top of page
Writer's pictureSeetharam Kumar Mallavarapu

వెంటాడే నీడ ఎపిసోడ్ 10

కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.






Video link

'Ventade Nida Episode 10' Written By Mallavarapu Seetharam Kumar


రచన: మల్లవరపు సీతారాం కుమార్



గత ఎపిసోడ్ కీ, ఈ ఎపిసోడ్ కీ ఎక్కువ గ్యాప్ వచ్చినందువల్ల జరిగిన కథను కాస్త వివరంగా ఇస్తున్నాను. తదుపరి భాగాలు ఎప్పటిలా వారం వారం అందిస్తాను. జరిగిన ఆలస్యానికి మన్నించవలసిందిగా పాఠకులను కోరుతున్నాను- రచయిత.


జరిగిన కథ...

ఫ్రెండ్స్ తో కలిసి మామిడి తోటలో పార్టీ చేసుకున్నాడు సుమంత్.

అతని బెస్ట్ ఫ్రెండ్ విశాల్.

సుమంత్ మీద ఒక వికృతాకారం దాడి చేస్తుంది.

అది కల లాంటి భ్రమ అని చెబుతాడు విశాల్.

విశాల్ ని ఎక్కించుకొని బైక్ లో బయలుదేరుతాడు సుమంత్.

కానీ దారిలో తన వెనుక కూర్చున్నది ఆ వికృతాకారమని గ్రహించి, బైక్ మీద నుంచి పడిపోతాడు.

విశాల్ అన్న పేరు వికాస్. వదిన శ్రేయ.

శ్రేయ, డెలివరీ కోసం హాస్పిటల్ లో చేరడంతో, చూడ్డానికి బయలుదేరుతారు ఆమె పేరెంట్స్ సావిత్రి, శ్యామలరావు లు.

మామిడి తోట దగ్గర ఒక వ్యక్తి తనని గోవర్ధన్ గా పరిచయం చేసుకుంటాడు.

ఆ తోట వాచ్ మాన్ షణ్ముగం, తన కుటుంబం తో సహా ఆత్మహత్య చేసుకున్నట్లు చెబుతాడు.


మరి కాస్సేపటికి షణ్ముగం ఎదురు పడడంతో గుండె పోటుతో స్పృహ కోల్పోతాడు శ్యామలరావు.


అతన్ని, తోటలో ఉన్న వాచ్ మాన్ షణ్ముగం గుడిసె లోనికి తీసుకొని వెళ్లి, సి పి ఆర్ చేస్తుంది సావిత్రి.


హాస్పిటల్ లో శ్రేయ ఉన్న గదిలోకి డాక్టర్ దుస్తుల్లో ఒక వ్యక్తి ప్రవేశించి, తనను డాక్టర్ గోవర్ధన్ గా పరిచయం చేసుకుంటాడు. ఆమెకు విషం ఇంజక్ట్ చెయ్యబోతాడు.


సమయానికి వికాస్ హాస్పిటల్ సిబ్బందిని అలర్ట్ చెయ్యడంతో అతను పారిపోతాడు.

తీవ్రంగా గాయపడ్డ సుమంత్ కోసం మృత్యుంజయ హోమం చేయించాలనుకుంటాడు అతని కాబోయే మామగారు శంకర శాస్త్రి. అయన మీద మత్తు మందు ప్రయోగించాలని చూస్తాడు ఒక వ్యక్తి. అయన కూతురు దీక్షకు హాని చేస్తానని కూడా హెచ్చరిస్తాడు. తన పేరు గోవర్ధన స్వామి అని చెబుతాడు.

ఇక చదవండి...


కాలేజీలో శంకర శాస్త్రి స్నేహితుడు నరసింహారావు లెక్చరర్ గా పనిచేస్తున్నాడు.

అతనికి ఫోన్ చేసి తన కూతురు అక్కడ ఉందో లేదో కనుక్కోమని చెప్పాడు శంకర శాస్త్రి.

తరువాత భార్య దగ్గరకు వచ్చి కదిలించి చూసాడు.

నెమ్మదిగా కదిలిందామె.


వెంటనే ఒక టవల్ ను చల్లటి నీళ్లతో తడిపి ఆమె ముఖాన్ని అద్దాడు.

కొంతసేపటికి కళ్ళు తెరిచిందామె.


భర్త వంక చూసి, "హమ్మయ్య! మీరు క్షేమంగానే ఉన్నారు" అని సంతోషంగా అంది.

కళ్ళల్లో నీళ్లు తిరిగాయి శంకర శాస్త్రికి.


ఆమె ప్రాణం మీదకు వచ్చినా తన గురించే ఆలోచిస్తోంది.

భార్య పార్వతమ్మ వైపు ప్రేమగా చూశాడు శంకర శాస్త్రి.


"ఏమండీ..! ఏం జరుగుతోందిప్పుడు? నాకేదో ఆందోళనగా ఉంది.ఆ సాధువెవరో.. చిత్త భ్రమలు తొలుగుతాయంటూ ఒక విభూది పొట్లం నా చేతికిచ్చి, మీ నుదుటికి రాయమన్నారు. ఎందుకైనా మంచిదని ముందుగా వాసన చూసాను. అంతే! తరువాతేమైందో నాకు తెలీలేదు" ఇంకా తొలగని భయం ఆమె మాటల్లో కనిపిస్తూ ఉంది.


"నాకు స్పృహ తప్పించి, హోమం జరగకుండా చేయాలని ఎవరో ప్రయత్నిస్తున్నారు. నీ జాగరూకతే నన్ను కాపాడింది. పరోక్షంగా సుమంత్ ప్రాణాలు కూడా నువ్వే కాపాడావు. మనం ఈ రోజు రాత్రికే మీ అన్నయ్య వాళ్ళింటికి చేరుకుందాం. రేపు ఉదయాన్నే సుమంత్ కోసం మహా మృత్యుంజయ హోమం జరిపిస్తాను" అన్నారాయన.


"మా అన్నయ్యగారి అబ్బాయని కాదుగానీ ఆ సుమంత్ చాలా మంచివాడు. అతడికి హాని చెయ్యాలని ఎవరు అనుకుంటున్నారో.. సుమంత్ కోసం మీరు ఇబ్బందులు పడుతున్నారు.." అంది భర్త వంక ఆప్యాయంగా చూస్తూ.


"ఇది కేవలం సుమంత్ ఒక్కడి విషయంగా నేను భావించడం లేదు. దైవ శక్తికీ, దుష్ట శక్తికీ జరుగుతున్న పోరాటంగా అనుకుంటున్నాను. దైవ శక్తిని గెలిపించాల్సిన బాధ్యత మనందరి మీదా ఉంది. లేకుంటే మనం చేసే పూజలకు అర్థమే లేదు. ఈ పోరాటంలో నేను బలైపోయినా సరే.. ప్రాణమున్నంత వరకు వెనుకడుగు వేయను" అన్నాడు శంకర శాస్త్రి ధృడ నిశ్చయంతో.


"భగవంతుడు మనతో ఉంటాడు. ఏమీ కాదు లెండి. అన్నట్లు అమ్మాయి కాలేజీ నుండి ఇంకా రాలేదు. ఒకసారి ఫోన్ చెయ్యండి" అంది పార్వతమ్మ.


ఇందాక కూతురికి కాల్ చేస్తే స్విచ్ ఆఫ్ అని జవాబు వచ్చిన విషయం శంకర శాస్త్రికి గుర్తుకు వచ్చింది.


వెంటనే మరోమారు కూతురు దీక్షకు కాల్ చేసాడు. ఈసారి కూడా స్విచ్ ఆఫ్ అనే సమాధానం వచ్చింది.


ఇందాక తన స్నేహితుడు నరసింహారావుకు కాల్ చేసి దీక్ష ఎలా ఉందో కనుక్కోమన్నాడు.

ఇంకా అతను కాల్ చేయలేదేమిటని ఆందోళన పడ్డాడు.


***

కాలేజ్ నుండి స్నేహితురాళ్ళతో బయటకు వస్తున్న దీక్ష దగ్గరకు ఒక సాధువులాంటి వ్యక్తి వచ్చాడు, నువ్వు శంకర శాస్త్రిగారి అమ్మాయివి కదూ.." అంటూ.

అవునన్నట్లు తల ఊపింది దీక్ష.


"మీ నాన్న నాకు బాగా కావలసిన వాడు. నీకోసం ఇదిగో... సుగంధ విభూది తెచ్చాను. ఇప్పుడే వాసన చూసి నొసటికి రాసుకో. కోరుకున్నది జరుగుతుంది. అన్నట్లు నాన్నగారడిగితే గోవర్ధన స్వామి ఇచ్చాడని చెప్పు" అంటూ ఒక పొట్లం దీక్ష చేతికి ఇచ్చి, సమాధానం కోసం చూడకుండా వెళ్ళిపోయాడు.


దీక్ష ఆ పొట్లం ఓపెన్ చెయ్యబోతుండగా ఆమె స్నేహితురాలు నీలిమ ఆ పొట్లాన్ని లాక్కుని, "ఈ విభూది రాసుకోకపోయినా మీ బావతో నీ పెళ్లి జరుగుతుంది. నన్ను రాసుకోనివ్వు. నాదసలే ఇంటర్ కాస్ట్ లవ్వు" అంటూ దాన్ని ఓపెన్ చేసి ముక్కు దగ్గర ఉంచుకుంది.


అంతే!

ఉన్నపళంగా స్పృహ తప్పి నేలమీద పడిపోయింది.


ఏం జరిగిందో అర్థం కాకా స్టూడెంట్స్ అందరూ ఆమె చుట్టూ గుమికూడారు.

దీక్ష కోసం అక్కడికి వచ్చిన శంకర శాస్త్రి స్నేహితుడు లెక్చరర్ నరసింహారావు విషయం తెలుసుకొని, వెంటనే అంబులెన్స్ కోసం కాల్ చేసాడు.


తరువాత తన ఫోన్ దీక్షకు ఇచ్చి, శంకర శాస్త్రికి కాల్ చెయ్యమంటాడు.

తండ్రికి కాల్ చేసిన దీక్ష, "నా మొబైల్ ఫుల్ గా ఛార్జ్ చేసుకొని వచ్చాను. ఆశ్చర్యంగా ఛార్జింగ్ అయిపోయి స్విచ్ ఆఫ్ అయింది. ఇక్కడికి ఎవరో స్వామీజీ వచ్చి, మీరు తెలుసని చెప్పి, ఒక విభూది పొట్లం ఇచ్చాడు.." అంటూ ఉండగానే అటువైపు నుండి శంకర శాస్త్రి " ఆ విభూదిని వాసన చూడొద్దు. వెంటనే పారెయ్యి. అతను అక్కడే వుంటే మీ ఫ్రెండ్స్ సహాయంతో అతన్ని ఆపండి" అన్నాడు.


"లేదు నాన్నగారూ! ఆ పొట్లం ఇచ్చి, ఆయన క్షణాల్లో వెళ్ళిపోయాడు. నా స్నేహితురాలు ఆ విభూది వాసన చూసి, స్పృహ తప్పింది. నరసింహరావుగారు అంబులెన్స్ కోసం కాల్ చేశారు. అన్నట్లు ఆ స్వామీజీ, తన పేరు గోవర్ధన స్వామి అని చెప్పారు" చెప్పింది దీక్ష.


"ఆ దుర్మార్గుడు అక్కడికి కూడా వచ్చాడన్న మాట. సరే! నువ్వు అక్కడే ఉండు. మీ మామయ్య వాళ్ళ ఊరికి కారులో బయలుదేరుతున్నాం. రేపు ఉదయాన్నే మీ బావ కోసం హోమం చెయ్యాలి కదా. నువ్వు అక్కడే ఉండు. నిన్ను పిక్ అప్ చేసుకొని వెడతాం. నీ బట్టలు అమ్మ సర్దుతుందిలే. వివరాలు మనం వెళ్లే దారిలో చెబుతాను" అన్నాడు శంకర శాస్త్రి.


"కానీ నాన్నగారూ! ఇక్కడ నా స్నేహితురాలు..." అంటూ చెప్పబోతున్న దీక్ష మాటలకూ అడ్డు వస్తూ "అదే విభూది మీ అమ్మ కూడా వాసన చూసింది. అది ప్రాణాపాయం కలిగించేది కాదు. కాస్సేపటికి ఆ అమ్మాయికి స్పృహ వస్తుందిలే. అంబులెన్స్ వచ్చేలోగా ఉల్లిపాయ కట్ చేసి వాసన చూపించండి. నువ్వు అక్కడే నలుగురితో ఉండు. మేము వచ్చేస్థున్నాం. ఫోన్ నరసింహారావుకు ఇవ్వు" అన్నాడు శంకర శాస్త్రి.


***

మామిడి తోట లో వాచ్ మాన్ షణ్ముగం గుడిసెలో ఉన్న శ్యామలరావు, సావిత్రిలు బయట నలుగురైదుగురు ఇంటి దగ్గరకు వస్తున్న అడుగుల శబ్దం వినిపించడంతో ఆందోళన చెందుతారు. బయట నుంచి డ్రైవర్ వెంకటేష్" తలుపు తియ్యండి. పోలీసులు వచ్చారు" అనడంతో షణ్ముగం తలుపు తీస్తాడు.


వెంకటేష్ తో పాటు నలుగురు పోలీసులు లోపలికి వచ్చారు. వాళ్లలో ఒక వ్యక్తి "నేను హైదరాబాద్ లో ఒక పోలీస్ ఆఫీసర్ ని. ఒక కేస్ విషయంగా విజయవాడ వెళ్లి తిరిగి వస్తున్నాం. ఇతను రోడ్డు పక్కన నిలుచొని వరసపెట్టి సిగిరెట్లు కాలుతూ ఉంటే అనుమానం వచ్చి ప్రశ్నించాం.


ఎవరికో గుండె పోటు వచ్చిందనీ, బయట నుంచి దయ్యం కేకలు పెడుతోందని పొంతన లేకుండా మాట్లాడుతూ వుంటే అనుమానం వచ్చి ఇక్కడకు వచ్చాం. చెప్పండి. ఎవరు మీరు?" అని ప్రశ్నించాడు.


సావిత్రి మాట్లాడుతూ "విజయవాడలో శ్రేయ హాస్పిటల్స్ మాదే. నా పేరు సావిత్రి. నేను గైనకాలజిస్టును. ఈయన పేరు శ్యామల రావు. ఈయన కూడా డాక్టర్. మా హాస్పిటల్ ఎం డి కూడా ఈయనే. హైదరాబాద్ లో మా కూతురు శ్రేయ డెలివరీ కోసం బయలుదేరాం. ఈ మామిడి తోటలో పార్టీ చేసుకున్న తరువాత మా అల్లుడి తమ్ముడు విశాల్ కనపడ్డం లేదని చెబితే చూద్దామని ఇక్కడ ఆగాము. ఈ వాచ్ మన్ విషయంగా కొన్ని అపోహలు రావడం తో ఈయనకు గుండెపోటు వచ్చింది.


కారు తీసుకోని వస్తానని వెళ్లిన వెంకటేష్ తో పాటు మీరూ వచ్చారు" అంది.


డ్రైవర్ వెంకటేష్ శ్యామల రావు వైపు చూసి మాట్లాడుతూ "బండి స్టార్ట్ చేసాక కుదరదని ఇప్పుడే రెండుమూడు సిగిరెట్లు తాగేసానయ్యా. వీళ్లకు డౌట్ వచ్చి ఇక్కడకు తీసుకొని వచ్చారు. ఇంకెప్పుడూ ఇలా చెయ్యనయ్యా!" అన్నాడు చేతులు జోడించి.


పోలీస్ ఆఫీసర్ మాట్లాడుతూ "హైదరాబాద్ లో ఎవడో సీరియల్ కిల్లర్ తయారయ్యాడట. ఒక ఇన్కమ్ టాక్స్ ఆఫీసర్ భార్య ... ప్రెగ్నెంట్ గా వున్న ఆవిడపై మర్డర్ అటెంప్ట్ చేసాడట. దార్లో ఎవరైనా అనుమానాస్పదంగా కనపడితే విచారించమని మాకు ఆర్డర్స్. ఇతను చీకట్లో కారు ఆపి ఒంటరిగా ఉండటంతో దూరంనుంచి గమనిస్తున్నాం. ఏమాత్రం భయం లేకుండా చీకట్లో రోడ్డు పక్కన వరసబెట్టి సిగిరెట్లు కాలుస్తుండటంతో అనుమానం వచ్చి ప్రశ్నించాం" అన్నాడు.


ఉలిక్కి పడ్డారు సావిత్రి, శ్యామల రావులు.

"ఇన్కమ్ టాక్స్ ఆఫీసరా! అతని పేరేమిటి? మా అల్లుడు వికాస్ కూడా ఇన్కమ్ టాక్స్ ఆఫీసరే.." ఆందోళనతో అడిగాడు శ్యామల రావు.


"ఒక్క నిముషం.." అంటూ ఎవరికో ఫోన్ చేసాడు ఆ ఆఫీసర్.


ఇంకా వుంది…


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ లో లాగిన్ కావడానికి, మేము నిర్వహిస్తున్న వివిధ పోటీల వివరాలు తెలుసుకోవడానికి ఈ లింక్ క్లిక్ చేయండి.


ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.

లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

మనతెలుగుకథలు.కామ్ లో రచయిత ఇతర రచనలకు క్లిక్ చేయండి.


రచయిత పరిచయం:

నమస్తే! నా పేరు మల్లవరపు సీతారాం కుమార్. శ్రీమతి పేరు మల్లవరపు సీతాలక్ష్మి. ఇద్దరమూ రచనలు చేస్తుంటాము. ఇప్పటికి దాదాపు 25 కథలు మనతెలుగుకథలు.కామ్, కౌముది, గోతెలుగు.కామ్, సుకథ.కామ్ లాంటి వెబ్ మ్యాగజైన్ లలో ప్రచురితమయ్యాయి. స్వస్థలం నెల్లూరు. తెలుగు కథలంటే చాలా ఇష్టం. మనతెలుగుకథలు.కామ్ వారికి ఎడిటింగ్ లో సూచనలు, సలహాలు ఇస్తుంటాము. ( అందువలన మా రచనలు పోటీలకు పరిశీలించబడవు!).






169 views0 comments

Comments


bottom of page