/10/2023
'వైదర్భి వివాహము - 1/3' తెలుగు పద్యాలు
రచన : సుదర్శన రావు పోచంపల్లి
{1} వినదగు వింతతొ విదర్భ భూపతి
కొనరగ జన్మించె కోమల పుత్రిక
కనదగ అందము కమిలిని భంగిన్
అనదగ ఆది లక్ష్మి అవతారంబనన్.
{2} నెలత బెరుగుచునుండె నెలవంక కళల బోలి
పొలతి పొంకము జూడ పులకిత పుండ్రమొప్పు
అలతి అలతి నడకల సుదతి అందమెరుగ
మలికితములేల మహిత మహిజేరె మాధవుని జాడ
{3} పురజనుల భాషణ యందు భీష్మక
పుర భూషణయై వెలుగొందన్ హరిప్రియ విదర్భ
పురనాథునింట వెలసె విలసితలావణ్య వైకుంఠ
పుర వాసుని జాడ లెరుంగ వైనమెరిగి.
{4} కలువ రేకుల కన్నుల కాంతితో విరజిల్లు
చెలియ చెక్కిళ్ళు కెందమ్మి ఛాయనొప్ప
నలువ సృష్టికి రుక్మిణియె అందాల నెలవుగాగ
తలువ పొలతి పొంకమునకింక వంకలేల
{5} బొమ్మల పెండ్లిండ్లు భోజనంబునకు
రమ్మని పిలుచు వియ్యపురాండ్ర వినయమొప్ప
కమ్మని విందంటు కడు నేర్పు వడ్డించి
సొమ్ములు జూపించి సొగసు దెలుపగోరు.
{6} కడలి అల్లుని కీర్తి కడుయోర్పు వినినింతి
ఒడలు పులకరించ ఒయ్యారమున నిల్చు
కడప చాటున నుండి గనుచుండు క్రీగంట
ఉడుపులు సవరించు నొక వేలు నోటగరుచు.
{7} ఈశానుడ నా ఈప్సితము దెలిపెద
దాశార్హుడు దక్క దయచేయ మ్రొక్కెద
ఆశాసన మొసగ అంబను వేడెద
కుశేశయ నాభుని కులసతిగ గూర్చబూన.
{8} నిక్కమెరుంగ నది నిశ్చయ మయ్యె మదికిన్
చక్కనివాడు శౌరి తనకున్ దక్కెడివాడు అన్యులకున్
చిక్కనివాడు మిక్కిలి కైపెక్కెడివాడనన్
చెక్కిలి ఎరుపెక్కగ చెలి నక్కలి బాసెన్.
{9} తెలియగ విదర్భపుర నాథునింట తేజము
వెలిగెడి రుక్మిణీ తనయ తన్మయ లావణ్య
తలిరుబోడి హిరణ్యకాంతులీనన్ బోలు హీరన యా
లలనన్ దనకిల్లాలుగ జేకొన హరి దనమనమున దలిచెన్.
{10} వాసుదేవునికిల్లాలుగ వైదర్భినీయ విదితమవగ
కీసబుద్ధి రుక్మికే కోశాన నొప్పక చేసె వల
మీస మెలిబెట్టి బాసలెల్ల తనచెల్లి చేబట్ట
జేసెద చైద్యుచేత ననుచు హరి విరోధి యగుచు
{11} అగ్రజు బాసలున్విని భీస్మకసుత తన మనో
నిగ్రహ మాపలేక నా యుదగ్రకరవేణి దానన్
పరిగ్రహించన్ గోరుచున్ బంపెన్ అగ్రజునొక్కని
గదాగ్రజు కడకున్ సమగ్ర విచారము విన్నవించగన్.
{12} వింటిన్ వీనుల విందుగ నో చక్రి
నీ దటతనమున్ బాల్యపు క్రీడలన్
తుంటరి తనమున్ ఇక ఉంటిన్నీ
దంటగ జేరన్నే ధన్యత నొందన్.
{13} నవ్య నవనీత చోరుడేనాడొ గాని
దివ్య మంగళ పురుషుడీనాడు అనగ వింటి
అవ్యయుండవు గాబోలు విభుడ నాకు
భవ్యమున్ గలుగ వేడెద భవ్యనిపుడు.
{14} కాంతామణి రుక్మిణిన్ గాంతు వేమి
ఇంతి యీడుకు సరిదోడు నీవెగాగ
పొంతనెవరింక లతకూన కతుకువారు
సంతసంబొప్ప చేబట్టు సకిని జేరి.
{15} మనోహర ఓ మణిమయ కిరీటధారి శిశుపాలుడు
నీ మనోహరిని సరగు గొనిపోవగ బొంచినాడట
నా మనోరాజ్యము నేల నీవు గాక అన్యులకున్
వినోదమె గానన్ వడిన్ గొనిపొమ్ము నన్ను గోప్యంబుగన్.
{16} లోకుల్ మెచ్చిన మెచ్చకున్న మాయన్న రుక్మి
నాకుంబరిణేతగ చైద్యునెంచె యో కృష్ణ దానే
పరాకు నూహించకంబర్యాప్త చిత్తుండై యో
లాకు చెందడింక వేగన్ జేకోమ్ము నేనీయొడింబడన్
=================================================================================
ఇంకా ఉంది..
========================================================================
సుదర్శన రావు పోచంపల్లి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం
ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత పరిచయం:
పేరు-సుదర్శన రావు పోచంపల్లి
యాదాద్రి భువనగిరి జిల్లాలోని జిబ్లక్పల్లి గ్రామము.(తెలంగాణ.)
వ్యాపకము- సాహిత్యము అంటె అభిరుచి
కథలు,శతకాలు,సహస్రములు,కవితలు వ్రాస్తుంటాను
నేను విద్యాశాఖలో పనిచేస్తు పదవి విరమణ పొందినాను,
నివాసము-హైదరాబాదు.
Commenti