#KandarpaMurthy, #కందర్పమూర్తి, #వీడనిఅనుబంధం, #VeedaniAnubandham, #TeluguKathalu, #తెలుగుకథలు
Veedani Anubandham - New Telugu Story Written By Kandarpa Murthy
Published In manatelugukathalu.com On 02/01/2025
వీడని అనుబంధం - తెలుగు కథ
రచన: కందర్ప మూర్తి
కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
రిటైర్డ్ ఉద్యోగి మూర్తి గారింట్లో తిస్టేసుకుని ఖుషీగా రోజులు గడుపుతున్న షీలా పిల్లికి చచ్చిన చావొచ్చి పడింది. పాల పేకెట్లు గుమ్మం దగ్గర లేటుగా తీస్తే వాటికి రంధ్రం చేసి పాలు తాగే చాన్సు, పిల్లి మూతి పెట్టిందని పారపోసే పాలు మస్తుగా దక్కేవి.
‘ఇంట్లో పాలు విరిగిపోయినా వాష్ బేసిన్లో పోయకుండా నాకే నా టబ్ లో వేసేవారు. నేనెన్ని చిలిపి పనులు చేసినా ఎప్పుడూ నన్ను తిట్టింది లేదు.
నా జననం మూర్తి గారింట్లోనే జరిగిందట. నేను పుట్టగానే కొద్ది రోజులు నా ఆలనా పాలనా చూసి నన్ను ఇక్కడ వదిలేసి అమ్మ మరో ఇంటికి షిఫ్టు అయిపోయిందట. నా డెలివరీ టైముకి మూర్తి గారి ఇంటి అటక అనుకూలంగా నేను ఆడుకోడానికి వీలుగా ఉందని ఇక్కడ తిష్ట వేసిందట.
తర్వాత మూర్తి గారి కుటుంబ సబ్యులు నన్ను చేరదీసి "షీలా" పేరు పెట్టి పాలు పోసి పెద్ద చేసారు. నేను ఇంట్లో అందరికీ ముద్దుగా ఉండటానికి కారణం గోధుమ శరీర రంగు ముఖం మీద తెల్లని నిలువు నామం మచ్చ ఉండటమే.
నాకు ఈ ఇంట్లో కొన్ని సమస్యలూ లేకపోలేదు. మూర్తిగారు శుద్ధ వైదిక బ్రాహ్మణులు. ఆచార వ్యవహారాలెక్కువ. చాదస్తపు మనిషి. పక్కా శాకాహారి. శకునాల పిచ్చి ఎక్కువ. ఉదయాన్నే నా మొహం చూడకూడదట. పూజలూ పండగలు వ్రతాలప్పుడు మడి పాటిస్తారు.
కాషాయ వస్త్రధారణలో నెత్తి మీద పెద్ద పిలకతో శాస్త్రి గారు వెనక శిషష్యులు మంత్రాలు వల్లిస్తు పూజలు చేస్తు సందడిగా కనబడతారు. తర్వాత భోజనాలు, సంభావనలు ఉంటాయి.
అలాంటప్పుడు నా పని అటక మీద కూర్చోవటమే.
మూర్తి గారు శాకాహారైనా నాకు మాంసాహారానికి లోటు లేదు. వారి పాత సామాన్ల స్టోర్ రూమ్ లో ఎంతోకాలం నుంచి మూషిక కుటుంబాలు నివాశముంటున్నాయి. నాకు నాన్ వెజ్ తినాలనుకున్నప్పుడు అటో లుక్కేస్తాను.
అమ్మ గారు మడితో పాటు వ్రతాలు పూజలూ బాగానే చేస్తూంటారు. అప్పుడు ఇల్లంతా ఆడవారితో సందడిగా ఉంటుంది. అమ్మగారు వారికి తమలపాకుల్లో పసుపు కుంకుమ పళ్లు పెట్టి వాయనం ఇస్తుంది. అలాంటప్పుడు నాకు పాలు వెన్న నెయ్యి ప్రసాదాలు మస్తుగా దక్కుతూంటాయి. కిందన నేను ఉండటం నిషేదం కనుక అటక మీద నుంచే కనిపెడుతుంటాను.
పట్నంలో ఉండే మూర్తి గారి అబ్బాయి, అమ్మాయి పండగలకు ఇక్కడికి వస్తే ఇల్లంతా సందడే సందడి. మూర్తి గారి ఎనిమిదేళ్ల మనవడు బాబి ఇక్కడి కొస్తే నన్ను వదిలిపెట్టడు. మిల్క్ బికీలు కేకులు తినిపిస్తాడు.
ఇప్పుడు నా వయసు ఆరేళ్లు. ఎలాగంటే బాబి పుట్టిన రెండేళ్లకి నేను పుట్టానట. ఇలా హాయిగా ఆనందంగా ఈ ఇంట్లో రోజులు గడిచిపోతుంటె అనుకోని ఆపద వచ్చిపడింది. కొద్ది రోజులుగా ఇంటి చుట్టూ కొలతలు తీసుకోవడం, కొత్త మనుషులు ఏవో కాగితాలు పట్టుకు తిరుగుతుంటె ఏమీ అర్థం కాలేదు. ఇప్పుడు తెల్సిన విషయమేమంటే మూర్తి గారు మొత్తం ఇంటిని అపార్టుమెంటు కట్టడానికి కాంటాక్టుకి ఇచ్చేసారట.
పాత ఇల్లు పడగొట్టి పునాదులు తవ్వడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. వాకిట్లో తులసి మొక్కతో తులసికోట ఎప్పుడూ దీపపు ప్రమిదల దీపకాంతులు, పెరట్లో ఎర్రని పుష్పాలతో మందారచెట్టు, ఏపుగా ఎదిగిన కరివేపాకు చెట్టు, ఉదయాన్నే కాకులు, అనేక పక్షుల సందడితో కనిపించే పెద్ద వేపచెట్టూ, అమ్మగారు ఆప్యాయంగా పెంచుకునే మల్లి పందిరి, ఇవన్నీ మళ్లీ చూడగలనా?’
మూర్తి గారు ఇంటి సామాన్లు ఎక్కడికి షిఫ్టు చేస్తారో తెలియక తికమకగా ఉంది. అప్పుడు ఈ అటక, స్టోర్ రూములు లేకపోతే మనుగడ ఎలాగని ఆలోచనలో పడింది షీలా పిల్లి.
సమాప్తం
కందర్ప మూర్తి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత పరిచయం: https://www.manatelugukathalu.com/profile/kandarpamurthy
పూర్తి పేరు : కందర్ప వెంకట సత్యనారాయణ మూర్తి
కలం పేరు : కందర్ప మూర్తి
పుట్టి పెరిగిన ఊరు : 02 జూలై -1946, చోడవరం (అనకాపల్లి జిల్లా)ఆం.ప్ర.
భార్య పేరు: శ్రీమతి రామలక్ష్మి
కుమార్తెలు:
శ్రీమతి రాధ విఠాల, అల్లుడు డా. ప్రవీణ్ కుమార్
శ్రీమతి ఉషారమ , అల్లుడు వెంకట్
శ్రీమతి విజయ సుధ, అల్లుడు సతీష్
విద్యార్థి దశ నుంచి తెలుగు సాహిత్యం మీద అభిలాషతో చిన్న కథలు, జోకులు, కార్టూన్లు వేసి పంపితే పత్రికలలో ప్రచురణ జరిగేవి. తర్వాత హైస్కూలు చదువులు, విశాఖపట్నంలో పోలీటెక్నిక్ డిప్లమో కోర్సు చదివే రోజుల్లో 1965 సం. ఇండియా- పాకిస్థాన్ యుద్ధ సమయంలో చదువుకు స్వస్తి పలికి ఇండియన్ ఆర్మీ మెడికల్ విభాగంలో చేరి దేశ సరిహద్దులు,
వివిధ నగరాల్లో 20 సం. సుదీర్ఘ సేవల అనంతరం పదవీ విరమణ పొంది సివిల్ జీవితంలో ప్రవేసించి 1987 సం.లో హైదరాబాదు పంజగుట్టలోని నిజామ్స్ వైద్య విజ్ఞాన సంస్థ (నిమ్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్) బ్లడ్ బేంక్ విభాగంలో మెడికల్ లేబోరేటరీ సూపర్వైజరుగా 18 సం. సర్వీస్ చేసి పదవీ విరమణ అనంతరం హైదరాబాదులో కుకట్ పల్లి
వివేకానందనగర్లో స్థిర నివాసం.
సుదీర్ఘ ఉద్యోగ సేవల పదవీ విరమణ తర్వాత మళ్లా తెలుగు సాహిత్యం మీద శ్రద్ధ కలిగి అనేక సామాజిక కథలు, బాల సాహిత్యం, సైనిక జీవిత అనుభవ కథలు, హాస్య కథలు, విశ్లేషణ వ్యాసాలు, కవితలు, గేయాలు రాయగా బాలమిత్ర, బుజ్జాయి, బాలల చంద్ర ప్రభ, హాయ్ బుజ్జీ,
బాలభారతం, బాలబాట, మొలక, సహరి, సాక్షి ఫన్ డే, విపుల,చిన్నారి, హాస్యానందం, ప్రజాశక్తి, గోతెలుగు. కాం, తపస్వి మనోహరం, సాహితీ కిరణం, విశాఖ సంస్కృతి, వార్త ఇలా వివిధ ప్రింటు, ఆన్లైన్ మేగజైన్లలో ప్రచురణ జరిగాయి.
నాబాలల సాహిత్యం గజరాజే వనరాజు, విక్రమసేనుడి విజయం రెండు సంపుటాలుగాను, సామాజిక కుటుంబ కథలు చిగురించిన వసంతం, జీవనజ్యోతి రెండు సంపుటాలుగా తపస్వి మనోహరం పబ్లికేషన్స్ ద్వారా పుస్తక రూపంలో ముద్రణ జరిగాయి.
నా సాహిత్య రచనలు గ్రామీణ, మద్య తరగతి, బడుగు బలహీన వర్గ ప్రజల, జీవన విధానం, వారి స్థితిగతుల గురించి రాస్తు సమాజానికి ఒక సందేశం ఉండాలని కోరుకుంటాను.
ఈ కథ "వీడని అనుబంధం" చాలా హృదయాన్ని తాకే విధంగా ఉంది. మూర్తిగారి ఇంట్లో నివసించే పిల్లి షీలా దృష్టికోణం నుంచి వివరణ ఇవ్వడం రచయిత కందర్ప మూర్తిగారి విశిష్టతను చూపిస్తుంది. పాత ఇంటి జ్ఞాపకాలు, ఆత్మీయత, పునర్నిర్మాణంతో దాని తార్కాణం నష్టమవుతుందనే భావాలను తెలివిగా చెప్పారు.
ఈ కథ పాఠకులకు అనుబంధాల ప్రాధాన్యతను గుర్తుచేస్తూ, జీవనశైలి మార్పుల ప్రభావాన్ని కూడా చూపుతుంది. ముఖ్యంగా, మన గృహాలు కేవలం భవనాలు కాకుండా భావోద్వేగాల కేంద్రాలుగా ఉంటాయనే విషయాన్ని నొక్కి చెబుతుంది