top of page
Writer's pictureNallabati Raghavendra Rao

వాళ్ళను గౌరవించడం మన ధర్మం



'Vallanu Gouravinchadam Mana Dharmam' - New Telugu Story Written By Nallabati Raghavendra Rao Published In manatelugukathalu.com On 26/08/2024 

'వాళ్ళను గౌరవించడం మన ధర్మంతెలుగు కథ

రచన: నల్లబాటి రాఘవేంద్ర రావు

(ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత)

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్



డాక్టర్ యుగంధర్ ఆ సిటిలో ''యుగంధర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్'' మేనేజింగ్ డైరెక్టర్. భార్య శ్రీసరళ, 


మొక్కవోని దీక్ష, కటోరమైన క్రమశిక్షణ, నిగర్వితనం ఆయనను ఒక్కొక్కమెట్టు ఎక్కిస్తూ వచ్చాయి. నాలుగు సంవత్సరముల నుండి దినదిన ప్రవర్ధమానంగా దూసు కు వెళ్తున్న హాస్పిటల్ ప్రస్తుతం ఐదోవార్షికోత్సవం జరు పుకునే ఆనంద సన్నాహసమయంలోఉంది. 


పైగా ఆ శుభ సమయములో 50 పడకల హాస్పిటల్ 100 పడకల హాస్పిటల్ గా మార్చే భూశంకుస్థాపన

ప్రయత్నాలు. మరో పక్క రావలసిన అతిరథమహా రధులకు ఆహ్వానం పలికే విషయం.. ఇంకా సన్మాన సత్కారాల విషయంలో ముఖ్యులతో తర్జనభర్జన సమావేశాలు. ఫంక్షన్ రోజున విందు వినోదాలకు సంబంధించి తగిన వారిని ఏర్పాటు చేసే ప్రతిపాద నలు. సమయం దగ్గర పడుతుంది అమ్మో ఎన్నో వ్యవహారాలు చక్కపెట్టుకోవాలి.. అనుకున్నాడు డాక్టర్ యుగంధర్. 


రింగ్ అవుతున్న సెల్ అందుకొని ఆన్ చేశాడు. 

''అన్నయ్య, నేను రా మీ చెల్లి పద్మ ని. హాస్పటల్ ఐదో వార్షికోత్సవం ఘనంగా చేస్తున్నట్టు మెసేజ్ పెట్టావు. అందరం చూసాంరా, చాలా బాగుంది. ఒకమాట చెప్పాలని ఫోన్ చేశాను. మీ బావగారికి ఈ మధ్యన సన్మానాలు జరగలేదురా. చెప్పాను అనుకోక కూసం తా ఆయనకి అక్కడ భారీ ఎత్తున సన్మానం జరిగే ఏర్పాటు ఏదైనా చూడుమరి. నువ్వు మొదట్లో హాస్పి టల్ కడుతున్నప్పుడు ఏదై నా సమస్య వస్తే పోలీసు లతో మాట్లాడేవారు కదా. జ్ఞాపకం ఉందా. నీకు బోల్డంత సహాయం చేశారుకదా.. కుసంత చూడుమరి. ఇదిగో మా అత్తారు తరపు 70 మంది వచ్చేలాగా ఉన్నారు. '' అంటూ చెప్పింది. 


'' నేను ఇంకా ఎలా చేయాలో ఆలోచించుకుంటున్నానే చెల్లి. నువ్వు నన్ను కంగారు పెట్టకు. '' అన్నాడు యుగంధర్. 


 కాసేపటికి అతని భార్య శ్రీసరళ నుండి ఫోన్ వచ్చింది,

యుగంధర్ కు. 


'' చెప్పు సరళ.. ''


'' ఏం లేదండి.. చిన్న విషయమే. మీ చెల్లి ఇప్పుడే ఫోన్ చేసిందట. మీరు ఏదో పెద్ద ఆలోచిస్తాను అన్నా రట. పోనీ మీ బావగారు మాట పక్కన పెట్టండి. మీ చెల్లికి నాకు మా ఇద్దరికీ ఆ సన్మానం చేసి పడేయండి. వాట్సా ప్ లో మీరు పంపిన ఆహ్వానపత్రం చూసి మా తరపు వాళ్లు కూడా 60 మంది ప్రయాణం అవుతున్నారు. ఆ చేసేది ఏదో కాస్త భారీఎత్తుగా ఏర్పాటు చేశారు అనుకో అదే మంత్రులు వస్తారు కదా వాళ్ళచేత చేయిస్తే బాగుంటుంది. మా వాళ్ళు వీడియోలు అది తీసుకునే ఏర్పా టులో ఉన్నారు.. '' శ్రీసరళ ఇంకా చెప్పటం ఆపలేదు. 


''చాలా వ్యవహారాలు చక్కబెడుతున్నాను. ఏ రాత్రికో మాట్లాడుకుందాం లే'' ఫోన్ పెట్టేసాడు యుగంధర్. 


*



ఆమర్నాడు తన ముఖ్య స్నేహితుడు పద్మనాభం ఫోన్ చేశాడు. '' ఏరా.. ధరం. మెసేజ్ చూశాను రా. అప్పుడు 50 పడకల హాస్పిటల్ నువ్వు కట్టేటప్పుడే డబ్బు విషయంలో నీకు నేను చాలా హెల్ప్ చేశాను గుర్తుందా. ఈ మధ్యన నీ నుండి ఫోన్ రావడం లేదు. వంద పడకలు చేస్తున్నావట కదా సంతోషం. ఇదిగో నువ్వు కొంత మందిని భారీగా సన్మానించాలనుకు న్నావని తెలిసింది. నువ్వు నాకు ముందే చెప్పలేదను కో.. రాలేను. నాకు చాలా ఏర్పాట్లు ఉన్నాయి. అప్పటి కప్పుడు చెబితే మాత్రం కుదరదు. తర్వాత.. ' ఫ్రెండ్ నువ్వే నీ సన్మానానికి రాకపోతే ఎలాగరా ఎందుకు దెబ్బ వేసావు. ? అంటావు. ఇదిగో ఓ పది కారుల మీద మన పటాలమంతా తీసుకొచ్చేస్తాను. ఇనపడుతోందా. నా సన్మానం మాత్రం బ్రహ్మాండంగా జరగాలి, సరే ఏ విషయము సాయంత్రం లోగా చెప్పు ఉంటాను. నువ్వు బిజీలో ఉన్నట్టున్నావు''' అంటూ ఫోన్ పెట్టేసాడు డియరెస్ట్ ఫ్రెండ్ పద్మనాభం. 


ఆ మధ్యాహ్నం ఇదే విషయం మీద సిఐ గారి నుండి లేబర్ కమిషన్ గారి నుండి మరో ఫ్రెండ్ జాయింట్ కలెక్టర్గారి నుండి, మాజీ ఎమ్మెల్యే గిరిధర్గారి నుండి ఫోన్లులో ఇలాంటి టాపిక్ గురించే ప్రస్తావన జరిగింది


డాక్టర్ యుగంధర్ కు కార్యక్రమం ఎలా నిర్వహించాలో ఎలా ముగించాలో ఎవరెవరిని ఏ విధంగా సంతోష పెట్టాలో ఆలోచించుకునే సమయం కూడా లేకుండా పోయింది. సమయం దగ్గరపడుతున్న మూలాన అతని బుర్ర గందరగోళంగా తయారైంది. 


**

ఆ మధ్యాహ్నం అందరినీ పంపించి తన ఛాంబర్ నుండి హాల్లోకి వచ్చాడు డాక్టర్ యుగంధర్. అప్రయ త్నంగా తన ఫ్యాంట్ జేబులో చెయ్యిపెడితే పనికి రాని కాగితం ముక్కలు దొరికాయి. అవి ఉండచుట్టి డస్ట్ బిన్ లు వెయ్యాలని ప్రయత్నం చేశాడు. ఆ హాలులో చుట్టూ నాలుగు డస్ట్ బిన్స్ ఉండాలి. చుట్టూ తిరిగాడు ఒకటి కూడా కనపడలేదు. చిర్రెత్తు కొచ్చింది. 


''సక్కుబాయి, దమయంతి.. ఎక్కడ చచ్చారు. మీ మొగుళ్ళు ఏమైపోయారు. ఆ సత్తిబాబు, సాంబయ్య కి బుద్ధులు లేవు. నాలుగేళ్ల నుంచి నా దగ్గర హాస్పిటల్ మొత్తం మీద ఉన్న బాత్రూములు, వాష్ బేసిన్లు, ఫ్లోర్ క్లీనింగ్ చేసే మొత్తం పని మీకే అప్ప చెప్పాను కదా.. సంవత్సరంసంవత్సరం జీతం పెంచుతున్నాను. ఇదేనా పద్ధతి ఇక్కడ నాలుగు డస్ట్ బిన్లు ఏవి?'' అంటూ గట్టిగా అరిచాడు. 


బయట ఎండలో పెట్టిన నాలుగు డస్ట్ బిన్ లు చేత్తో పట్టుకుంటూ సత్తిబాబు, సాంబయ్య పరుగును వచ్చి యధాస్థానంలో పెట్టారు భయపడుతూ. 


''సారు.. కాస్త తడిగాఉన్నాయి. ఎండలో పెడితే వాసన పోతుందని ఐదునిమిషాలు ఎండలో పట్టుకుని నిలబడ్డాo. '' అంటూ భయపడుతూ చేతులు కట్టుకుని దూరంగా నిలబడ్డారు సత్తి బాబు, సాంబయ్య. 


'' ఇదిగో ఎల్లుండి ఐదో వార్షికోత్సవ ఫంక్షన్. మమ్మల్ని బొట్టు పెట్టి పిలవలేదు డాక్టర్ గారు.. అంటూ అందరికీ చెప్పి తర్వాత నా మీద నింద వేస్తే కుదరదు. తెల్లవారు జామున రెండు గంటలకు వచ్చి రాత్రి 12:00 వరకు శుభ్రం విషయాలు అన్నీ మీరే చూసుకోవాలి జాగ్రత్తగా. మట్టి డ్రెస్సులు వేసుకుని తగలడకండి ఉన్న వాటిలో కాస్త శుభ్రమైనవి వేసుకురండి. అందరం చేసేశాక టిఫిన్లు భోజనాలు ఇక్కడే చేయండి. చి చి చి ఎవరికి చెప్పక పోయినా తగువే.. '' అనుకుంటూ వేగంగా బయ టకు వెళ్లిపోయాడు డాక్టర్ యుగంధర్. 


''అదేంటిమామ డాక్టర్ గారు అలా వెళ్లిపోతుంటే మాట్లాడవేంటి. మన పాకల మీద తాటాకు తీసి బంగాళా పెంకులు వేసుకుంటాం ఏమైనా సహాయం చేయమని అడుగుతాను అన్నావు కదా. ఎల్లుండి ఫంక్షన్లో ఆయన మనకు బహుమతి ఇవ్వాలంటే ఇప్పుడే కదా అడగాలి నువ్వు. బాగానే ఉంది సంబడం ఆయన కోప్పడితే నోరు మూసేసుకున్నావ్. ఇట్టాగైతే కష్టమేనీతో కాపురం. '' అంటూ విస విసలాడింది సత్తిబాబు పెళ్ళాం సక్కుబాయి. 


 మరో క్లీనింగ్ వర్కర్ సాంబయ్య పెళ్ళాం దమయంతి కూడా అలాగే కేకలు పెట్టింది మొగుడు మీద.. మాట్లాడ కుండా తమ పనిలోకి వెళ్లిపోయారు క్లీనింగ్ స్టిక్కులు, 

చీపురులు పట్టుకొని సత్తిబాబు సాంబయ్యలు. చేటలు, 

క్లీనింగ్ గుడ్డముక్కలు పట్టుకొని వాళ్ళని అనుసరిం చారు వాళ్ళ భార్యలు. 


*

ఐదో వార్షికోత్సవం రోజు రానే వచ్చింది. హాస్పిటల్ కి పక్కనే ఉన్న ఫైవ్ స్టార్ హోటల్లో వైభవంగా ఫంక్షన్ మొదలయింది. వందలాది కార్లలో జనం వచ్చారు. 4000 మంది జనం పట్టే ఫంక్షన్ హాల్లోముందు వరసలో కుడిపక్క రాజకీయనాయకులు వాళ్ళ వెన క ఆహ్వానం అందుకున్న అన్ని హాస్పిటల్ డాక్టర్స్. ఎడమపక్క బంధువులు, స్నేహితులు, హితులు, పెద్దలు. బాగా దూరంగా డెకరేషన్ పనివాళ్ళు, క్యాటరింగ్ వర్కర్స్. ఆ తర్వాత ఎంట్రన్స్ ద్వారానికి బయట ఓమూలగా సత్తిబాబు, సాంబయ్య, సక్కుబాయి, దమయంతి. 


గంట నుంచి సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతు న్నాయి. సమయం మధ్యాహ్నం 11 దాటింది. సభలో కూర్చున్న జనంలో అందరూ జరగబోయే ఫంక్షన్లో మనవాళ్లకు ఘనంగా సన్మానం జరుగుతుందని భావించిన వాళ్లే. డయాస్ మీదకు పిలిచేసేసరికి చప్పట్లు కొట్టడానికి రెండు చేతులను సిద్ధంగా ఉంచు కున్నారు. అంతేనా సన్మానం అందుకుంటున్న తమ వాళ్ల మెడలో వేయడానికి పూల దండలు ప్లాస్టిక్ కవర్లో తెచ్చి పక్కన పెట్టుకున్నారు రెడీగా. ఇంకో అరగంటలో పక్కనేఉన్న పెద్ద ఏసీ హాల్లో భోజనాలు కూడా మొదలు కాబోతున్నాయి. 


డాక్టర్ యుగంధర్ డయాస్ మీదకువచ్చి తన ఆహ్వానం మన్నించి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరునా అభినందనలు తెలియచేశాడు. చాలాసేపు చాలావిషయాలు మాట్లాడిన డాక్టర్ యుగంధర్ చివరగా ఇలా మొదలు పెట్టాడు.. 


''నేను రాజకీయ నాయకులనో, నా కుటుంబ సభ్యు లనో, స్నేహితులనో సన్మాన సత్కారం చేస్తానని మీరు అనుకోకండి. 


 నేను ఇప్పుడు కొందరు తెరవెనుక కష్టజీవులు లాంటి మనుషులను ఘనంగా సత్కరించి సన్మానం చేయదలు చుకున్నాను. అలాంటి వాళ్లను గుర్తించ గలిగితేనే సమసమాజం ఏర్పడుతుంది. వాళ్లు ఎవరో ఈ పేపర్లో పేర్లు చదువుతాను. ఆ విషయం వాళ్లకు కూడా ఇప్పటి వరకు తెలియదు. దయచేసి వాళ్లు డయాస్ మీదకు వచ్చి సన్మానం అందుకోవాల్సిందిగా కోరుతున్నాను. 


అంతకుముందు మరొకమాట ఒక ఇల్లు పూర్తికావా లంటే కూలీలు ఉండాలి.. కానీ వాళ్ళను ఎవరూ గుర్తించరు. పరిశ్రమ సక్సెస్ కావాలంటే చెమటోడ్చి కష్టపడే లేబర్ కావాలి.. కానీ వాళ్ళని ఎవరూ గుర్తించరు. ఒక రాజకీయ పార్టీ మనుగడ సాగించాలన్న జెండా పట్టుకు మోసే దిగువస్థాయి కార్యకర్తలు కావా లి.. వీళ్లను కూడా ఎవరూ గుర్తించరు. ఇక ఇప్పుడు.. ప్రాణబిక్ష పెట్టే హాస్పిటల్ ముందుకు నడవాలంటే 24 గంటలు హాస్పిటల్లో బాత్రూంలు, లెట్రిన్, వాష్ బేసిన్స్ మొత్తం ఫ్లోర్ శుభ్రం చేసే శుభ్రత పనివాళ్ళు కావాలి. వేలాది మంది వాళ్లే కరోనా సమయంలో లేకపోతే 

పరిస్థితి ఎలా ఉండేదో ఆలోచించండి. 


వాళ్లే లేకుంటే హాస్పిటల్ లో ఉన్న డాక్టర్లకు సైతం రోగా లువచ్చేస్తాయి. అలాంటి శుభ్రకులను నేను గుర్తించి ఘనంగా సన్మాన సత్కారాలు చేయాలనుకుంటు న్నాను ఇప్పుడు. నా నిర్ణయం ఎవరికైనా నచ్చకపోతే నన్ను క్షమించండి. అంతే కాదు వాళ్ళకుటుంబాలకి ఆరోగ్యం, వాళ్ల పిల్లలకు చదివినంతవరకు చదువు చెప్పించే బాధ్యతనాది. చివరగా వాళ్లకు ఒక ఆశ్చర్యకరమైన బహుమతి.. ఈ పక్కనే ఉన్న శివాజీరోడ్ లో రెండు కుటుంబాల యజమానుల పేరున రిజిస్టర్ చేసిన 2 పోర్షన్ల ఇంటి దస్తా వేజు కాగితాలు కూడా ఇప్పుడే వాళ్ళకి అందిస్తున్నాను. పేర్లు చదివిన వెంటనే తెర వెనుక కష్టజీవులులాంటి ఆ గొప్పమనుషులు దయచేసి డయాస్ మీదకు వచ్చి మా సన్మానసత్కా రాలు, బహుమతులు అందుకోండి.. వాళ్ల పేర్లు వినండి. నా దృష్టిలో వాళ్లే పునాది రాళ్లు.. ఓ 50 అంతస్తుల భవనం వందల సంవత్సరాలు నిలబడ డానికి మూల స్తంభాలు. అలాంటి వాళ్లను గౌరవిం చడం మన ధర్మం'' అంటూ జేబులో కాగితం తీసి ఇలా పేర్లు చదివాడు డాక్టర్ యుగంధర్. 


''సత్తిబాబు, సాంబయ్య, సక్కుబాయి, దమయంతి"


అలా పేర్లు చదివి ఆనందంగా వేదిక మీదకు వచ్చిన వాళ్లకు సన్మాన సత్కారాలు అనుకున్నట్టు ఘనంగా చేశాడు యుగంధర్


కానీ సభలో ఏ మూల నుండి చప్పట్ల శబ్దాలు, ఆనందాల కేరింతలు వినబడటం లేదు. 


ఏమిటి.. ?.. అంటూ ఆశ్చర్యంగా తలతిప్పి యుగంధర్ సభ వైపు చూసేసరికి కుర్చీల లో ఒక్కరు కూడా లేరు. అందరూ ఏసి హాల్లోకి భోజనాలకు వెళ్లిపోయారు. 


అక్కడ మిగిలింది సన్మానం అందుకున్న ఆ నలుగురు, డాక్టర్ యుగంధర్ మాత్రమే. 


 నిశ్శబ్ద వాతావరణం.. 


''అంతే మరి.. కార్యం ముందుకు నడిపించే కష్టజీవులు నీడలు లాగే మిగిలిపోవాలి అనుకుంటారు.. హోదాలో ఉన్న మహానుభావులు. 


నీడలు తెర ముందుకు రావడానికి తెరముందు.. నటించే ఆ మహానుభావులు ఎవరూ ఒప్పుకోరు కదా.. అలా ఒప్పుకుంటే తెర ముందు నటించే వారు తెర మరుగైపోతారని వాళ్లకు భయంపాపం !''' 


మనసులో అనుకున్నాడు డాక్టర్ యుగంధర్.. సన్మానం అందుకున్న ఆ నలుగురునీ గుండెలకు హత్తుకుంటూ. 


****

నల్లబాటి రాఘవేంద్ర రావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 


విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.

మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.







రచయిత పరిచయం: నల్లబాటి రాఘవేంద్ర రావు


30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.


ముందుగా  " మన తెలుగు కథలు"  నిర్వాహకులకు నమస్సులు..

"రచయిత పరిచయం"..... ఇది చాలా ముఖ్యం.

రచయిత తన  గొప్పలు చెప్పుకోవడం కాదు గాని తన గతచరిత్ర వివరాలు అందరికీ తెలియ చేయటం అవసరమే. ఈ చర్య ఆ రచయితకు మానసికంగా ఎంతగానో ఉపయోగపడి అతను మరిన్ని మంచి మంచి రచనలు చేసి సమాజానికి అందించే అవకాశం ఉంది.. ఎంతో పెద్ద ఆలోచనతో అలాంటి 'మహా ప్రయత్నం'.. చేస్తున్న 'మన తెలుగు కథలు' కు మరొక్కసారి అభినందనలు.

పునాది....

-----------

ఏడు సంవత్సరాలు వయసు నాది. మా తండ్రి సుబ్బారావు గారు  ప్రోత్సాహంతో శ్రీ కృష్ణార్జున యుద్ధం అనే 10 నిమిషాల నాటకాన్ని నేనే రాసి కృష్ణుడి వేషం  నేనే వేసి దర్శకత్వం నేనే చేసి పెద్ద స్టేజి మీద  దసరా నవరాత్రులకు ప్రదర్శించాము.


ఆ తర్వాత భక్త ప్రహ్లాద లో ప్రహ్లాదుడు గా.. మరో నాటకంలో శ్రీరాముడుగా..   రచన దర్శకత్వం నాదే.. ఏడు సంవత్సరాల వయస్సు.


తర్వాత పదిహేను సంవత్సరాల వయసులో

టెన్త్ క్లాస్ యానివర్సరీ కి  15 మంది నటులతో నా దర్శకత్వం లో పెద్ద స్టేజి మీద నాటకం వేసాము.

అప్పుడే నేను రచయితను కావాలన్న

ఆశయం   మొగ్గ తొడిగింది.

నా గురించి..

---------------

50 సంవత్సరాల సుదీర్ఘ సాహితీ ప్రయాణం.

450  ప్రచురిత కథల రచన అనుభవం.

200 గేయాలు  నా కలం నుండి జాలువారాయి

200 కవితలు నా మేధస్సు నుండి ఉద్భవించాయి

20 రేడియో నాటికలు ప్రసారం.

10 టెలీఫిల్మ్ ల నిర్మాణం.

200 కామెడీ షార్ట్ స్కిట్స్

3  నవలలు దినపత్రికలలో


" దీపావళి జ్యోతి "అవార్డు,

"రైజింగ్స్టార్" అవార్డు

" తిలక్ స్మారక" అవార్డు... మరికొన్ని అవార్డులు.


ప్రస్తుత ట్రెండ్ అయిన  ఫేస్బుక్ లో  ముఖ్యమైన 15 గ్రూపుల్లో... ఇంకా అనేక వెబ్ సైట్లు, బ్లాగులు,ఆన్లైన్ పత్రికలలో యాక్టివ్ గా తరచు  నాకథలు,  కవితలు,గేయాలు, ముఖ్యంగా కామెడీ షార్ట్ స్కిట్స్ ప్రతి రోజూ దర్శనమిస్తూ ఉంటాయి..

రమారమి 75 అవార్డులు, రివార్డులు అందు కున్నాను... అని గర్వంగా చెప్పుకునే అవకాశం  కలగటం... ఆ చదువులతల్లి అనుగ్రహమే!

ఇదంతా ఒక్కసారిగా  మననం చేసుకుంటే...  'పడని సముద్ర కెరటం' లా... నూతనశక్తి మళ్లీ పుంజుకుంది.

ఇక నా విజయ ప్రయాణగాధ....

------+------------------------------

పేపర్లెస్ రచయితగా... ఒక కుగ్రామం లో పేరు ప్రఖ్యాతులు పొందిన  నా తండ్రి సుబ్బారావు గారు నా ఆలోచనలకు, రచనలకు ప్రాణప్రతిష్ట చేసిన ప్రథమగురువు. తల్లి వీరభద్రమ్మ  నాకే కాదు నా కథలకూ ప్రాణదాతే!!


తదుపరి రమారమి 50 సంవత్సరాల క్రితమే.. మా ఊరివాడైన నా జూనియర్ క్లాస్మేట్... నా స్నేహితుడు ఇప్పటి సినీ దర్శకుడు " వంశీ "... కథలు రాస్తూ...   నన్ను కూడా కథలు రాయ మని... చెప్తుండేవాడు. అప్పటి నుండి  ఎక్కువగా రాయడం మొదలు పెట్టాను.ఆ తర్వాత మా ఊరి  వారైన  సినీ గేయరచయిత

" అదృష్టదీపక్".. నా కథలు.. చదివి.. మెచ్చు కునే వారు.. దాంతో ఇంకా విరవిగా కథలు రాయడం మొదలు పెట్టాను.


1. మొదటి రచన 1975 నాటి ప్రఖ్యాత పత్రిక "ఆంధ్రసచిత్రవారపత్రిక" లో బుద్ధిలేనిమనిషి  కథ.


2. రేడియో నాటికలు  గొల్లపూడి మారుతీ రావు    గారి సమకాలంలో విరవిగా వచ్చాయి.


3. సినిమాకథలపోటీ లో అలనాటి "విజయచిత్ర"  ద్వితీయబహుమతి కథ..  "డిసెంబర్ 31 రాత్రి"


4. ఉగాది కథలపోటీ "ఆంధ్రభూమి" బహుమతి కథ


5. ఉగాది కథల పోటీలో "ఆంద్రజ్యోతి" బహు మతి కథ


6.  దీపావళి కథలు పోటీలో  "ఆంధ్రజ్యోతి" బహుమతి కథ.


7. అప్పాజోస్యుల( అమెరికా) నిర్వహించిన కథల పోటీలో "నలుగురితో నారాయణ".. ఆంధ్రప్రభ విశిష్ట కథ ప్రచురణ


8. అల్లూరి స్మారక జయంతి "కళావేదిక " కరప తిలక్ స్మారక అవార్డు కథ " బ్రతుకు జీవుడా"


9. "స్వాతి "   తానా అమెరికా కథల పోటీలో ప్రచురణ కు ఎన్నికైన కథ..." వైష్ణవమాయ."


10. రాష్ట్రస్థాయి కథలపోటీ హైదరాబాద్  "నిమ్స్"ద్వితీయ బహుమతి కథ..న్యాయనిర్ణేత శ్రీమతి యద్దనపూడి సులోచనారాణి." బంగారు పేకమేడ"


11. "అనిల్ అవార్డ్" స్వాతి కన్సోలేషన్ బహు మతి..." అమృతం  కురిసింది"


12. సస్పెన్స్ కథల పోటీ "స్వాతి" లో ఎన్నికైన కథ


13. "పులికంటి సాహితీ సంస్థ" రాష్ట్రస్థాయి పోటీలకు ఎన్నికైన కథ..


14. రాష్ట్రస్థాయి కథలపోటీ "ఆరాధన" హైదరా బాద్ ద్వితీయ బహుమతి కథ.." అదిగో స్వర్ణ యుగం"  న్యాయనిర్ణేత   జ్ఞానపీఠ అవార్డు గ్రహీత.. శ్రీ రావూరి భరద్వాజ గారు.


15. "అభ్యుదయ ఫౌండేషన్" కాకినాడ రాష్ట్ర స్థాయి అత్యుత్తమ కథ.. " ఐదేళ్ల క్రితం " .


16. సి.పి.బ్రౌన్ "సాహితీ స్రవంతి".. ప్రత్యేక కథ

" ఇంద్రలోకం".


17.  కొమ్మూరి సాంబశివరావు స్మారక  సస్పెన్సు కథల పోటీలో  "నవ్య' ప్రచురణకు ఎన్నికైన కథ.


18. "వేలూరు పాణిగ్రహి" విజయవాడ "  గాంధీ తాత"  రాష్ట్రస్థాయి ద్వితీయ బహుమతి కథ.


19. 'కదలిక'... సర్వశిక్షఅభియాన్  రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో నిర్మింపబడిన అత్యున్నత టెలీ ఫిల్మ్... చిన్న సినిమా.


20. "అల కమ్యూనికేషన్" హైదరాబాద్ కథల పోటీలో ఎంపికైన కథ...." హృదయానికి శిక్ష".


21. రాష్ట్రస్థాయి కథలపోటీ "మైత్రేయ కళాసమితి" మెదక్.. పుస్తక సంకలనానికి ఎన్నికైన కథ. "బిందెడు నీళ్లు".


22. రాష్ట్ర స్థాయి కథల పోటీలు "జాగృతి" కన్సోలేషన్ బహుమతి  కథ "ఆలస్యం అమృతం విషం"


23. రాష్ట్రస్థాయి దీపావళి కథల పోటీ  "ఆంధ్ర ప్రదేశ్" పత్రిక ప్రత్యేక బహుమతి హాస్య కథ.


24. రాష్ట్రస్థాయి దీపావళి కథల పోటీ "ఆంధ్రప్రభ" ప్రచురణకు ఎంపికైన కథ.


25. దీపావళి కథల పోటీ "ఆంధ్రభూమి" ప్రచురణ కు ఎన్నికైన కథ.


26.  రాష్ట్రస్థాయికథల పోటీ "ఆప్కో ఫ్యాబ్రిక్స్" హైదరాబాద్ నిర్వహణ  పోటీ లో ఎన్నికైన కథ.


27. రాష్ట్రస్థాయి కథలపోటీ "ఆంధ్రప్రదేశ్పత్రిక" కు ఎన్నికైన హాస్యకథలు." చంద్రమండలంలో స్థలమును అమ్మబడును".


28.దీపావళి కథల పోటీ "జాగృతి" పత్రిక కు ఎన్నికైన కథ.


29. "హాస్యానందం" విశేష స్కిట్స్ కొరకు.. "రైజింగ్ స్టార్".. అవార్డు.


30 ఆంధ్రజ్యోతి "భావ తరంగం"  వారం వారం 30 కథలు.


31. "కళా దర్బార్"  రాజమండ్రి.. రాష్ట్రస్థాయి  కవితలపోటీలలు... 4 సంవత్సరాలు ఉత్తమ  కవిత్వానికి ప్రథమ బహుమతి...మూడుసార్లు.. ఉత్తమ కవిత్వానికి ద్వితీయ బహుమతి.


32.."హాసం" మాస పత్రిక లో ప్రచురింపబడిన  "చిరాకు దంపతులు చింతకాయ పచ్చడి"    కథ చదివిన చాలా మంది సినీ ప్రముఖులు  ఫోన్ కాల్స్ చేసి అభినందించడం.


33. ప్రఖ్యాత సిరివెన్నెల పత్రికలో  సిరివెన్నెల సీతా రామశాస్త్రి గారి నిర్వహణలో జానపద పాటల పోటీలో  ప్రథమ బహుమతి  పాటకు వారి నుండి  పత్రికాముఖంగా ప్రత్యేక ప్రశం సలు.. తదుపరి ఆ పాట అనేక   రంగస్థల ప్రదర్శనలు పొందడం.


34. విశేష కథలుగా  పేరు ప్రఖ్యాతులు తెచ్చిన కథలు

  నలుగురితోనారాయణ

  కొరడా దెబ్బలు

  అమృతం  కురిసింది.

  వైష్ణవమాయ

  ఐదేళ్ల క్రితం

  ఇంద్రలోకం

  బిందెడు నీళ్లు

  చంద్రమండలంలో స్థలములు అమ్మబడును

  డిసెంబర్ 31 రాత్రి

  మహాపాపాత్ముడు

 

35. రాజమండ్రి ,కాకినాడ ,విజయవాడ, విశాఖ పట్నం ,రామచంద్రపురంలో.. విశేష సన్మానాలు.


ప్రస్తుతం...


1. ఒక పరిశోధన నవల.. ఒక చారిత్రక నవల రాసే ప్రయత్నం


2. పరిషత్ నాటికలు జడ్జిగా..


3.  కొందరు సినీప్రముఖుల ప్రోత్సాహంతో..

సినిమాలకు కథ మాటలు స్క్రీన్ప్లే అందించే ప్రయత్నం.


4. ..  4 కథల సంపుటిలు... రెండు కవితా సంపుటిలు.. 1గేయ సంపుటి.. 2 కామెడీ షార్ట్ స్కిట్స్.. రెండు నాటికల సంపుటిలు..ఒక నవల ప్రచురణ తీసుకొచ్చే ప్రయత్నం.


5. ఒక ప్రింటెడ్ పత్రిక  ప్రారంభించే ఉద్దేశ్యం.


భార్య.. గోవిందీశ్వరి... హౌస్ వైఫ్.

కుమారుడు... వెంకట రామకృష్ణ .. బి.టెక్ సాఫ్ట్వేర్ ఇంజనీర్... మైక్రోసాఫ్ట్.. హైదరాబాద్.

కోడలు... మాధురీ లత..... ఎం ఫార్మసీ.

కుమార్తె.. సౌభాగ్య.. స్టూడెంట్.

మనుమరాలు.. ఆద్య... యాక్టివ్ బేబీ.

నా కథలను ఆదరించి తమ అమూల్య అభి ప్రాయాలు తెలియజేస్తున్న... రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలందరికీ... వినమ్ర నమస్సులు.

నల్లబాటి రాఘవేంద్ర రావు 



42 views0 comments

Comments


bottom of page