top of page
Writer's pictureMutyala Laxma Reddy

వేడుకే కానీ భయం



'Veduke Kani Bhayam' - New Telugu Poem Written By M. Laxma Reddy

Published In manatelugukathalu.com On 24/05/2024

'వేడుకే కానీ భయం' తెలుగు కవిత

రచన: M. లక్ష్మా రెడ్డి


నయనాలకి వేడుక.. నువు ఎదురొస్తే

మది సంబరం..అలా నా వేపు చూస్తే

కానీ.. వెంటనే ఓ భయం


నీ కనుల కాంతి నను దేదీప్యమానం కావిస్తుంటే..

కళ్ళకి క్షణం ఆనందం.. మరుక్షణం భయం.,

ఆ కాంతి రేఖల వలయంలో  నే చిక్కుకుని ,

మరునిమిషం అంతర్థానమయ్యే నీవల్ల.. 

ఏనాటికైనా నీ దారి కనబడేనా  .. 

నీ నగుమోము వీక్షణతో ఎద నిండేనా ..


నీ చిరునవ్వు కొత్తగా నాకు ప్రాణం పోసి 

ఊహల్లో  ఊరేగిస్తుంటే..

మనసుకి  ఆ నిమిషం పరవశం.. 

మరు నిమిషం కలవరం..

నీ అంతరంగ తరంగాల తీవ్రత తెలీక..

నను దాటి వెళ్లే నీ 

దర్శనమైనా మిగిలేనా..

నువు కేంద్రంగా నా ప్రదర్శనం సాగేనా..


భయమే.. కానీ దాన్ని 

అనుక్షణం జయించే నీ ఆకర్షణ..

ఈ కథ ఏ తీరం చేరేనో.. 

మది మాటున..కనుల చాటున 

అన్ కహీ కహానీగా మిగిలేనో..


నిర్ణయం 

అర్థం కాని నీ మనసుదా.. 

 నిలకడ లేని ఈ కాలానిదా..

నా వరకైతే.. ఇదేదో బావుందే..

ఆకర్షణా పరివర్తన సూత్రం నిజమని..

నిరూపితం అయ్యేలా ఉందే...


ఆశే కదా.. జీవితాన్ని నడిపే బలం

 ప్రేమే కదా ..  నిస్సార నిన్నని .. 

రంగుల నేటిగా.. రేపటి కావ్యంగా నడిపే బంధం

***

M. లక్ష్మా రెడ్డి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 


విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.

గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం:

నేను లక్కీ.. లక్మారెడ్డి 

రసాయన శాస్త్ర బోధన వృత్తి.. ప్రైవేటు కళాశాలే సుమా..

అడపా దడపా.. కలం కాగితం కనబడగానే...మనసు మాటలు అక్షరాల రూపంలోకి దొర్లి.. మనసు తేలిక అవుతుంది...ఆ ప్రయాసలోనే.. ఆ ప్రహసనం లోనే.. నా కవితలు.. చిన్ని కథానిక లాంటి నాలుగు పంక్తులు..

నచ్చితే..ఒకాట చెప్పండి.. ఇంకోటి రాస్తాను..

నచ్చకుంటే భేషుగ్గా చెప్పండి... ఇంకాస్త పద్ధతిగా రాస్తాను...

ధన్యవాదాలు...


42 views0 comments

Comments


bottom of page