#TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems, #GadwalaSomanna, #గద్వాలసోమన్న, #వాస్తవాలసింగిడి, #VasthavalaSingidi, #సోమన్నగారికవితలు, #SomannaGariKavithalu

సోమన్న గారి కవితలు పార్ట్ 43
Vasthavala Singidi - Somanna Gari Kavithalu Part 43 - New Telugu Poem Written By Gadwala Somanna Published In manatelugukathalu.com On 23/03/2025
వాస్తవాల సింగిడి - సోమన్న గారి కవితలు పార్ట్ 43 - తెలుగు కవితలు
రచన: గద్వాల సోమన్న
వాస్తవాల సింగిడి
----------------------------------------
మంచి మనసుతో చేసిన
మానవత్వమే చాటిన
దీవెనలొసగును దైవము
సఫలమగును అట్టి కార్యము
మొక్కలెన్నో నాటిన
పచ్చని చెట్లను పెంచిన
అవనిలోన ఆరోగ్యము
మనసులోన ఆనందము
తల్లిదండ్రులను చూసిన
పెద్దలను గౌరవించిన
వర్ధిల్లును కుటుంబాలు
బాగుపడును జీవితాలు
సోమరితనమే వదిలిన
చురుకుదనమే చూపిన
బ్రతుకులో అరుణోదయము
ప్రగతిలో ప్రథమ స్థానము

ఆర్యోక్తులు
----------------------------------------
చేయొద్దు పెద్దలను
ఎప్పుడు అపహాస్యము
వేయొద్దు నిందలను
వీడుము నీచగణము
దాటొద్దు హద్దులను
బ్రతుకగు కల్లోలము
వదలొద్దు లక్ష్యమును
చేజారును విజయము
చూపొద్దు భేదమును
మిగులుతుంది ఖేదము
చూడొద్దు అశుభమును
తెస్తుంది ప్రమాదము
పెట్టొద్దు గొడవలను
చెడిపోవును బంధము
చీల్చొద్దు మిత్రులను
అంతులేని నష్టము

మద్యపానం హానికరం
----------------------------------------
అల్లరి పుట్టించును
ఆట పట్టించును
మద్యపానము ముప్పు
బానిస అయితే తప్పు
గౌరవము పోగొట్టును
అవమానము తెచ్చును
బహు నీచము మద్యము
దారిద్య్రము వచ్చును
ధనాన్ని హరించును
కుటుంబాల్ని కూల్చును
మత్తు పదార్థాలు
అమితము అనర్ధాలు
ఆరోగ్యము చెరుపును
ఆయస్సు తగ్గించును
ఇక మందు బాబులకు
ఇల నిరాశ మిగులును

సత్యాలు ఆణిముత్యాలు
----------------------------------------
మితిలేని కలహాలు
అశాంతికి చిహ్నాలు
ఉండాలోయ్! దూరము
లేదంటే ఘోరము
మదిలోని ద్వేషాలు
బ్రతుకులో దోషాలు
దిద్దుకున్న క్షేమము
దరిచేరును స్వర్గము
అదువులేని ఆశలు
స్థిరం లేని మాటలు
తెచ్చిపెట్టు దుఃఖము
పోగొట్టు గౌరవము
దేవునితో ఆటలు
వద్దోయ్! చెలగాటము
భంగపడును బ్రతుకులు
మిగులుతుంది భస్మము

అప్రమత్తంగా ఉండాలి!
----------------------------------------
మూర్ఖులతో వాదము
దుష్టులతో స్నేహము
కల్గించు ఇక్కట్లు
బ్రతుకులో చీకట్లు
చేయకు మిత్రభేదము
మరువకు స్నేహభావము
ఆత్మీయత గొప్పది
అనురాగం మంచిది
నమ్మిన వారికిలను
వెన్నుపోటు పొడవకు
కన్న తల్లిదండ్రులను
కంటితడి పెట్టించకు
వ్యర్థమైన వాటిని
ఎన్నడు ఆశించకు
చెలరేగే నోటిని
స్వేచ్చగా వాడేయకు
-గద్వాల సోమన్న
Comments