top of page

విద్యాభ్యాసం

Writer's picture: Yasoda GottiparthiYasoda Gottiparthi

#YasodaGottiparthi, #యశోదగొట్టిపర్తి, #TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems, #Vidyabhyasam, #విద్యాభ్యాసం


Vidyabhyasam - New Telugu Poem Written By - Yasoda Gottiparthi

Published In manatelugukathalu.com On 07/02/2025

విద్యాభ్యాసం - తెలుగు కవిత

రచన: యశోద గొట్టిపర్తి


పసి పిల్లల ముద్దు పాటలు 

పాఠముల  పట్టు దలలు

ఖరీదైన పుస్తకాలు 

పేదల పేరు పెంచే కిరీటాలు 


నిశ్చితంగా చూస్తే  

నీతో నే కుటుంబాల 

ఆశల నిచ్చెనలు

చదువు అనే బలం

బడికి పెట్టుబడి


చదువు ‘కొనడం’ తో 

చలాకీ తనం  బయట పడే

డాబులు, దర్పాలు 

నేటి చదువుకు  సూత్రాలు 

వినయం, విధేయత తో 

తెంచు ఆ విషపు కోరలు


పనికిరావు  ధనవంతుల 

ముందు నీ కుప్పి గంతులు 

లేమి రా నీకు మిగులు  


సమానత్వ భావాలు కలిగేలా

స్నేహం, సహకారం, ఐకమత్యం  తో

నలిపేసెయ్యి నీతోనే నశిoచేలా 

 పేదరికాన్ని తొలగించేలా


చదువు తో  నీతి  సూక్తులు 

ఎన్నైనా వల్లించు

ఎప్పటికైనా జ్ఞాపక ముంచు  భవిష్యత్తును జయించు


కొట్లాటలు, పోట్లాటలు కోరకు

కోట్ల విలువ చేయు నీ గుణం

ఆరోగ్య వంత పోటీ తత్వం పెంచుకో

ఆనందం అందరికీ పంచుకో  

పిల్లలందరికి   భావి జీవితం  ఎల్లకాలం నవ్య యుగం


***


-యశోద గొట్టిపర్తి





22 views0 comments

Comments


bottom of page