top of page
Writer's pictureLakshmi Sarma B

విధి ఆడిన వింత నాటకం - పార్ట్ 16

#LakshmiSarmaThrigulla, #లక్ష్మీశర్మత్రిగుళ్ళ, #VidhiAdinaVinthaNatakam, #విధిఆడినవింతనాటకం, #TeluguSerials, #TeluguLoveStories, #తెలుగుప్రేమకథలు


Vidhi Adina Vintha Natakam - Part 16 - New Telugu Web Series Written By Lakshmi Sarma Thrigulla Published In manatelugukathalu.com On 01/12/2024

విధి ఆడిన వింత నాటకం - పార్ట్ 16 - తెలుగు ధారావాహిక చివరి భాగం

రచన: లక్ష్మీ శర్మ త్రిగుళ్ళ

(ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత)

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్



జరిగిన కథ:


కొత్తగా పెళ్ళైన ప్రియాంక దగ్గరకు తన మాజీ ప్రేమికుడు మధు వస్తాడు. డిస్టర్బ్ అవుతుంది ప్రియాంక. అతనితో తన పరిచయం గుర్తు చేసుకుంటుంది. గతంలో ఉద్యోగం కోసం మధుని తన తండ్రి దగ్గరకు తీసుకొని వెళ్తుంది ప్రియాంక. 


మధు, ప్రియాంకల మీద నిఘా పెడతాడు. వాళ్లిద్దరూ ప్రేమించుకుంటున్నట్లు గ్రహిస్తాడు. మధు తన డబ్బుతో పారిపోయినట్లు చెబుతాడు దామోదరం. తాను మధును ప్రేమిస్తున్న విషయం బయటపెడుతుంది ప్రియాంక. 


గుండెపోటు వచ్చినట్లు నటిస్తాడు దామోదరం. హాస్పిటల్ లో చేరి, మధుని మరిచి పొమ్మని కూతురికి చెబుతాడు. కొద్ది రోజులకు తండ్రి ప్రోద్బలంతో రామకృష్ణను పెళ్లి చేసుకుంటుంది. అతని ఆప్యాయత చూసి అతనికి దగ్గర కావాలనుకుంటుంది. ఇంతలో మధు తనని కలవడంతో భర్తకు దగ్గర కాలేక పోతుంది. 


గుడి దగ్గర మధు, ప్రియాంకలు మాట్లాడుకునే అవకాశం కల్పిస్తాడు రామకృష్ణ. తన తండ్రి చేసిన మోసం తెలుసుకుంటుంది ప్రియాంక. మధుకు కిడ్నీలు రెండూ పాడైనట్లు తెలుసుకుంటుంది. 

టూర్ నుండి తిరిగి వచ్చిన అత్తఅమామలను కలవడానికి వెళ్తాడు రామకృష్ణ.



 ఇక 'విధి ఆడిన వింత నాటకం' ధారావాహిక పార్ట్ 16 చదవండి. 


“బాబు .. మీ మామను చూసావా.. రెండు కళ్ళుపోయాయి, తీర్థయాత్రలన్ని ముగించుకుని వస్తుంటే యాక్సిడెంట్ అయింది. మనిషి ప్రాణాలతో బయటపడ్డాడు కానీ చూపు కోల్పోయాడు. కుడిచెయ్యి కూడా నుజ్జు నుజ్జు అయింది బాబు, ” అంటూ బోరుమంది శారద. 


“అరెరే.. మరి నాకెందుకు ఫోన్ చెయ్యలేదు.. నేను వచ్చేవాడిని, ఎంత ఇబ్బంది పడ్డారో ఏమో, ” దామోదరం దగ్గరగా కూర్చుంటూ అడిగాడు రామకృష్ణ. 


“అయ్యో బాబు.. ఎన్నిసార్లు ఫోన్ చేసామో.. నువ్వు, ప్రియ.. ఇద్దరు ఫోన్ తియ్యలేదు, కంపెనీకి కూడా ఫోన్ చేసాడు కృష్ణమూర్తి.  కానీ ఎందుకో మీరు సరిగా రావడంలేదు, ఏదో అర్జంటు పని మీద తిరుగుతున్నారని చెప్పాడట, మీరు వచ్చాక ఫోన్ చెయ్యమని చెప్పాము, పాపం తను డాక్టరే కాబట్టి దగ్గరుండి హాస్పిటల్‌కు తీసుకెళ్లి ఎమర్జన్సీ లో చికిత్స చేయించాడు, అక్కడనుండి ఇదిగో ఈ హాస్పిటల్ అయితే మనకు దగ్గర ఉంటుంది, అందరు తెలిసిన వాళ్ళుంటారని ఇక్కడకు తీసుకవచ్చారు, ” బాధపడుతూ చెప్పిందావిడ. 


“అలాగా .. మా స్నేహితుడి ఆరోగ్యం బాగాలేకపోతే ఇదే హాస్పిటల్ లో ఇక్కడే ఉన్నాము నేను, ప్రియ. పాపం వాళ్ళకు ఇక్కడెవరు తెలిసినవాళ్ళు లేరు అంటే, మేమే దగ్గరుండి చూసుకుంటున్నాము. మరి ఇప్పుడేమన్నారు.. ప్రాణాలకు ప్రమాదమేమి లేదు కదా, ” అడిగాడు. 


“ఏమి లేదన్నారు. మనిషి కోలుకోవడానికి చాలా సమయం పడుతుందట. అమ్మాయెక్కడ.. రాలేదు.. తనకు చెప్పలేదా బాబు వాళ్ళ నాన్న గురించి.. నువ్వొక్కడివే వచ్చావు, ” అటూ ఇటు చూస్తూ అడిగింది శారద. కన్నకూతురు వస్తే తన మీద పడి తన బాధనంత వెళ్ళబోసుకోవాలని ఉంది శారదకు. 


“అయ్యో నేను తనకు ఇంకా చెప్పలేదండి. ముందు నేను చూసి వెళ్ళి తనకు చెబుదామని వచ్చాను. ఒకేసారి చెబితే తండ్రికి ఇలా జరిగింది అంటే తట్టుకోలేదేమోనని ఆగాను. ఇదిగో ఇప్పుడే వెళ్ళి తీసుకవస్తాను. తను కూడా ఇక్కడే ఉంది కదా, ” చెప్పి వెళ్లాడు ప్రియను తీసుకరావడానికి. 


తండ్రికి ఇలా అయింది అంటే ప్రియ కంగారుపడుతుందో లేకపోతే తనకు తండ్రి చేసిన మోసానికి చూడడానికి రాను అంటుందో.. ఏది ఏమైనా తనకు ముందే ఏ విషయం చెప్పకుండా ఇక్కడకు తీసుకవస్తాను అనుకున్నాడు. 


“ప్రియ .. ఒకసారి నాతో వస్తావా నాకు తెలిసిన వాళ్ళకు యాక్సిడెంట్ అయి ఇదే హాస్పిటల్ లో ఉన్నారు ఒకసారి పలకరించి వద్దాము, ” అడిగాడు. 


“వాళ్ళెవరో నాకు తెలియదు కదా! నేను ఏమని పలకరించాలో నాకు అర్ధంకావడంలేదండి,” అంది. 


“ఏం పరవాలేదు నేనుంటాను కదా.. వాళ్ళు అడిగారు నీ గురించి. ఇక్కడే ఉన్నావని చెప్పాను. బాగుండదు వెళ్ళకపోతే.. ఒక్క ఐదు నిమిషాల్లో వచ్చేద్దువు సరేనా, ” అన్నాడు. 


మధుకు చెప్పి వచ్చింది. అతన్ని ఒంటరిగా వదిలేసి వస్తుంటే ప్రాణం ఉస్సూరమనిపించింది. 


మెల్లెగా తలుపు తీసుకుని లోపలకు ముందు రామకృష్ణ ఆ వెనక వచ్చిన ప్రియాంకకు అక్కడ తల్లిని చూసి దిగ్భ్రాంతితో నిలబడిపోయింది. 


“వచ్చావా తల్లి.. చూడు మీ నాన్న ఏ పరిస్థితిలో ఉన్నాడో. ఎవరికి అన్యాయం చెయ్యని మనిషికి ఎలా జరిగిందో చూడు, ” అమాంతంగా ప్రియాంకను కౌగిలించుకుని తన బాధనంతా వెలిబుచ్చింది. 


ప్రియాంకకు ఒక్కసారిగా ఒళ్ళు జలదరించినట్టయింది. ప్రాణానికి ప్రాణంగా చూసుకున్న తండ్రివైపు ఒక్కమారు అలా చూసింది. కడుపులోనుండి లావా పొందినట్టు దుఃఖం పొంగుకొచ్చింది కానీ అంతలోనే రేపో మాపో అన్నట్టున్న మధు రూపం కళ్ళముందు కనపడేసరికి తీవ్రమైన కోపంతో ఊగిపోయింది.


మనసు గిర్రున వెనకకు తిరిగి మధు దగ్గరకు వెళ్ళిపోయింది. రామకృష్ణకు అర్థమైంది ప్రియాంక అలా ఎందుకువెళ్ళిందో. వెనకనే తను వెళ్ళాడు. పాపం ఇవేమి తెలియని శారద మాత్రం తండ్రిని చూసి తట్టుకోలేక అలా బయటకు వెళ్లింది అనుకుంది. 


“ప్రియ, ఎలా ఉంది వాళ్ళకు, ”ఆయాసంతో రొప్పుతూ వచ్చిన ప్రియాంకను అడిగాడు మధు. 


“నేను చెబుతాను. తను ఏమి చెప్పలేదు. ఎందుకంటే తను చూసింది తన కన్నతండ్రిని, అందుకే అక్కడి దృశ్యం చూడలేక నీ దగ్గరకు వచ్చింది, ” చెప్పాడు. 


కోపంతో లేచి కూర్చున్నాడు మధు. “ఏంటి ఆ త్రాష్టుడు ఇక్కడకు కూడా దాపురించాడా, నేను ఇప్పుడే వెళ్ళి వాడి పీకపిసికి చంపేస్తాను, నా జీవితాన్ని నాశనం చేసినవాడు బతికుండ కూడదు, ”అంటూ ఆవేశంతో లేవబోయాడు. అంతలోనే దగ్గు వచ్చి ఇబ్బందిపడ్డాడు. 


“మధు నువ్వు ఆవేశపడొద్దని డాక్టర్ చెప్పాడా లేదా? మంచివాళ్ళకు అన్యాయం చేస్తే ఎప్పటికైనా ఫలితం అనుభవిస్తారు అంటారు. కానీ మీకు చేసిన అన్యాయంకు తొందరలోనే దేవుడు న్యాయం చేసాడనిపించింది. ఇప్పుడు ప్రియాంక వాళ్ళ నాన్నకు యాక్సిడెంట్ లో రెండుకళ్ళు పోయాయి. కుడిచేయి నుజ్జు నుజ్జయింది. అంతేకాదు, అతను బతికి బయటపడినప్పుడు కదా! అతను బతికి ఉన్నా, చచ్చిన శవంతో సమానమని డాక్టర్  చెప్పాడు. ఎంతకాలం కోమాలో ఉంటాడో తెలియదని చెప్పాడు. పాపం ప్రియ వాళ్ళమ్మకు

ఇది తెలియదు. తెలిస్తే తట్టుకోలేదని నేను చెప్పలేదు. చూసావా మధు.. దేవుడు ఎంత పెద్ద శిక్ష వేసాడో. కాకపోతే ప్రియకు దెబ్బమీదదెబ్బ. ఇప్పుడు చెయ్యవలసిందల్లా తనను కాపాడుకోవడం ముఖ్యం, ” ప్రియ భుజాలచుట్టు చేతులువేసి కళ్ళనీళ్ళు తుడుస్తూ చెప్పాడు. 


“మీరు చెప్పింది నిజం. ప్రియను కాపాడుకోవడమే ముఖ్యం, ఇప్పుడు నాకు తృప్తిగా ఉంది. నన్ను అన్యాయం చేసిన అతనికి దేవుడు పెద్ద శిక్ష వేసాడు. చాలు నాకది. ఇక నేనేమైపోయినా పరవాలేదు. ప్రియ, చూసావా.. మీ నాన్న తవ్వుకున్న గోతిలో తానే పడిపోయాడు. నువ్వు మీ నాన్న గురించి బాధపడడం లేదు కదా! ఇక నుండి నువ్వు, రామకృష్ణ గారు సంతోషంగా కాలం గడపండి. నీకు ఎప్పుడైనా నేను గుర్తుకు వస్తే నా కోసం రెండు కన్నీటిబొట్లు విడిచిపెట్టు. అంతేగాని నన్ను మనసులో పెట్టుకుని బాధపడకు. నాకేమన్న అయినా నువ్వు ఏడవకూడదు. నా మీద ఒట్టేసి చెబుతున్నా, ”


చెబుతూనే ప్రియాంకచేతిమీద తన నోటితో ముద్దుపెట్టుకుని తల పక్కకు వాల్చేసాడు. 


మధును చూసి ప్రియ కళ్ళనిండి రెండు కన్నీటిబొట్లు మధు పార్థివదేహం

మీద పడ్డాయి. చప్పున కళ్ళు తుడిచాడు రామకృష్ణ. మధు ఆత్మ బాధపడుతుంది అన్నట్టుగా సైగ చేసాడు. వస్తున్న దుఃఖాన్ని గుండెల్లోనే అదిమిపెట్టింది. జరుగవలసిన కార్యక్రమం డబ్బులుపెట్టి చేయించాడు. మధు చిత్రపటం తీసుకవచ్చి హాలులో పెట్టాడు. ప్రియ మనసులో బాధను మరిచిపోవడానికి రామకృష్ణ చాలా కృషి చేసి తన మనిషిగా చేసుకున్నాడు. 


తొందరలోనే ప్రియాంక రామకృష్ణ మనసును అర్థం చేసుకున్నది. తను అతనికి ఇల్లాలుగా న్యాయం చెయ్యాలనుకున్నది చేసింది. రోజులు గడుస్తున్నాయి గానీ దామోదరం పరిస్థితిలో మార్పు లేదు. హాస్పిటల్ నుండి ఇంటికి తీసుకవచ్చారు గానీ అతని లోకమే వేరు. భర్త పరిస్థితి చూసి బాధపడని రోజు ఉండదు శారదకు. సంవత్సరం తిరిగేసరికి బుల్లి మధుబాబు ఇంట్లోకి వచ్చాడు. అపురూపంగా చూసుకోసాగింది ప్రియాంక.

 

బాబుకు మధు అనే పేరు పెట్టుకుని ప్రతిరోజు మధు పేరును పిలుస్తుంటే మనసుకు ఎంతో తృప్తిగా అనిపించసాగింది ప్రియాంకకు. 


=================================================================================

                                              ॥॥॥॥ శుభం॥॥॥


ఈ ధారావాహికను ఆదరించిన పాఠకులకు మనతెలుగుకథలు.కామ్ తరఫున, రచయిత్రి శ్రీమతి లక్ష్మీ శర్మ త్రిగుళ్ళ గారి తరఫున అభివాదాలు తెలియజేసుకుంటున్నాము.

=================================================================================


లక్ష్మీ శర్మ త్రిగుళ్ళ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ లక్ష్మీ శర్మ త్రిగుళ్ళ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం


ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత్రి పరిచయం : లక్ష్మి శర్మ త్రిగుళ్ళ

నా గురించి కొన్ని విషయాలు ప్రస్తావిస్తాను, నేను సికింద్రాబాద్ లాలాపేటలో వుంటాను,

నాకు చిన్నప్పటి నుండి కథలు రాయడంమన్న చదవడంమన్న చాలా ఇష్టం, 1991 నుండి రాయడం మొదలుపెట్టాను, ఎక్కడ ఏ పేపర్ కనిపించినా రాసాను, కానీ ఎవరికి చూపలేదు చెప్పుకోలేదు, ఈమధ్యనే మా అమ్మాయిలు మావారు చూసి కథలు బాగున్నాయి కదా ఏదైనా పత్రికకు పంపమంటే పంపంస్తున్నాను, కర్నూలు గణేశ్ పత్రిక లో నేను రాసిన కవితలు కథలు చాలా వచ్చాయి.ఈ మధ్యలో నేను రాసిన కథలన్నీ ( మబ్బులు వీడిన ఆకాశం ) అనే కథల సంపుటి వచ్చింది, (కిన్నెర ఆర్ట్ పబ్లికేషన్స్) వారిచేత.


ఇంకా ముఖ్యంగా, (మన తెలుగు కథలు కామ్) యాజమాన్యం వారి ప్రోత్సాహం , నాకు ప్రశంసా పత్రాలు ఇవ్వడంతో నాలో ఇంకా ఉత్సాహం పెరిగింది.

 

మీకు చాలా కృతజ్ఞతలు తెలుపుతూ,

లక్ష్మి శర్మ

లాలాపేట సికింద్రాబాద్

30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ఉత్తమ రచయిత్రి బిరుదు పొందారు. 




43 views0 comments

Comments


bottom of page