#TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems, #GadwalaSomanna, #గద్వాలసోమన్న, #వందనముఅభివందనము, #VandanamuAbhivandanamu, #సోమన్నగారికవితలు, #SomannaGariKavithalu

సోమన్న గారి కవితలు పార్ట్ 35
Vandanamu Abhivandanamu - Somanna Gari Kavithalu Part 35 - New Telugu Poem Written By Gadwala Somanna Published In manatelugukathalu.com On 15/03/2025
వందనము అభివందనము - సోమన్న గారి కవితలు పార్ట్ 35 - తెలుగు కవితలు
రచన: గద్వాల సోమన్న
వందనము అభివందనము
మనసున్న మనుషులకు
వారిలోని విలువలకు
వందనము అభివందనము
సాటిలేని గుణములకు
అవనిలోన వనితలకు
వారు చూపు ప్రేమలకు
వందనము అభివందనము
మేటియైన సేవలకు
ఇంటిలోని పెద్దలకు
ఘనమైన అనుభవాలకు
వందనము అభివందనము
వారి మేలి మాటలకు
చదువు చెప్పు గురువులకు
నీడనిచ్చు తరువులకు
వందనము అభివందనము
దాహం తీర్చు చెరువులకు
భువిని తల్లిదండ్రులకు
వారి గొప్ప త్యాగాలకు
వందనము అభివందనము
జన్మనిచ్చినందులకు
నిజమైన స్నేహితులకు
అపురూప ఆత్మీయులకు
వందనము అభివందనము
మహిని శ్రేయోభిలాషులకు

ఆధారం అమ్మ
----------------------------------------
అమ్మ వంటి ప్రేమమూర్తి
ఎక్కడైనా ఉండునా!
ఆమె లేక కుటుంబాన
అభివృద్ధి సాధ్యమేనా!
అమ్మ లేని సదనంలో
ఆనందం పండునా!
ఆమె లేక సృష్టిలో
అందాలే చిందునా!
లోకాన ఆధారము
భవిష్యత్తుకు బంగారము
మాతృమూర్తి ఉంటేనే
ఇంటిలోన సింగారము
తల్లిని గౌరవించుము
గుండెల్లో పూజించుము
కష్టబెడితే మాత్రము
దీవెనలు బహు దూరము

ముత్యాల్లాంటి పలుకులు
----------------------------------------
కోకిలమ్మ గానము
నెమలమ్మ నాట్యము
అలరించునందరిని
ఆత్మీయుల స్నేహము
మూర్ఖుల ముందు మౌనము
అంతరంగ ధ్యానము
చేకూర్చును మేలులు
శుద్ధమైన హృదయము
పనికిరాని వాదము
పెంచునోయ్! విరోధము
ఆదిలో త్రుంచితే
ఎంతైనా క్షేమము
మితిమీరిన కోపము
అందరితో వైరము
తెచ్చిపెట్టు నష్టము
జీవితాన కష్టము
పుస్తకాల పఠనము
సజ్జనుల పరిచయము
అభివృద్ధికవసరము
కష్టించే తత్వము

మొక్కలే దిక్కుగా!
----------------------------------------
ప్రాణాధారమే మొక్క
ప్రకాశించేది చుక్క
మానవాళికి మహిలో
రెండూ ఉపయోగమే!
మొక్కలున్న మెండుగా
ఆరోగ్యమే దండిగా
ఎద ఎదలో పండుగ
దిగులెందుకులె దండగ!
ప్రాణమున్నది మొక్కకు
ఆవసరమే మనుషులకు
మొక్కలెన్నొ నాటాలి
జీవకోటి మనుగడకు
ప్రపంచమే పచ్చగా
జీవితాన హాయిగా
ఉండాలంటే గనుక
మన దిక్కు మొక్కలేగా

నిజాల నిప్పు కణికలు
----------------------------------------
కలసిమెలసి ఉంటేనే
చేయి చేయి కల్పితేనే
దేశాభివృద్ధి సాధ్యము
జీవితాల్లో సంబరము
మనసు మనసు కలిస్తేనే
మమకారం పుడుతుంది
కష్టపడి పని చేస్తేనే
సుఖమన్నది దక్కుతుంది
వెటకారం మానితేనే
అపకారం వీడితేనే
ఉపకారం జరుగుతుంది
సహకారం అందుతుంది
జగడాలకు కారణం
ప్రేమలేనితనం నిజం
వికసిస్తే ప్రేమ వనం
వర్ధిల్లుతుంది జగం
-గద్వాల సోమన్న
コメント