top of page
Writer's pictureSudarsana Rao Pochampalli

వాణీ శతకము

#SudarsanaRaoPochampally, #సుదర్శనరావుపోచంపల్లి, #VaniSathakamu, #వాణీశతకము, #TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems


Vani Sathakamu - New Telugu Poems Written By - Sudarsana Rao Pochampally 

Published In manatelugukathalu.com On 12/11/2024

వాణీ శతకము -  తెలుగు పద్యాలు

రచన : సుదర్శన రావు పోచంపల్లి


వాణీ శతకము.

    (కందం) 



1.) సంగీత మనగ కళయని

అంగీక రణన దెలుపను అత్రుత నుండన్

సంగీత మనగ శ్రోతకు

బంగార మనెడు సమయపు భాగ్యము వాణీ


2.) అరువది నాలుగు కళలలొ

అరుదన సంగీత కళయె అందరు మెచ్చన్

ధరణియు ధరుణము లోనను

నరులును సురలును పొగడెడి నాదము వాణీ


3.) బయకారము విజ్ఞానము గాంధర్వ

త్రయముయు సంగీత కళల త్రాణము అనగన్

హొయలును గొల్పగ గానము

మయమయి తృప్తితొ వినగను మానక వాణీ


4.) లలితము సంగీత కళలు

దెలియగ రెండగు విధములు దేశము నందున్

గళముల ఆశ్రయ మొకటియు

మలిదన తాళము మయమగు మార్గము వాణీ


5.) ప్రణవము ఓంకారము నన్

జననము సంగీత కళయె జగమున గల్గెన్

కనువిని కిశిశువు పశువుయు

వినసొంపు అనుచు వినగను విపులన వాణీ


6.) తొలిగను వేదాల వలన

దలువగ సంగీత కళలె ధరణిన గలుగన్

తొలిదగు వేదము నందునె

కలిమన గానము జగమున కానగ వాణీ


7.) స్వరములు లయముతొ పాడెడి

కరణిని స్తోభము అనెదరు కాంచగ నుండన్

తరతర మనగను మార

స్వరములు సప్తము నిలిచెను సరిగను వాణీ


8.) భారత గానము మూలము

కారణ సామము అనెదరు కానగ నుండన్

చేరగ కర్ణాటక హిందుస్థాని

పేరుతొ స్థిరపడి నిలిచెను పేర్కొన వాణీ


9.) స్వరములు అనగను ధ్వనులు

స్వరముతొ ఎన్నియొ విధముల స్వరితము లనగన్

స్వరములు సంగీతము నన  

స్వరములు సప్తము వినగను స్వాదము వాణీ


10.)  మధ్యమ పంచమ దైవత

మధ్యన గాంధార రి షభ మరియును నింకన్

తధ్యము నిషాద షడ్జము

హృద్యము ఆరొక స్వరములు అగునిక వాణీ


11.) చెవులకు ఇంపుగ నుండగ

అవునన కర్ణాటక మని అనియెద రనగన్

ఎవరును అయినను వినెదరు

కవులును పండిత ప్రముఖులు కళయని వాణీ


12.) భక్తి రస మనగ నుండను

భక్తనుసంగీత మనగ భారత మందున్

ముక్తికి మార్గము జూపెడు

శక్తిని గల్పించు ననెడు శాస్త్రము వాణీ


13.) పండిత పామరు లెందరొ

ఉండియు గానము వినెదరు ఉత్సుక తోడన్

మెండగు రాగము తాళము

దుండియు ప్రభువుయు అనగను తుష్టితొ వాణీ


14.) భక్తితొ కూడియు నుండగ 

భక్తను గానము అనుచును భజనలు సేయన్

భక్తను శ్లోకము లుండగ

భక్తితొ తాళము చరుచరు భక్తులు వాణీ


15.) కాలము గడుపుట కొరకును

మేలగు గానము వినెదరు మేదిని జనముల్

వీలగు కీర్తన శ్లోకము

మేళము జేయుచు కనగను మేలన  వాణీ


16.) కనగను నాట్యము నందున

అనగను కూచిపుడి భరత ఆడెడు చోటన్

వినగను కర్ణాటక పద

మనగను ఉండును జనముయు మానన వాణీ


17.) జావళి థిల్లాన పదము

కావలె నృత్యము ఒనరుచ కానగ నుండన్

భావము దెలుపుట కొరకును

జావళి లాంటివి పరమము జనమున వాణీ


18.) భారత దేశము నందున

పేరును బొందిన జనపద పేర్కొన నుండన్

సారము ఎరిగిన గానము

భారత మందున క్షయణము భాగ్యము వాణీ


19.) కానగ ఇమ్మను భైరవి (ఆనంద భైరవి రాగం) 

జానపద ముననె అనగను జననము గాంచన్

శానగ పల్లెల జనులన

గానము జేతురు సరిగను గరిమన వాణీ


20.) కలవన కర్ణాట కమున

దలువగ కీర్తన కృతులును తాళము గాకన్

వెలసెను స్వరజతి వర్ణము

కలవన అధికము పదములు కాంచగ వాణీ


 21.) లెక్కకు లేనగు రాగము

లెక్కువ నుండును గనగను లేవన కుండన్

చక్కగ పాడెడు వారికె

దక్కును ప్రతిభన వినగను ధరణిన వాణీ


22.)  జనకము రాగము లేనగ

కనగ ద్విసప్తతి యనగను కలిగియు నుండన్

అనగను రాగము అఖిలము

కనగను రాగపు జననము కరణము వాణీ


23.)  కనకాంగన రత్నాంగన

వనస్పతి యనెడు నవియును వరుసగ నుండన్

కనగను మానవతనియును

వినగను రాగము లననగు వింకను వాణీ


24.) సేనావ తానరూపియు

కానను ఇంకను రకములు కలిగియు నుండన్

కానగ ధేనుక రాగము

గానగ నాటక ప్రియయన గలుగగ వాణీ


 25) కోకిల ప్రియయును రూపరి (రూపవతి) 

కాకను గాయక ప్రియయన కలిగియు నుండన్

గాకను వకుళా భరణము

చేకొన నెన్నియొ గలవన చెప్పగ వాణీ


26.) కనహాటకాంబరి ఇంకను

గనగను వరుణ ప్రియ అనగ గాంచగ నుండన్

అన కీరవాణియు ననగ

మనమున ఖరహర ప్రియమను మానన వాణీ


27.)  వినగను చక్రవాకము

కనధవ ళాంబరి యనగను కాంచగ నుండన్

జనమున గౌరీ మనొహరి

అనగ గమన శ్రమమనగను అందము వాణీ


28.) రాగము లందున కనగను

రాగము రామప్రియ మన రంజిలు చుండన్

రాగము కామవర్ణిని 

రాగమునామ నారాయ ణమన రక్తియె వాణీ


29.) కనగను విశ్వంభరనగ

గనగను ధర్మవతి అనగ కాంచగ నుండన్

వినగను షణ్ముఖ ప్రియముయు

అనగను హేమవతి అనియు అనెదరు వాణీ


30.) కనగను విశ్వంభరనగ

గనగను ధర్మవతి అనగ కాంచగ నుండన్

వినగను షణ్ముఖ ప్రియముయు

అనగను హేమవతి అనియు అనెదరు వాణీ


31.) కనగను రిషిభ ప్రియముయును

వినగను వాచస్పతి అన విపులన నుండన్

జనమున మేచ కల్యాణి

ననగను చిత్రాంబ రనగ నందము వాణీ


32.) రాగము సుచరిత్ర యనగ

రాగము రసిక ప్రియన రాజిలు చుండన్

రాగము జ్యోతి స్వరూపిణి

రాగము లెన్నియొ గలవన రంజిలు వాణీ


33.) కనగనుసిం హేంద్రు మధ్యమ

వినశామ లాంగియు అనగ వీనుల విందున్

అనగను కాంతా మణియును 

అనధాతు వర్ధిని యనగ అందమె వాణీ


34.) కనగను మాయా మంగళ 

విన సూర్యకాంతముయు విన విందున్

అనగను నాసిక భూషణి

మనసుకు ఆనంద మనగ మాసర వాణీ


35.) కానగ మాటతొ వర్ణము

దానితొ పదములు పదముల దానితొ వాక్కున్

దానితొ ప్రపంచ వాడుక

దానితొ సంగీత ధ్వనియు ధరణిన వాణీ


36.) కనగను సంగీత ధ్వనియు

అనగను సాహిత్య మిళిత అనువుయు గాగన్

గనగను నాట్యము నందున

అనగను గూడను గరిమయె అగునిక వాణీ


37.) సరిగమ పదని యనునవియె

పరికించ గననగును పరిపరి విధము లనన్

సరియన పులుగులు జంతువు

అరుపులె సప్త స్వరములని అనగను వాణీ


38.) సయనగ షడ్జము కేకలు

రియనగ రిషభము అనెడును రీతిని దెల్పన్

గయనగ గాంధార మగును

మయనగ మధ్యము అనెదరు మహిలో వాణీ


39.) పయనగ పంచమ మనగను

దయనగ దైవత మనగను ధరణిలొ జూడన్

నియనగ నిషాద మనగను

నయముగ స్వరములు పలుకగ న్యాయమె వాణీ


40.) స్వరముల కలయికె రాగ

స్వరముల కాధార శృతులు సవ్వడి గాగన్

ఇరుబది రెండగు శృతులతొ

ధరణిన సంగీత ధ్వనిగ దలువగ వాణీ


41.) కవులును వ్రాసెడి కవితలు

చెవులకు ఇంపన సరిగమ చేర్చగ నుండన్

గవితలు అందము జిందగ

కవితలొ సంగీత మొగము కానగ వాణీ


42.) భారతి వీణకు కఛ్చపి

నారదు వీణకు మహతియు నామము లుండన్

నారదు తోడుగ తుంబురు

జేరియు కళవతి కలుగెను జెప్పగ వాణీ


43.) ధన్యుడు నారదు డనగను

అన్యులు ఎరుగని విధమున హరిని గొల్వన్

ధన్యత నొందగ పరవశ

మన్యుల జేయుచు మహతితొ మహిమన వాణీ


44.) అంబర వీధిన నారద

తుంబుర లిరువురు దిరుగుచు తుదకును జూడన్

సంబర పడుచును గానము

ఖంబువు నుండియె ఒనరుచు కానగ వాణీ


45.) వినగను వీణయు డోలుయు

కనగను వేణువు చిరుతలు కర్నా లనగన్

అనువగు భాన్సురి ఖుంగుయు

జనమున వాద్యపు పరికర జతలన వాణీ


46.) నాలుగు విధములు అగునన

వీలగు వాయిద్య మనెడు విషయము లనగన్

మేలగు తంత్రీ సుషిరపు

మేళము అవనద్ద ఘనము మేదిని వాణీ


47.) కనగను షెహనాయ్ సుర్నాం

వినగను నాదస్వరముయు విధమన జూడన్

మనసుకు పిల్లన గ్రోవియు

ఘనమన తంబుర ఘటముయు గాంచగ వాణీ


48.) ధ్వనులన ఎన్నియొ విధములు

వినగను తబలా మొహరియు వీనుల విందున్

గనగను డోలక్ సింగా

అనగను మందర ఢమరుక అమరిక వాణీ


49.) వినుటకు మృదంగ చెండయు

అనగను సారంగి ఇతర అనువన జూడన్ 

కనగను గోటను వాద్యం

జనముయు మెచ్చుతు వినెదరు జగమున వాణీ


50.) వినుటకు పంచముఖ మనగ

మనసుకు మంజీర మనియు మదిలో నుండన్

జనమున జంత్రయు గుమ్మెత

వినగను సొగసని అనెదరు విపులన వాణీ


51.) పక్కను వాద్యము అనగను

ఎక్కువ వినగను జనముయు ఎరిగియు నుండన్

డిక్కియు అనబడు వాద్యము

చక్కని మద్దెల ధ్వనియును చాలని వాణీ


52.) చెక్కలు మువ్వలు డప్పుయు

పెక్కుగ ధ్వనులను సలుపుచు పేర్కొన నుండన్

చక్కని విలాడి పంబై

మక్కువ గొల్పను వినెదరు మనుజులు వాణీ


53.) కరతాళ బ్రహ్మతాళము

ధరణిలొ తుల్లారు అనగ దర్జాగుండన్

అరయగ ఫిడేలు గజ్జెలు

ఎరుగగ నింకన్ కుదురుగ ఎన్నియొ వాణీ


54.) సరిగను జూడగ వాద్యము

పరికర ములనగ గనపడు పట్టియు వాడన్

అరయగ సితార కొమ్ముయు

మరియును తాళాలు ఇతర మనగను వాణీ


55.) తెలియగ హార్మోని యమన

వెలయగ శంఖం బనునది వేరుగ నుండన్

లలితము సరోడ పొమ్మలు

కలసియు నాగస్వ రముయు కాంచగ వాణీ


56.) కనగను నగార మింకను

వినగను పాముల పుణికన వీనుల కింపున్

అనగను కాళిక కొమ్మన

మనసుకు రణసింఘ మనగ మన్ననె వాణీ


57.) ఎరుగను ఏకము తారన (ఏకతార) 

అరయగ ధ్వనులన అవియును అందము అనగన్

ధరణిలొ పరికర మధికము

సరసపు సంగీత రసన సరియన వాణీ


58.) వినగను సంగీత మనగ

అనెదరు ద్వివిధము లనుచును అందులొ జూడన్

కనగను మార్గము దేశీ

యనగను రెండన దెలియగ అందమె వాణీ


59.) వినగను బ్రహ్మయు ఇతరులు

కనుగొని రనగను హరుకడ కాంచగ నుండన్

అనగను మార్గము భరతుడు

అనునత డితరుల వలనన ఆస్థము వాణీ


60.) కనగను దేశీ సంగీ

తనగను దేశము జనులును తదితర వారున్ 

వినగను హృదయము రంజిల

మనగను నేర్పెడి విధమగు మార్గమె వాణీ


61.) నృత్యము గీతము వాద్యము

సత్యము సంగీత త్రికము సహురిని యందున్ 

నిత్యము సాధన మనగన

గత్యము నేర్వగ సతతము గరిమయె వాణీ

 

62.) అనగను సంగీత కళయె

వినగను సొంపగు ఎచటను వీనుల కనగన్

అనడుహి పాలను పిండగ

కనగను కవ్వపు క్వణముయు కలుగగ వాణీ


63.) ఎక్కడ శబ్దము గలుగునొ

అక్కడ సంగీత ధ్వనులు అడరును జూడన్

చక్కగ నోటను పాడగ 

చొక్కపు సంగీత మనగ చోద్యమె వాణీ


64.) జనముయు ఔషధ రూపము

అనెదరు సంగీత మనగ అదియును గాకన్

కనగను ఠవఠవ దొలగును

మనమున జెందగ ననగను మనిషికి వాణీ


65.) జలజల వర్షము గురియగ

గలగల ఏరుయు గిరికొన గానగ నుండన్

జలపాత హోరు జూడగ

కలుగును సంగీత రవము కాంచగ వాణీ


66.) వేదము జదివెడి చోటను

నాదము సంగీత మువలె నగునన జూడన్

మోదము గలిగెడి రీతిన

వేదపు మంత్రము వినబడు వేళనె వాణీ


67.) వినగను సైనిక సాధన

కనగను బాలురు జదివెడు కరణియు గానన్

వనధికి చెంతన హోరుయు

అనగను సంగీత నిగద ఔనన వాణీ


68.) సొంపగు నాదము లన్నియు

ఇంపగు సంగీత ధ్వనులు ఇలలో జూడన్

రంపపు సవ్వడి గూడను

ఇంపగు చుండును వినగను ఇష్టమె వాణీ


69.) పక్షుల కిలకిల రావము

మక్షిక ఝుమ్మను ధ్వనియును మరియును జూడన్

రక్షణ శాఖలొ కసరతు

శిక్షణ సంగీత మనక చిత్రమె వాణీ


70.) భక్తితొ సంగీత మనగ

ముక్తికి మార్గము అనెదరు ముదముతొ భక్తుల్

శక్తియు కొలదిగ రాగము

రక్తియు గట్టియు వినగను రాజిలు వాణీ


71.)   నాదము బ్రహ్మము అనగను

నాదమె సంగీత ధ్వనియు నానా విధముల్

వేదము నుండియె బుట్టెను

వాదము లేకను వినగను వసుధన వాణీ


72.)  సంగీత మనబడు ధ్వనుల

సంగతి వినగను మహిమలు సరిగను బాలున్

కుంగక ఈయును ఇంకను

బంగరు పంటలు సమకొను బాగుగ వాణీ


73.) అమ్మయు జోయని పాడగ

కమ్మని సంగీత మనగ కలిగియు నుండన్

సమ్మత మొందుచు శిశువులు

కమ్మని నిదురతొ సుఖపడు కానగ వాణీ


74.) అష్టప దులవల ననగను

ఇష్టముగ జయదేవు డనగ ఇలలో జూడన్

కష్టము అనకను బలపడు

దృష్టితొ సంగీత కళల దృఢపడ వాణీ


75.) అన్నమయ క్షేత్రయ యనను

దన్నుగ సంగీత ఉనికి ధరణిన బెంచన్

ఎన్నగ త్యాగయ గూడను

మన్నన నొందగ దలచిరి మహిలో వాణీ


76.) వినగను నారాయణనగ

ఘనుడగు రాందాసితరులు గానగ నుండన్

జనమున సంగీత విలువ

మనసిడి బెంచిరి కనగను మహిలో వాణీ


77.) డమరుక మనగను శివునికి

సమధిక భూషణ మనగను శంకరు డెపుడున్

డమరుక నాదము తోడనె

ఉమతో నాట్యము సలుపుచు ఉండును వాణీ


78.)  నయనగ నదియెను ప్రాణము

దయనగ అర్థము అగిరము దలయగ నుండన్

మయనగ గూడగ నాదము

మెయినను జనియించె ననగ మేలిమి వాణీ


79.) కుంభిని సంగీత మనగ

సంభవ మనగను సకలము సంత్రుప్త నగన్

రంభయు ఊర్వసి గూడను

సంభవ మెరుగక గదులరు సర్మము వాణీ


80.) సాధన జేయుట వలననె

మేదిని సంగీత పసయు మేలగు విధమున్

నాదము తీరుయు దెలియును

బాధయు లేకను ముదమన భాగ్యము వాణీ


81.) కళలలొ సంగీత మనెడు

కళయెను మిక్కిలి మధురము కానగ నుండన్

ఇలలో గానము మించిన

కళయన యెరుగరు జనులును కాంచగ వాణీ


82.) ఇరువది రెండన స్వరములు

ఎరుగగ నుండగ పరమము ఏడన నుండన్

సరిగమ పదనియె అధికులు

మరువక నేర్తురు పుడమిన మానక వాణీ


83.) డమరుక మనగను శివునికి

సమధిక భూషణ మనగను శంకరు డెపుడున్

డమరుక నాదము తోడనె

ఉమతో నాట్యము సలుపుచు ఉండును వాణీ


84.) జననము సామము నుండియె

కనగను సంగీత కళలు కానగ నుండన్

వినగను భారత గానం

బనగను నదియెను అనెదరు భరణిన వాణీ


85.) శుభమన జరిగెడి చోటను

సభయన జరిగెడి తలమున సభికులు మెచ్చన్

విభవము అనగను గానము

రభసన కుండను లలితము రంజిల వాణీ


86.) మద్దెల చప్పుడు లేకను

ముద్దెటు లగునిక వివహము ముదమన జరుపన్

సద్దన గలుగక ఇంటవి

రుద్ధము అనబడు వివహపు రూపము వాణీ


87.) తీగల వలనన ధ్వనులును

వేగియు వలనన ఘురణము వేల్పుల లేపన్

సాగని చర్మము తోడను

బాగన సవ్వడి ఘనముతొ బలముగ వాణీ


88.) బడిలో గంటలు వినగను

గుడిలో రవణియు మొరయను గుర్తుకు రాగన్

వడివడి పరుగిడు పిల్లలు

పుడమిన బడికని ప్రముఖులు పూజకు వాణీ


89.) సున్నిత నాదము వినగను

ఎన్నిక జేతురు మృజములు ఎరుగగ నుండన్

సన్నని రాగమె సరసము

విన్నను తృప్తియు గలుగును విశదము వాణీ


90.) అనిలో భేరీ నాదము

రణముయు మొదలిడ మొరయను రాజ్యము నందున్

జనమున సున్నిత రాగము

వినగను తృప్తియు గలుగును విపులన వాణీ


91.)  పల్లవి తోడుడ పాటలొ

పిల్లన గ్రోవియు పలుకగ ప్రీతియు గలుగన్

మెల్లని రాగమె సరసము

ఉల్లము రంజిలు వినగను ఒనరగ వాణీ


92.) పరభృత పలుకుల సవ్వడి

ఉరగారి అరుపుయు వినగ ఉండు స్వరంబుల్

నిరతము ఝుమ్మని మధుపము

విరులలొ మధురము చవిగొను విధమన వాణీ


93.) సొంపగు పరిమళము పురా

ఇంపగు పరవళ్ళు దుముక ఇంకను జెప్పన్

వంపులు దిరుగుచు పయనిడ

పెంపగు సంగీత ధ్వనులు పేర్కొన వాణీ


94.) జవ్వని యశోద ఘోషలొ

కవ్వము బట్టియు తయిరును కలచగ నుండన్

సవ్వడి సంగీత మనగ

కవ్వడి మిత్రుడు వినగను కదలడు వాణీ


95.) ధరణిన కదలిక లన్నియు

అరయగ సంగీత ధ్వనులె అగునిక ననగన్

హరిహర బ్రహ్మలు సహితము

సరకము కైలాస మొలయు సవ్వడె వాణీ


96.) రాగము తానము పల్లవి

కాగను సంగీత కళగ కాంచగ నుండన్

మోగను పరికర ములనగ

రాగము తోడై ప్రబలగ రమ్యమె వాణీ


97.) ధ్వనియన అనగను దైవము

కనగను సంగీత భూతి కలిగెను అందున్

జనమున శబ్దము వినగను

మనమున బుట్టగ మరియిక మరువరు వాణీ


98.) భాషయు లేనగు భావము

దోషము ఎరుగక మనసుకు దోచగ నుండన్

ఆషయు వ్యాపిత మనగను

ఘోషయె సంగీత పొలుపు గోమన వాణీ


99.) వీణను బట్టిన వాణియు

మేనక ఆత్మజ జలధిజ మేలును జేయన్

వీణా పాణినె జనులును

కానగ గానము భగవతి కలుగగ వాణీ


100.) నారదు డెప్పుడు మహతిని

నేరడు విడువగ మనసిడి నెరుగగ నుండన్

శారద అటులనె వదులదు

భారము కఛ్చపి అనుచును పరువున వాణీ


101.) సరిగమ పదనిలొ స్వరములు

సరియగు షడ్జము అనగను సర్పభు క్కనగన్

మరియును రియనగ రిషభము

సరిపడు గాంధారి గయగు ఛగలన వాణీ


102.) అరయగ మధ్యము క్రౌంచము

పరితమె పంచమ మనగను పాడును జూడన్

మరియును దైవతము గుర్రము

కరియగు నిషధము అనగను కాంచగ వాణీ


103.) త్యాగయ త్రిమూర్తు లందు

త్యాగబ్రహ్మనగ గుణుతి తనరగ బొందన్

రాగము నాదము శ్లాఘము

కాగను దేవుని అడపొడ కలుగను వాణీ


104.) చిన్నగ ఉండగ నేర్వను

చెన్నుగ సంగీత మనగ చెప్పగ వచ్చున్

అన్నియు రాగము లలవడు

మన్నిక చెందెడు విధమున మనసుకు వాణీ


105.) చదువన పెద్దగ జదువక

కుదురుగ సంగీత మనగ కూర్చొని నేర్వన్

పదుగురు మెచ్చెడి రీతిగ

మదిలో కెక్కును పఠనము మంచిగ వాణీ


106.) వానరు డయ్యును హనుమయు

కానగ సంగీత కళయు కలిగెను జూడన్

వీణయు బట్టక వెదురుతొ

గానము జేసెను భువిజన గానగ వాణీ


107.) ప్రేగులు తంత్రులు జేసియు

బాగుగ మీటెను ఇరువది బాహువు డనగన్

వేగము చండుడి దర్శన

మేగని కోర్కెలు తెలుపగ మేలని వాణీ


108.) ధరణిన సంగీత మనగ

శరనిధి లోతుకు అధికము సరిగను జెప్పన్

పురణము పూర్తిగ ఈదిన

విరివియె సంగీత మనగ విపులన వాణీ

                                                                          

***

సుదర్శన రావు పోచంపల్లి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:

పేరు-సుదర్శన రావు పోచంపల్లి

యాదాద్రి భువనగిరి జిల్లాలోని జిబ్లక్పల్లి గ్రామము.(తెలంగాణ.)

వ్యాపకము- సాహిత్యము అంటె అభిరుచి

కథలు,శతకాలు,సహస్రములు,కవితలు వ్రాస్తుంటాను

నేను విద్యాశాఖలో పనిచేస్తు పదవి విరమణ పొందినాను,

నివాసము-హైదరాబాదు.


16 views0 comments

Comments


bottom of page