top of page
Writer's pictureLakshmi Sarma B

విధి ఆడిన వింత నాటకం - పార్ట్ 10

#LakshmiSarmaThrigulla, #లక్ష్మీశర్మత్రిగుళ్ళ, #VidhiAdinaVinthaNatakam, #విధిఆడినవింతనాటకం, #TeluguSerials, #TeluguLoveStories, #తెలుగుప్రేమకథలు


'Vidhi Adina Vintha Natakam - Part 10' - New Telugu Web Series Written By Lakshmi Sarma Thrigulla Published In manatelugukathalu.com On 25/10/2024

'విధి ఆడిన వింత నాటకం - పార్ట్ 10తెలుగు ధారావాహిక

రచన: లక్ష్మీ శర్మ త్రిగుళ్ళ

(ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత)

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్



జరిగిన కథ:


కొత్తగా పెళ్ళైన ప్రియాంక దగ్గరకు తన మాజీ ప్రేమికుడు మధు వస్తాడు. డిస్టర్బ్ అవుతుంది ప్రియాంక. అతనితో తన పరిచయం గుర్తు చేసుకుంటుంది. గతంలో ఉద్యోగం కోసం మధుని తన తండ్రి దగ్గరకు తీసుకొని వెళ్తుంది ప్రియాంక. మధుని ఆఫీసుకు రమ్మంటాడు ఆమె తండ్రి దామోదరం. 


మధు, ప్రియాంకల మీద నిఘా పెడతాడు. వాళ్లిద్దరూ ప్రేమించుకుంటున్నట్లు గ్రహిస్తాడు. మధు తన డబ్బుతో పారిపోయినట్లు చెబుతాడు దామోదరం. 


తాను మధును ప్రేమిస్తున్న విషయం బయటపెడుతుంది ప్రియాంక. 


గుండెపోటు వచ్చినట్లు నటిస్తాడు దామోదరం. హాస్పిటల్ లో చేరి మధుని మరిచి పొమ్మని కూతురికి చెబుతాడు. 


కొద్ది రోజులకు తండ్రి ప్రోద్బలంతో రామకృష్ణను పెళ్లి చేసుకుంటుంది. అతని ఆప్యాయత చూసి అతనికి దగ్గర కావాలనుకుంటుంది. 


ఇక 'విధి ఆడిన వింత నాటకం' ధారావాహిక పార్ట్ 10 చదవండి. 


ఆశ్చర్యంతో ప్రియాంకవైపు చూసాడు రామకృష్ణ. “ ప్రియా.. నువ్వు నువ్వేనా ఆ మాటన్నది, నువ్వు నాతో మా ఇంటికి వచ్చేదానివా? ఏమన్నావు అత్తయ్య మామాయ్య అని కదా అన్నావు, నువ్వు మనస్పూర్తిగానే అన్నావా లేకా నాకు అలా వినిపించిందా, ” తనకు దగ్గరగా వస్తూ అడిగాడు. 


కళ్ళు టపటపలాడిస్తూ. “ ఏమండి నేను చెప్పింది మీరు విన్నది నిజమే, ఏం నేను మారకూడదా ? నాకు మిమ్మల్ని మంచిగా చూసుకోవాలి అని ఉండదనుకున్నారా? మీరు చూపెడుతున్న ఆదరాభిమానాలు మీ ప్రేమ ముందు నేను ఓడిపోతున్నాను, ఇక నుండి మీ ప్రియ గానే ఉండిపోతాను, ఇన్నాళ్ళు మిమ్మల్ని బాధపెట్టాను నన్ను క్షమించండి, ” అంటూ భర్త పాదాలకు వంగి దండంపెట్టింది. 


“ ప్రియా.. నేను నమ్మలేకపోతున్నాను నీలో ఇంత తొందరగా ఇంత మార్పా! నీ ప్రేమను గెలవటం కోసం ఎంతో కష్టపడాలనుకున్నాను, నీ హృదయంలో నాకు స్థానం దొరుకుతుందో లేదోనని అనవసరంగా తొందరపడి నిన్ను పెళ్ళి చేసుకున్నానేమోనని ఒక్కోసారి నాలో నేనే బాధపడేవాడిని. అంటే నువ్వు నన్ను నీ భర్తగా అంగీకరిస్తున్నావా, ” ప్రియాంక చేతులు తన చేతులలోకి తీసుకుంటూ అడిగాడు. మనసంతా సంతోషంతో నిండిపోయింది రామకృష్ణకు. 


“ నేను చెప్పేది నిజమండి నా మీదొట్టు ఇన్నాళ్ళు మూర్ఖురాలిగా మిమ్మల్ని బాధపెట్టాను, ఇకనుండి మీ భార్యగా మీకు స్వర్గసుఖాలు అందించే మీ ప్రియురాలిగా మారిపోతున్నాను, మీకు ఇంకా నమ్మకం కలగడం లేదు కదా చూడండి, ” అంటూ భర్త తలను రెండుచేతులతో దగ్గరకు లాక్కుని అతని పెదవులమీద తన పెదవులు అనించింది. 


అనుకోని ఈ చర్యకు రామకృష్ణ ఒళ్ళంతా వేడితో నిండిపోయింది. ఆర్తిగా ప్రియాంకను గట్టిగా కౌగిలించుకున్నాడు. అలా ఒకరి కౌగిట్లో ఒకరు ఎంతసేపున్నారో వాళ్ళకే తెలియదు. అంతగా మైమరచిపోయారు. 


అల్లుడితో ఏదో పని ఉందని వచ్చిన దామోదరం ఈ దృశ్యం చూసి పులకించిపోయాడు. తన కూతురు ఆ మధును మరిచిపోయి ఇంత సంతోషంగా ఉంటున్నందుకు ఆయనకు తృప్తి అనిపించింది. చిన్నగా తలుపు మీద టకటకమని శబ్దం చేసాడు. అప్పుడు ఇద్దరు ఈ లోకంలోకి వచ్చారు. తండ్రిని చూసి సిగ్గుతో తలవంచుకుని అక్కడనుండి పారిపోయింది

ప్రియాంక. ముసిముసిగా నవ్వుకున్నాడు అల్లుడిని కూతురిని చూసి. 


“ చెప్పండి మామాయ్య ఏం పని మీద వచ్చారు, ” అడిగాడు. లోలోపల అతనికి సిగ్గుగానే ఉంది. మామయ్య ఏమనుకుంటాడు.. కనీసం తలుపులు పెట్టుకోకుండానే ఏంటీపని అనుకున్నాడేమో. 


“ఆ ఏం బాబు .. నువ్వు ఒక్కడివే ఊరెళుతున్నావు కూడా అమ్మాయిని తీసుకవెళితే బాగుండేదేమోనని చెబుదామని వచ్చాను, బేబి మీ ఇంటికి ఒకేసారి వచ్చింది కదా! మీ అమ్మా నాన్నలు సంతోషపడతారేమో ఇద్దరుకలిసి వెళ్ళిరండి బాబు, ” చెప్పాడు దామోదరం. 


“మీరు చెప్పింది నిజమే.. కాకపోతే నేను రెండురోజుల్లో వచ్చేస్తాను, ఉన్నట్టు ఉండదు అందుకని మరోసారి వారంరోజులు వెళతాము ఇద్దరం కలిసి, ఇప్పుడేమో అర్జంటుగా వెళ్ళాల్సి వచ్చింది అక్కడ నా హడావుడిలో నేనుంటాను పాపం ప్రియకు ఏమి తోచదు, ఇబ్బందిపడుతుందేమోనని వద్దన్నాను ఇందాక తను అదే బాధపడుతుంటే ఓదార్చాను మామాయ్య, ” అతనికి అనుమానం రాకుండా చెప్పాడు. 


“ అయితే సరే బాబు నీ ఇష్టం మరి నేను కంపెనీకి వెళుతున్నాను నువ్వు క్షేమంగా వెళ్ళి క్షేమంగా తిరిగి రా బాబు, ” అంటూ వెళ్ళిపోయాడు. 


 ఈ పెద్ద మనిషి ఇప్పుడే రావాలా ప్రియాంకను మొదటిసారిగా మనస్పూర్తిగా ఆలింగనమొనర్చుకున్నాను. ఎంత మంచి అవకాశం నిజంగా ప్రియా మారిపోయింది. 


విచిత్రంగా ఉంది నాకైతే తను మారడమంటే అవును మరి ప్రేమించినవాడు మోసం చేసి వెళ్ళిపోయాడు. కట్టుకున్నవాడిని పక్కన పెట్టుకుని ఎన్నాళ్ళని ఓపిగ్గా ఉంటుంది. ఎవరికైనా మోహావేశాలు ఉంటాయి ఉండవు మరి. పులుపు కారం తింటున్న శరీరాలు కావేంటి. అబ్బా నేనిప్పుడే ఊరెళ్ళాల్సి వచ్చిందే ప్రియాంక మనసు మారకముందే నాదాన్ని చేసుకుంటే ఎంత బాగుండేదో. మళ్ళి నేనొచ్చే సరికి ఎలా మారుతుందో ఏమో చేతికి అందివచ్చిన అందాన్ని దూరంచేసుకున్నాననే బాధ మనసును తొలిచివేస్తుంది రామకృష్ణకు. 


అడుగులో అడుగు వేసుకుంటూ వచ్చింది ప్రియాంక తండ్రి వెళ్ళిపోవడం చూసి. 

“ ఏమండి వెళ్ళక తప్పదా ? నాన్న మీరు మాట్లాడుకున్నది విన్నాను, త్వరగా వచ్చేయండి, ఇక్కడ మీకోసం ఎదురుచూస్తూ ఉంటాను, ” భర్త కళ్ళల్లోకి కళ్ళుపెట్టి చూస్తూ చెప్పింది. 


“ ప్రియా.. నిన్ను విడిచి నాకు వెళ్ళాలని లేదు, నాకెంత సంతోషంగా ఉందో తెలుసా? ఈ క్షణం కోసం నేను ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపానో, నీ గుండెతలుపులు తెరచుకుని అందులోకి నన్నాహ్వానిస్తున్నావు, ఈ మధురమైన క్షణాన్ని వదిలి వెళ్ళాలంటే నాకు బాధగానే ఉంది, కానీ తప్పనిసరి పరిస్థితుల్లో వెళ్లాలి రేపు రాత్రికే బయలుదేరి నీ ఒళ్ళో వాలిపోతాను ప్రియా, ” 


ఆప్యాయతనంతా మాటల్లో గుమ్మరిస్తూ దగ్గరకు తీసుకుందామనే సరికి శారద రావడంతో దూరం జరిగాడు. 


భర్త వెళ్ళిపోయాక ప్రియాంకకు ఏమి తోచడంలేదు. అతను దగ్గరనుంతసేపు తెలియలేదు, ఒక్కరోజు అతను దూరంగా వెళ్ళితే ఎన్నో రోజులైనట్టుంది. తనను ఎంతబాగా అర్థంచేసుకున్నాడు.. నాకోసమనే కదా పెళ్ళి చేసుకొని కూడా బ్రహ్మచారిలా ఉంటున్నాడు. 


నా మనసు బాధపెట్టకుండా తన శరీరంలో జరిగే ప్రకంపనలన్నీంటిని దూరంపెట్టాడు. నేను మొండితనంతో ఆయనను దూరంపెడుతున్నాను ఇది పద్ధతికాదని నాకు తెలుసు కానీ! నా అంతరాత్మనే నామాట వినకుండా చేస్తుంది. ఇక ఖచ్చితంగా ఎవరి మాట వినేదిలేదు. తను రాగానే మా మొదటిరాత్రి మేమే జరుపుకుంటాము. ఏలాంటి అవాంతరాలు వచ్చినా మనస్పూర్తిగా నన్ను నేను ఆయనకు అర్పించుకుంటాను. 

అబ్బా ఈ రోజంతా గడవాలి రేపు రాత్రికి వస్తాడు అంటే ఒకటిన్నర రోజు

మనసు ఒకచోట కుదురగా కూర్చొవడంలేదు గజిబిజిగా ఉంది. 

***


ఈ ప్రయాణం ఇప్పుడే రావాలా ప్రియాంక మనసు మారి నాకు దగ్గరగా వచ్చింది. వచ్చిన అవకాశాన్ని జారవిడుచుకున్నాను మళ్ళి ప్రియా మూడ్ మారుతుందేమో. ఒకరోజు ముందు తను ఇలా ఉన్నా నేను రాలేనని నాన్నకు చెప్పేవాడిని. ఇప్పుడు చెప్పి తప్పించుకుంటే నాన్న బాధపడతారు ఏవో సంతకాలకోసం చెల్లి బావ వచ్చారట. 


నేను రాకపోతే బావకు ఇచ్చిన మాట తప్పినట్టవుతుంది. అది చూసుకుంటే ఇక్కడ నా ఆనందానికి గండిపడుతుందేమో. అబ్బ ఎంత చిక్కు సమస్య మనసు ఆగలేకపోతుంది.


నేను పొందబోయే స్వర్గసుఖాల కోసం ఉవ్విళ్ళూరుతుంది. రేపు సాధ్యమైనంత తొందరగా పని ముగించుకుని రావాలి. వస్తూనే ప్రియాంకను కౌగిలిలో బంధించుకోవాలి ఇక ఆగలేను


‘ఎలాగైనా సరే రేపు తనను నాదానిగా చేసుకుని తీరతాను’.. గట్టిగా అనుకున్నాడు. 


=================================================================================

                                                       ఇంకా వుంది..


=================================================================================


లక్ష్మీ శర్మ త్రిగుళ్ళ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ లక్ష్మీ శర్మ త్రిగుళ్ళ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం


ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత్రి పరిచయం : లక్ష్మి శర్మ త్రిగుళ్ళ

నా గురించి కొన్ని విషయాలు ప్రస్తావిస్తాను, నేను సికింద్రాబాద్ లాలాపేటలో వుంటాను,

నాకు చిన్నప్పటి నుండి కథలు రాయడంమన్న చదవడంమన్న చాలా ఇష్టం, 1991 నుండి రాయడం మొదలుపెట్టాను, ఎక్కడ ఏ పేపర్ కనిపించినా రాసాను, కానీ ఎవరికి చూపలేదు చెప్పుకోలేదు, ఈమధ్యనే మా అమ్మాయిలు మావారు చూసి కథలు బాగున్నాయి కదా ఏదైనా పత్రికకు పంపమంటే పంపంస్తున్నాను, కర్నూలు గణేశ్ పత్రిక లో నేను రాసిన కవితలు కథలు చాలా వచ్చాయి.ఈ మధ్యలో నేను రాసిన కథలన్నీ ( మబ్బులు వీడిన ఆకాశం ) అనే కథల సంపుటి వచ్చింది, (కిన్నెర ఆర్ట్ పబ్లికేషన్స్) వారిచేత.


ఇంకా ముఖ్యంగా, (మన తెలుగు కథలు కామ్) యాజమాన్యం వారి ప్రోత్సాహం , నాకు ప్రశంసా పత్రాలు ఇవ్వడంతో నాలో ఇంకా ఉత్సాహం పెరిగింది.

 

మీకు చాలా కృతజ్ఞతలు తెలుపుతూ,

లక్ష్మి శర్మ

లాలాపేట సికింద్రాబాద్

30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ఉత్తమ రచయిత్రి బిరుదు పొందారు. 




33 views0 comments

Comments


bottom of page