The Best Story Of The Week Prize Awarded By
విషయ సూచిక : 1. NON STOP PRIZES ( వారం వారం బహుమతులు ): JULY 2022 2. రచయితలను ప్రోత్సహించడంలో మీరూ భాగస్వాములు కండి. 3. విజయదశమి 2022 కథల పోటీలు 4. ఉగాది 2023 సీరియల్ నవలల పోటీలు 5. విజయదశమి 2022 నవ్వించండి - జోకుల పోటీలు 6. రచయితలకు సన్మానం మరియు బిరుదు ప్రదానం 7. పాపులర్ రైటర్ 2022 అవార్డు 8 . మరిన్ని ముచ్చట్లు 1 . NON STOP PRIZES ( వారం వారం బహుమతులు ): JULY 2022 రచయితల, పాఠకుల ఆదరణ పొంది, ఇతరులకు ఇన్స్పిరేషన్ కలిగించిన NON STOP PRIZES ( వారం వారం బహుమతులు ) పథకాన్ని 15/09/2022 వరకు పొడిగించాలని నిర్ణయించాము. ఇందులో ఎంపికైన కథలు మాత్రమే విజయదశమి 2022 కథల పోటీకి అర్హమవుతాయి. JULY 2022 నెలకు ఎంపిక కాబడ్డ ఈ వారం ఉత్తమ కథల వివరాలు ప్రకటిస్తున్నాము. బహుమతి పొందిన రచయితలకు ఈ- ప్రశంసా పత్రం పంపించాము. బహుమతి మొత్తాన్ని21/08/2022 న వారి ఖాతాలకు జమ చేస్తాము. అందమైన కిటికీ పెండేకంటి లావణ్య కుమారి శుభమస్తు డా: కనుపూరు శ్రీనివాసులు రెడ్డి హత్యో హత్యతి హంతకః వసుంధర
ముద్ద మందారం మధువాణి సెంటిమెంట్ కాలనోస్
JULY నెలలో ఎక్కువ జోక్స్ పంపి రూ: 116/- గెలుపొందిన వారు: ఓట్ర ప్రకాష్ రావు రచయితలకు మా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాం. 2. రచయితలను ప్రోత్సహించడంలో మీరూ భాగస్వాములు కండి.
ప్రముఖ రచయిత, బ్లాగర్, వ్లాగర్ బివిడి ప్రసాదరావు గారు, మేము అందించే వారం వారం బహుమతులలో ప్రతినెలా ఒక కథకు బహుమతిని ఒక సంవత్సరం పాటు స్పాన్సర్ చేస్తున్నారని తెలియజేయడానికి సంతోషిస్తున్నాము.
వీరి పూర్తి వివరాలు ఈ క్రింది లింక్ ద్వారా తెలుసు కోవచ్చు. https://about.me/bvdprao నిర్వహణ వ్యయం అధికంగా ఉన్నా, రచయితలను ప్రోత్సహించే ఉద్దేశంతో వివిధ రకాల బహుమతులు ప్రకటిస్తున్నాం. మనతెలుగుకథలు.కామ్ వారు రచయితలకు అందజేస్తున్న బహుమతులలో మీరు కూడా పాలు పంచుకోవచ్చు. మీ పూర్వీకుల స్మృత్యర్థం లేదా మీకిష్టమైన వారి పేరు మీద లేక మీ పేరు మీద ఈ బహుమతులు అందజేయవచ్చు. అందుకు ఈ క్రింది వాటిలో ఒక పద్ధతిని ఎంచుకోవచ్చు. 1. మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింప బడ్డ కథలలో ప్రతినెలా ఒక ఉత్తమ కథను మీరే ఎంపిక చేసి Rs 250/- బహుమతిగా అందజేయవచ్చు. ప్రతి నెలా మేము అందజేస్తున్న వారం వారం బహుమతులతో పాటు మీరు ఎంపిక చేసిన కథ ఫలితం కూడా ప్రకటిస్తాం. ఆ పోస్ట్ లోనే మీరు ప్రతి నెలా ఒక కథను ఎంపిక చేసి బహుమతిని అందజేస్తున్నట్లు ప్రకటిస్తాం. అంటే ఒక సంవత్సర కాలంలో మీరు Rs:౩౦౦౦/- రచయితలకు మీ పేరు మీద / మీరు కోరుకున్నవారి స్మృత్యర్థం బహుమతులుగా అందజేయవచ్చు. మీరు వద్దనుకుంటే మధ్యలోనే విరమించుకోవచ్చు. మేము అందజేసే బహుమతులు/ పోటీలలో మీరు యధావిధిగా పాల్గొనవచ్చు. 2. సంవత్సరంలో మీకు ఇష్టమైన ఒకరోజు ( మీ పూర్వీకుల పుట్టిన రోజు/వర్ధంతి రోజు / మీ పుట్టిన రోజు ) బహుమతిని అందజేసే విధంగా ఆ సంవత్సర కాలంలో ప్రచురింప బడ్డ కథల్లో ఒక / కొన్ని కథలను మీరే ఎంపిక చేసి బహుమతులను అందజేయవచ్చు. బహుమతి మొత్తం మీరే నిర్ణయించవచ్చు. 3. మనతెలుగుకథలు.కామ్ లో మీరే ఒక శీర్షిక నిర్వహించవచ్చు. ఉదాహరణకు.. మొదలు నాది... ముగింపు మీది.. ఒక కథను మీరు సగం మాత్రం రాసి పంపండి.దాన్ని మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురిస్తాం. ముగింపును. పాఠకులనుండి/ఇతర రచయితలనుండి ఆహ్వానిస్తాం. వాటిని మీకు ఫార్వార్డ్ చేస్తాం. మీకు నచ్చిన ముగింపును మీరే ఎంపిక చేసి 250/- బహుమతి అందజేయండి. మీరు ఎంపిక చేసిన ముగింపుని కూడా ప్రచురిస్తాం. గమనిక: బహుమతి అనేది రచయితకు ఒక బూస్టర్ లాంటిది. బహుమతి మొత్తం కంటే తమకు ఒక గుర్తింపు వచ్చిందనేది రచయితకు కొండంత బలాన్నిస్తుంది. మరిన్ని రచనలు చేయాలనే సంకల్పాన్ని ఇస్తుంది. 3. విజయదశమి 2022 కథల పోటీలు సంక్రాంతి 2021, విజయదశమి 2021 మరియు ఉగాది 2022 కథల పోటీలు విజయవంతంగా పూర్తి చేసిన సందర్భంగా రచయితలకు, పాఠకులకు ముందుగా మా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము NON STOP PRIZES ( వారం వారం బహుమతులు ) విభాగం లో ఇప్పటి వరకు దాదాపు 200 మందికి పైగా రచయితలకు/రచయిత్రులకు గౌరవ పారితోషకం తో పాటు E - ప్రశంసా పత్రాలు అందజేశాము. ఇప్పుడు విజయదశమి 2022 కథల పోటీని ప్రకటిస్తున్నాము. విజయదశమి 2022 కథల పోటీ బహుమతుల వివరాలు : ఏకైక ప్రథమ బహుమతి రూ: 5000 /- ఐదు ప్రత్యేక బహుమతులు ఒక్కొక్కటి రూ: 500 /- మీరు నూతన రచయితలయినా, లబ్ద ప్రతిష్ఠులైన రచయితలైనా బహుమతులు పొందడానికి సమాన అవకాశాలు వున్నాయి. బహుమతుల ఎంపిక నిష్పక్షపాతంగా జరుగుతుంది. బహుమతుల ఎంపికలో పాఠకుల అభిప్రాయాలు కూడా పరిగణనలోకి తీసుకొనబడతాయి. నిబంధనలు : *కథ నిడివి రచయిత సౌకర్యాన్ని బట్టి ఉండవచ్చు. *కాపీ కథలు, ఇదివరకే ప్రచురింపబడ్డ కథలు, అనువాద కథలు, ఇతర పత్రికలలో పరిశీలనలో ఉన్న కథలు పంపరాదు. *ఇదివరకే ప్రింట్ మీడియాలో గానీ, వెబ్ సైట్లలో గానీ , బ్లాగ్ లలో గానీ ఇతర గ్రూప్ లలో గానీ ప్రచురింపబడ్డ కథలు బహుమతులకు పరిగణింపబడవు. ఆ మేరకు హామీ పత్రం జత చేయాలి. *ఒకరు ఎన్ని కథలయినా పంపవచ్చును. మీ రచనల్లో అచ్చు తప్పులు, వ్యాకరణ దోషాలు లేకుండా ఒకటికి రెండు సార్లు పరిశీలించి పంపండి. *వెంటనే మీ కథలను 'మనతెలుగుకథలు.కామ్' వారికి పంపించండి. * మీ కథలను మా వెబ్ సైట్ లోని అప్లోడ్ లింక్ ద్వారా పంపండి. *లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. *పి.డి.ఎఫ్ రూపంలో పంపే కథలు పరిశీలింపబడవు. *కథలు మాకు చేరవలసిన చివరి తేదీ : 15 /09 /2022 *ఫలితాలు 15/10/ /2022 న 'మనతెలుగుకథలు.కామ్' లో ప్రచురింపబడతాయి. *తుది నిర్ణయం 'మనతెలుగుకథలు.కామ్' వారిదే. *ఈ విషయమై ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలకు తావు లేదు. *ప్రచురింపబడే అన్ని రచనల పైనా మనతెలుగుకథలు.కామ్ వారికి పూర్తి హక్కులు ( పోడ్కాస్ట్ చెయ్యడం, యు ట్యూబ్ లో ఉంచడం లాంటివి) ఉంటాయి. *మనతెలుగుకథలు.కామ్' యాజమాన్యం, వారి కుటుంబ సభ్యులు, సన్నిహితులు బహుమతులకు అనర్హులు. *NON STOP PRIZES ( వారం వారం బహుమతులు ) విభాగం లో ఎంపికైన కథలు మాత్రమే విజయదశమి 2022 బహుమతులకు అర్హమవుతాయి. *బహుమతులను పాక్షికంగా గానీ, పూర్తిగా గానీ రద్దు చేయడానికి, మార్పులు చేయడానికి మనతెలుగుకథలు.కామ్ వారికి పూర్తి హక్కులు ఉన్నాయి. 4. ఉగాది 2023 సీరియల్ నవలల పోటీలు ఉగాది 2023 సీరియల్ నవలల పోటీ బహుమతుల వివరాలు : ఏకైక ప్రథమ బహుమతి రూ: 15000 /- ఐదు ప్రత్యేక బహుమతులు ఒక్కొక్కటి రూ: 1000 /- మీరు నూతన రచయితలయినా, లబ్ద ప్రతిష్ఠులైన రచయితలైనా బహుమతులు పొందడానికి సమాన అవకాశాలు వున్నాయి. బహుమతుల ఎంపిక నిష్పక్షపాతంగా జరుగుతుంది. బహుమతుల ఎంపికలో పాఠకుల అభిప్రాయాలు కూడా పరిగణనలోకి తీసుకొనబడతాయి. నిబంధనలు : *సీరియల్ నవల కనీసం పది భాగాలుగా ఉండాలి. అంతకన్నా ఎక్కువ ఉండవచ్చు. *ప్రతి భాగంలో సుమారు 8౦౦ పదాలు ఉండాలి. *వారానికి ఒక ఎపిసోడ్ ప్రచురింపబడుతుంది. *మొత్తం నవల ఒకేసారి పంపాలి. *రచయితలు తామే ఎన్ని వారాలు ప్రచురించాలనుకుంటున్నారో అన్ని భాగాలుగా విభజించి పంపాలి. *మరుసటి భాగం కోసం పాఠకులు ఎదురు చూసేలా రాయాలి. *సీరియల్ నవలలు పంపాల్సిన చివరి తేదీ 15/01/2023.
*కాపీ నవలలు, ఇదివరకే ప్రచురింపబడ్డ నవలలు, అనువాద నవలలు, ఇతర పత్రికలలో పరిశీలనలో ఉన్న నవలలు పంపరాదు. *మీ రచనల్లో అచ్చు తప్పులు, వ్యాకరణ దోషాలు లేకుండా ఒకటికి రెండు సార్లు పరిశీలించి పంపండి. *ఇదివరకే ప్రింట్ మీడియాలో గానీ, వెబ్ సైట్లలో గానీ , బ్లాగ్ లలో గానీ ఇతర గ్రూప్ లలో గానీ ప్రచురింపబడ్డ నవలలు బహుమతులకు పరిగణింపబడవు. ఆ మేరకు హామీ పత్రం జత చేయాలి. *ఒకరు ఎన్ని సీరియల్ నవలలైనా పంపవచ్చును. *వెంటనే మీ నవలలను మా వెబ్ సైట్ లోని అప్లోడ్ లింక్ ద్వారా పంపండి. * మీ నవలలను మా వెబ్ సైట్ లోని అప్లోడ్ లింక్ ద్వారా పంపండి. లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. *పి.డి.ఎఫ్ రూపంలో పంపే నవలలు పరిశీలింపబడవు. *ఫలితాలు 15/03/2023 న 'మనతెలుగుకథలు.కామ్' లో ప్రచురింపబడతాయి. *తుది నిర్ణయం 'మనతెలుగుకథలు.కామ్' వారిదే. *ఈ విషయమై ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలకు తావు లేదు. *గమనిక: ప్రచురింపబడే అన్ని రచనల పైనా మనతెలుగుకథలు.కామ్ వారికి పూర్తి హక్కులు ( పోడ్కాస్ట్ చెయ్యడం, యు ట్యూబ్ లో ఉంచడం లాంటివి) ఉంటాయి. *మనతెలుగుకథలు.కామ్ లో ఒకసారి ప్రచురింపబడ్డ కథలు, నవలలు ఎట్టి పరిస్థితులలోను తొలగింప బడవు. ఇందుకు సమ్మతించేవారే తమ రచనలను పంపవచ్చు. *మనతెలుగుకథలు.కామ్' యాజమాన్యం, వారి కుటుంబ సభ్యులు, సన్నిహితులు బహుమతులకు అనర్హులు. *బహుమతులను పాక్షికంగా గానీ, పూర్తిగా గానీ రద్దు చేయడానికి, మార్పులు చేయడానికి మనతెలుగుకథలు.కామ్ వారికి పూర్తి హక్కులు ఉన్నాయి. 5. విజయదశమి 2022 నవ్వించండి - జోకుల పోటీలు ప్రతి నెలా అత్యధికంగా జోకులు పంపినవారికి Rs 116/- పారితోషికంగా అందజేస్తాము. 20/09/2022 నాటికి ఎక్కువ జోకులు ప్రచురింపబడ్డ వారికి Rs 1000/- బహుమతిగా అందజేస్తాము.
ఫలితాలు 15/10/2022 న ప్రచురిస్తాము. జోక్స్ ప్రచురించినట్లుగా ఇంటిమేషన్ ఇవ్వడం సాధ్యం కాదు. మీ జోకుల్నిwww.manatelugukathalu.com విసిట్ చేసి ప్రచురింపబడ్డదీ, లేనిదీ తెలుసుకోవచ్చు. ఈ విషయంగా ఉత్తర ప్రత్యుత్తరాలు జరుపబడవు. సాధారణంగా జోక్స్ ని మూడు రోజుల్లోగా ప్రచురిస్తాము. అన్ని జోక్స్ నూ ఒకే పోస్ట్ లో అప్డేట్ చెయ్యడం జరుగుతుంది. 6. రచయితలకు సన్మానం మరియు బిరుదు ప్రదానం రచయితలకు సన్మానం కార్యక్రమం మరియు బిరుదు ప్రదానం 30/10/2022 న నిర్వహించాలని నిర్ణయించాము.
వెన్యూ కన్ఫర్మ్ అయిన తరువాత అర్హులైన మా ప్రియతమ రచయితలకు వ్యక్తిగతంగా మెయిల్ చేస్తాము. పూర్తి వివరాలు 15/10/2022 న మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురిస్తాము.
ఈ కార్యక్రమ నిర్వహణ గురించి అనుభవజ్ఞులు అయిన రచయితల/ పాఠకుల సూచనలు,సలహాలు కోరుతున్నాం.
మీ సూచనలను 63099 58851 నంబర్ కు వాట్స్ అప్ ద్వారా పంపండి.
7. పాపులర్ రైటర్ 2022 అవార్డు ప్రారంభించిన నాటి నుండి పోటీలు నిర్వహిస్తూ బహుమతులు అందిస్తున్న మనతెలుగుకథలు.కామ్ వారు ఇప్పుడు పాపులర్ రచయిత/రచయిత్రి 2022 అవార్డు అందిస్తున్నారు. ఈ అవార్డు పూర్తిగా పాఠకుల ఆదరణను బట్టి ఉంటుంది. 15/10/2021 తో మా విజయదశమి కథల పోటీ ముగిసింది. కాబట్టి 16 /10 /2021 నుండి 15 /09 /2022 వరకు ప్రచురింప బడే కథలనుండి ఈ అవార్డు ఎంపిక చెయ్యబడుతుంది. ఈ అవార్డును ఒక రచయిత/రచయిత్రి మొత్తం రచనలను పరిగణించి ప్రకటించడం జరుగుతుంది. 1. మనతెలుగుకథలు.కామ్ వెబ్ సైట్ www.manatelugukathalu.com 2. మనతెలుగుకథలు.కామ్ పోడ్ కాస్ట్ https://linktr.ee/manatelugukathalu 3. మనతెలుగుకథలు.కామ్ యూ ట్యూబ్ ఛానల్ https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ ఈ మూడింటిలో కలిపి, రచయిత/రచయిత్రుల మొత్తం రచనలకు కలిపి పాఠకుల జనాదరణ ఎంత వుందో పరిగణించి అవార్డు ను బహుకరించడం జరుగుతుంది. పాఠకుల జనాదరణ శాస్త్రీయ పద్ధతిలో పరిశీలింప బడుతుంది పాఠకులు కథను కేవలం క్లిక్ చెయ్యడం కాకుండా, చదవడానికి ఎంత సమయం కేటాయించారు, కొత్తగా ఎంతమంది సబ్స్క్రయిబ్ చేశారు అనే విషయాలు పరిగణిస్తాము. మా ప్రియమైన రచయితలు/రచయిత్రులు వ్యూస్ పెంచడం కోసం అశాస్త్రీయ పద్ధతులు వాడరని ఆశిస్తున్నాము. అవార్డు విజేతకు 1౦౦౦౦/-బహుమతి ఉంటుంది. ఐదు కన్సోలేషన్ బహుమతులు ఒక్కొక్కటి 5౦౦/- ఇవ్వబడతాయి. ఈ అవార్డు కోసం విడిగా రచనలు పంపవలసిన అవసరం లేదు. 16/10/2021 నుండి 15/09/2022 ప్రచురింప బడే కథలన్నీ ఈ అవార్డు కు పరిశీలింప బడతాయి.
ఫలితాలు 15/10/2022 న ప్రచురిస్తాము.
ఈ అవార్డు కు ఇతర బహుమతులతో సంబంధం లేదు.
రచయిత/రచయిత్రులు ఇదివరకే ప్రకటించిన ఉగాది బహుమతులు, వారం వారం బహుమతులు, భవిష్యత్తులో ప్రకటించబోయే బహుమతులు ఎప్పటిలాగే గెలుచుకోవచ్చు.
మాకువచ్చిన అన్ని కథలనూ పోడ్కాస్ట్ చెయ్యడం/యూట్యూబ్ లో ఉంచడం చేయలేము.
రచయితలు/రచయిత్రులు తమ కథలను పంపేటప్పుడు కథ, వింటే కూడా అర్ధమయ్యే విధంగా రాయవలసిందిగా కోరుతున్నాము.
8. మరిన్ని ముచ్చట్లు
ప్రతి రచయితకు వారి కథల తాలూకు లింక్ లను మెయిల్ ద్వారా, వాట్స్ అప్ ద్వారా పంపుతున్నాము. కానీ కొంతమంది రచయితలు ఆ లింక్ లను ఎవరికీ షేర్ చెయ్యక పోవడం వలన తక్కువ మంది మాత్రమే వారి కథలను చదువుతున్నారు.
మంచి కథ వ్రాయడమే కాదు. ఆ కథ ఎక్కువ మంది చదివేలా అందరం ప్రయత్నించాలి. అలాగే మీ కథలకు కామెంట్ చెయ్యడం, లైక్స్ పెట్టడం తెలియని వారికి నేర్పించండి.
మరి కొంతమంది ఇతరుల రచనలను అసలు టచ్ చేయడం లేదు. తోటి రచయితల రచనలను చదివి ప్రోత్సహించండి.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ
ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.
https://linktr.ee/manatelugukathalu
లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
https://www.facebook.com/ManaTeluguKathaluDotCom
ధన్యవాదాలు.
మన తెలుగు కథలు - మంచి కథల సమాహారం
Comments