
వారం వారం బహుమతులు - జనవరి 2025 - Weekly Prizes - January 2025 By manatelugukathalu.com Published In manatelugukathalu.com On 15/02/2025
మనతెలుగుకథలు.కామ్ వారి వారం వారం బహుమతులు జనవరి 2025
నిర్వహణ: మనతెలుగుకథలు.కామ్
విషయ సూచిక
1 .బహుమతులకు సహకరిస్తున్న వారు ( Contributors To Prizes )
2. ఉగాది 2025 కథల పోటీలు
3. NON STOP PRIZES ( వారం వారం బహుమతులు ) జనవరి 2025 ఫలితాలు
ధన్యవాదాలు:
దాదాపుగా అన్ని రచనలూ చదువుతూ ఇతర రచయితలను ప్రోత్సహిస్తున్న పిట్టా గోపి, సురేఖ పులి, పి.వి.పద్మావతి మధు నివ్రితి, సిరి ప్రసాద్, పాండ్రంకి సుబ్రమణి గార్లకు మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.
ఏ విధమైన పోటీలు, బహుమతులు లేకున్నా తమ కవితలు వ్యాసాలు నిరంతరం పంపిస్తున్న మా అభిమాన రచయితలు, కవులు గద్వాల సోమన్న, నీరజహరి ప్రభల, భళ్ళముడి నాగరాజు, అయ్యల సోమయాజుల సుబ్రహ్మణ్యం, అన్నపూర్ణ, బులుసు రవిశర్మ, ఎం కే కుమార్, T. V. L. గాయత్రి గార్లకు మా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము.
గమనిక:
కొత్త రచయితల సమాచారం కోసం...
కథల పోటీ కోసం ప్రత్యేకంగా రచనలు పంపనవసరం లేదు.
మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడే కథలనుండి ప్రతి వారం కనీసం ఒక కథను ఉత్తమ కథగా ఎంపిక చేస్తాము.
అలా ఎంపిక చెయ్యబడ్డ కథలనుండి ఉగాది పోటీలకు బహుమతి కథ సెలెక్ట్ చేస్తాము.
ప్రతి నెల వారం వారం బహుమతులకు ఎంపికైన కథల వివరాలు మనతెలుగుకథలు.కామ్ లో మరుసటి నెల 15 వ తేదీ ప్రచురిస్తాము.
కేవలం మేము పంపే లింక్ ల ద్వారానే మనతెలుగుకథలు లో కథలు చదవాల్సిన అవసరం లేదు.
మీ బ్రౌసర్ లో www.manatelugukathalu.com అని టైపు చేస్తే మా వెబ్ సైట్ చేరుకోవచ్చు. మీకు నచ్చిన కథలు ఉచితంగా చదువుకోవచ్చు.
మీ రచనలు మాకు పంపవలసిన చిరునామా story@manatelugukathalu.com
మనతెలుగుకథలు.కామ్ రచయితల కోసం మేము ఏర్పాటు చేసిన వాట్సాప్ గ్రూప్ లో చేరడం ద్వారా ప్రతి పోస్ట్ తాలూకు లింక్ లు తెలుసుకోవచ్చు.
1 .బహుమతులకు సహకరిస్తున్న వారు
వారం వారం ఒక కథకు బహుమతి చొప్పున నెలకు నాలుగు కథలకు బహుమతులు అందిస్తున్నాం. బహుమతుల వితరణలో భాగస్వాములు దొరికితే ఈ బహుమతుల సంఖ్యను, బహుమతుల మొత్తాన్ని మరింత పెంచే అవకాశం ఉంటుంది. మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడే ప్రతి కథకు బహుమతి అందేలా చేయాలన్నదే మా సంకల్పం.
రూ: 3000/- చెల్లించడం ద్వారా ఒక సంవత్సరం పాటు ప్రతి నెలా ఒక కథకు బహుమతిని మీరు స్పాన్సర్ చేయవచ్చు. బహుమతి కథ మీరే ఎంపిక చేయవచ్చు.
వివరాలకు story@manatelugukathalu.com కి మెయిల్ చేయండి.
ఈ విషయంగా మేము గతంలో చేసిన విజ్ఞప్తికి స్వచ్చందంగా ప్రతిస్పందించిన వారి వివరాలు తెలియజేస్తున్నాము.
*శ్రీ బివిడి ప్రసాద రావు గారు ప్రతినెలా ఒక కథకు బహుమతిని అందిస్తున్నారు.
*పెండేకంటి లావణ్య కుమార్తె జె.సాయినిధి తన దివంగత అమ్మమ్మ(పెండేకంటి లక్ష్మిపద్మావతి), నానమ్మ (జొన్నలగడ్డ పద్మావతి)ల ఙ్ఞాపకార్థం ప్రతినెలా ఒక కథకు బహుమతిని అందిస్తున్నారు.
*కొందరు రచయితలు తమ పారితోషకం మొత్తాన్ని ఇతర రచయితల బహుమతుల కోసం వెచ్చించమని కోరుతున్నారు.
2. ఉగాది 2025 కథల పోటీలు
సంక్రాంతి 2021, విజయదశమి 2021, ఉగాది 2022, విజయదశమి 2022, ఉగాది 2023, విజయదశమి 2023 మరియు విజయదశమి 2024 కథల పోటీలు విజయవంతంగా పూర్తి చేసిన సందర్భంగా రచయితలకు, పాఠకులకు ముందుగా మా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము
ఇప్పుడు ఉగాది 2025 కథల పోటీని ప్రకటిస్తున్నాము.
పోటీల కోసం ప్రత్యేకంగా కథలు పంపాల్సిన అవసరం లేదు.
23/09/2024 నుండి 31 /03 /2025 వరకు ప్రచురితమయ్యే కథల నుండి ఉగాది 2025 కథల పోటీల బహుమతుల ఎంపిక ఉంటుంది. (కథలు మాకు చేరవలసిన చివరి తేదీ: 23/03/2025)
ప్రచురింప బడ్డ కథలను తరువాత తొలగించడం ఉండదు. ఇందుకు సమ్మతించే వారే తమ రచనలను పంపగలరు.
ఉగాది 2025 కథల పోటీ బహుమతుల వివరాలు :
ఏకైక ప్రథమ బహుమతి రూ: 5000 /-
ఐదు ప్రత్యేక బహుమతులు ఒక్కొక్కటి రూ: 500 /-
మీరు నూతన రచయితలయినా, లబ్ద ప్రతిష్ఠులైన రచయితలైనా బహుమతులు పొందడానికి సమాన అవకాశాలు వున్నాయి. బహుమతుల ఎంపిక నిష్పక్షపాతంగా జరుగుతుంది. బహుమతుల ఎంపికలో పాఠకుల అభిప్రాయాలు కూడా పరిగణనలోకి తీసుకొనబడతాయి.
పూర్తి వివరాలు ఈ క్రింది పోస్ట్ లో చూడండి.
3. NON STOP PRIZES ( వారం వారం బహుమతులు ):
అత్యంత జనాదరణ పొందిన NON STOP PRIZES ( వారం వారం బహుమతులు ) పథకాన్ని 31/03/2025 వరకు పొడిగిస్తున్నాము.
రచయితకు పోటీలో గెలుపొందడం, బహుమతి పొందడం ఒక టానిక్ లాంటిది.
బహుమతి మొత్తం రచయితకు గొప్ప కాదు.
విజేతగా నిలవడం రచయితల ఆత్మ విశ్వాసాన్ని పెంచుతుంది.
మరిన్ని మంచి రచనలు చేయడానికి ప్రేరణ కలుగుతుంది.
వారం వారం బహుమతులు అందించడం వెనుక మా ఉద్దేశం అదే.
జనవరి 2025 వారం వారం బహుమతుల ఫలితాలు:
05/01/2025 | ||
05/01/2025 | ||
12/01/2025 | ||
19/01/2025 | ||
19/01/2025 | ||
19/01/2025 | ||
19/01/2025 | ||
19/01/2025 | ||
26/01/2025 | ||
26/01/2025 | ||
26/01/2025 | ||
26/01/2025 | ||
02/02/2025 |
( కథ చదవడానికి ఆ కథ పేరు మీద క్లిక్ చేయండి. రచయిత ప్రొఫైల్ చూడడానికి రచయిత పేరు మీద క్లిక్ చేయండి.)
విజేతలకు మా అభినందనలు.
వారికి వ్యక్తిగతంగా తెలియజేయడంతో పాటు ప్రశంసాపత్రం పంపడం జరిగింది.
బహుమతి మొత్తం 22/02/2025 లోగా పంపడం జరుగుతుంది.
పాఠకులకు, రచయితలకు మరొకమారు మా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం.
Comments