వరద
- Hanumantha
- Jan 3, 2023
- 2 min read

'Varada' New Telugu Story
Written By Hanumantha T
రచన: T హనుమంత
(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)
“ఈ ఏడు పంటలు బాగా పండాయి. దొరగారి బాకీ మొత్తం కట్టేసి పిల్లలను బాగా సదవించాలి మామా! ఇన్నిరోజులు పడ్డ కష్టాలు ఈ పంటతో తీరిపోతాయి” అన్నాడు అల్లుడు.
“అవును అల్లుడూ.. నేను కూడా చేసిన అప్పంత తీరుస్తాను” అన్నాడు మామ.
“ఈ సారి మాగాణి అంతా పంటలతో నిండి పోయిండాది. బొమ్మయ్య మామ కూడా కూతురి పెండ్లికి, ఆయన పెండ్లానికి ఆసుపత్రికి శాన అప్పులు చేసినాడు. ఈ పంటతో మొత్తం అప్పులు తీరుతాయి కదా మామ” అన్నాడు అల్లుడు.
“అన్నట్టూ ఈ రోజు రచ్చబండ తాన జనాలంతా కలిసినారంట పోదామా అల్లుడూ..”
“అవునా ఎందుకు మామా?”
“వచ్చే మూడు రోజుల నుండి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. రైతులంతా గమనించి చేతికొచ్చిన పంటను కోయాలని ప్రభుత్వం వారి హెచ్చరిక - అని సర్పంచ్ గారు తెలియజేశారు. అది ఇన్న జనాలంతా మన వంక కు ఆనకట్ట కట్టాలని సెప్పినా ప్రభుత్వం ఏమి పట్టించుకోలేదు. ఈ వర్షానికి గనక మన వంక పొంగిందంటే మొత్తం మాగాణి కొట్టుకొని పోతుంది. అదే గనక జరిగితే ఇన్ని రోజుల కష్ట మంతా, ఆశలన్నీ వల్లకాడైపోతాయి.
అకాల వర్షానికి ఎవరు బాధ్యులు కాలేరు. కానీ వర్షానికి ఇంకా మూడు రోజుల గడువుంది. కోతలు కోయడానికి సిద్దమవ్వండి. పంట నష్టపరిహారాన్ని తెలుపుతూ పై అధికారికి అర్జీ పెడతాను’ అన్నారు సర్పంచ్ గారు.” ’ అని చెప్పాడు మామ.
జనాలంతా ఆత్రంగా పంట కోయడం మొదలుపెట్టారు. పసిపిల్లల నుండి పండు ముసలి వరకు అంతా పనిచేయ బట్టినారు. తుపాను గాలులు వీయడం మొదలుపెట్టాయి పంట కోత నుండి నూర్చడం వరకు వచ్చింది. నూర్చడానికి యంత్రాలు లేకపోవడం వల్లా తొందరగా అవడంలేదు. సెప్పిన సమయానికన్నా ముందే సినుకులు పడటం వల్ల ఎక్కడి గడ్డి అక్కడే, గింజలు అట్లాగే ఉండిపోయాయి. పొద్దు మునుగుతావుంది, సంచులల్లో వడ్లను నింపి గట్లకు తోలడం ప్రారంభించారు, కాని సినుకులు గట్టిగా పడటం వల్ల ఎద్దులు లాగలేక పోతున్నాయి.
ఉరుములు, మెరుపులతో తుపాను ముంచుకొస్తోంది, అయినా అలాగే కష్టపడుతున్నారు, వంక పొంగుతోంది. ఆనకట్ట లేకపోవడం వల్లా నీరు సరాసరి పంటలోకి సేరుతోంది. నింపిన సంచులన్ని, గడ్డి కూడా వంక ఉదృతికి కొట్టుకొని పోతున్నాయి. సికట్లో వాళ్ళు సేసేది ఏమీలేక చూస్తూ ఉండి పోయినారు. బొమ్మయ్య మామ అప్పులు తీరవు అనే భయంతో గుండె పోటు తో మరణించే..
జనాలంతా ఏడుస్తూ వంక ఉదృతిలో కొట్టుకొని పోయే ఎద్దులను, సంచులను పట్టుకోవడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. రేయల్లా అలాగే వర్షం పడుతూ వుంది.
తెల్లారినా కూడా తుపాను ఇడ్సలేదు. జనాలంతా సర్పంచ్ గారిని తోడుకొని మండల ఆఫీసుకు పొయినారు. ఆ రోజంతా అక్కడే ఉండి, మరుసటి రోజు కలెక్టర్ గారు వచ్చినంక వాళ్ళ మొరను విన్నారు. తరువాత వాళ్ళ ఊరికి వచ్చి అంతా లెక్కలు వేసి, పంట నష్టపరిహారాన్ని ఇస్తామన్నారు.
వంకకు ఆనకట్ట కట్టిస్తామని సెప్పినంక, పంట మునిగిపోయినా ఆనకట్ట కడతామన్నందుకు సంతోషించారు ఆ గ్రామస్థులు.
సమాప్తం
T హనుమంత గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
కథలు, నవలలు మరియు జోకుల పోటీల వివరాల కోసం
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
Podcast Link
Twitter Link
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం: పేరు: హనుమంత
జిల్లా: అనంతపురము
డిగ్రీ 3వ సంవత్సరం
Comentarios