top of page
Writer's pictureBVD Prasada Rao

విద్యుల్లత

కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి





Video link

'Vidyullatha' Written By BVD Prasada Rao

రచన : బివిడి ప్రసాదరావు

ఆఫీసుల్లో లైంగిక వేధింపులకు గురయ్యే మహిళల కోసం ఎన్నో చట్టాలు ఉన్నాయి.

కానీ ఫిర్యాదు చేస్తే మరిన్ని వేధింపులు ఎదురవుతాయనో, నలుగురిలో నవ్వుల పాలవుతామనో చాలామంది మహిళలు బయటపడరు. మనసులోనే కుమిలిపోతారు. కానీ విద్యుల్లత లాంటి వారు ధైర్యం చేస్తారు. తాము సమస్య నుండి బయట పడటమే కాదు, మరెందరో మహిళలను కాపాడిన వారవుతారు. ఈ కథను ప్రముఖ రచయిత బి వి డి ప్రసాద రావు గారు రచించారు.

విద్యుల్లత ఆందోళన పడుతోంది.

'ఉద్యోగం మానేయ్' విద్యుల్లత తండ్రి రాజారావు చెప్పేశాడు.

'నాన్నా' విద్యుల్లత తికమక పడుతోంది.

రాజారావు ఏమీ అనలేదు.

'ఎలా నాన్నా!' విద్యుల్లత అడుగుతోంది.

రాజారావు కూతురునే చూస్తున్నాడు.

ఆ తండ్రీ, కూతురుల మాటల్ని వింటున్న కాంతం.. చాలా హైరానా పడుతోంది.

కాంతం.. రాజారావు భార్య, విద్యుల్లత తల్లి.

'నాకు చదువు అంటే ఇష్టం. చదివించారు. నాకు ఉద్యోగం అంటే ఇష్టం.

ప్రోత్సహించారు. మరి మీరే.. ఇప్పుడు ఏమిటి నాన్నా ఇలా చెప్పుతున్నారు?' తండ్రిని

ప్రశ్నిస్తుంది విద్యుల్లత.

'మరి ఎలా చెప్పమంటావమ్మా' రాజారావు నీరుకారిపోతున్నాడు.

అప్పుడే కాంతం ఏదో చెప్పబోతోంది.

'కాంతం.. నీకు అంతా తెలుసు. నువ్వింకేం చెప్పుతావు. ఆఁ' భార్యని

చూస్తున్నాడు రాజారావు.

కాంతం తడబడుతోంది.

'నీఛులు ఉంటారు. అట్టి వారితో వేగలేం. మనమా.. ఎదుర్కోలేం.. ఎదిరించలేం'

నిస్సత్తువయ్యిపోతున్నాడు రాజారావు.

'పాపం.. వేగినంత వరకూ వేగింది. మరి తాళ లేకే బెంబేలవుతోంది. ఆసరా

అవ్వక.. తన ఇష్టాన్ని తుంచేస్తే ఎలాండీ' మాట్లాడింది కాంతం.

'ఏం చెయ్యగలం కాంతం.' నిరాశలో ఉన్నాడు రాజారావు.

'మీరు ఆ ఆఫీసర్ ని కలవండి.. మాట్లాడండీ' చెప్పుతోంది కాంతం.

'ఆలకిస్తాడా..' గబుక్కున అడిగాడు రాజారావు.

'ముమ్మాటికీ అతడు పట్టించుకోడు.' గమ్మున చెప్పింది విద్యుల్లత.

భార్యా భర్తలు మొహాలు చూసుకున్నారు.

'నేను అట్టి ప్రయత్నాలు చేసేశాను. హుఁ. ప్రతి మారూ మరింత అలుసయ్యాను'

నిరుత్సాహం ధ్వనించింది విద్యుల్లత మాటల్లో.

'మరే.. హోదా దన్నుతో అహంకారాన్ని అగుపర్చే వ్యక్తి అతడు. అట్టి వారికి

ఎదుట వారి మాటలు తలకి ఎక్కవు. అతడి చేష్టలకి సై అంటే తప్పా.. అతడు దారికి

రాడు.' రాజారావు బెదిరిపోతున్నాడు.

కాంతం నొచ్చుకుంటుంది.

విద్యుల్లత తర్జనభర్జనవుతోంది.

***

రాజారావు స్కూల్ టీచర్.

కాంతం గృహిణి.

వీళ్ల ఏకైక సంతానం విద్యుల్లత.

విద్యుల్లత.. కామర్స్ లో పట్టా పుచ్చుకుంది. కొన్ని కంప్యూటర్ కోర్స్ లు పూర్తి

చేసింది.

మక్కువతో ఉద్యోగ ప్రయత్నాలు చేసుకుంది. ఒక ప్రయివేట్ ఫర్మ్ లో.. అకౌంట్

సెక్షన్ లో ఒక ఎంప్లాయ్ గా చేరింది.

అప్పటి వరకు.. అన్నీ సవ్యంగా సాగించుకున్న ఆమె.. ఉద్యోగంలో చేరిన కొద్ది

నెలలు గడిచేక.. కాకతాళీయంగా ఎదురైన ఒక కుదుపుకి గురయ్యింది.

ఆ కుదుపుకి మూలం ఆమె ఆఫీసర్.

ఆ ఆఫీసర్.. విద్యుల్లత మీద మోజు పడ్డాడు. ఆమెని లోపర్చుకోవడానికి

చిట్కాలు ప్లే చేయడం చేపట్టాడు.

తొలుత.. విద్యుల్లత సంయమనం చూపింది. సహనం ప్రదర్శించింది. కానీ.. పోను

పోను ఆఫీసర్ ఆగడాలు మేర.. మీరిపోతుండగా.. ఆమె తాళ లేకపోయింది. ఆమె నచ్చ

చెప్పడాల్ని అతడు తేలిగ్గా తీసుకునేవాడు.

మరి.. వేగ లేక.. విసిగి.. తొలుత నుండి ఆఫీసర్ చేష్టల్ని తన తండ్రికి

తెల్పుతున్న విద్యుల్లత..

ఉదయం..

'నాన్నా.. ఆ ఆఫీసర్ మరింత బరితెగిస్తున్నాడు' చెప్పింది తండ్రితో.

అంత వరకు సర్ది చెప్పుతూ వచ్చిన రాజారావు కూడా.. నిస్సాహాతతో

చేతులెత్తేశాడు. ఉద్యోగం మానేయమని కూతురుకి చెప్పేశాడు.

***

'లేదు నాన్నా.. నేను ఉద్యోగం మానేయలేను.. మానేయేను' విద్యుల్లత స్థిరంగా

అగుపిస్తోంది.

ఉలిక్కిపడ్డాడు రాజారావు.

బేలయ్యింది కాంతం.

'అవును నాన్నా.. నేను ఎందుకు ఉద్యోగం వదులుకోవాలి.' విద్యుల్లత

మొండితనం ప్రదర్శిస్తోంది.

'మరి ఎలా అమ్మా' రాజారావు గొంతు తడారుతోంది.

'చెప్తాను.. లేదు లేదు.. చేసి చూపుతాను' నిబ్బరమవుతోంది విద్యుల్లత.

'ఏమిటే.. నీ వితండం' కాంతం మాట్లాడింది.

'వితండం కాదు.. విడ్డూరం లేదు.. యత్నిస్తాను. ఐతే మనో నిబ్బరం.. పోతే ఒక

ప్రయత్నం' సివంగి మచ్చులా ఐంది విద్యుల్లత.

***

తను కలిసిన ఒక విలేకరి చేయూతతో.. ఏర్పడిన ప్రెస్ మీట్ లో మాట్లాడుతోంది

విద్యుల్లత..

వివరాలన్నీ చెప్పి.. 'ఆ ఆఫీసర్.. నేను అతనికి చేరువ ఐతీరాలని.. అతడు నానా

విధాలుగా చొరవయ్యాడు.. నన్ను చాలా హైరాన పరిచాడు. అప్పటికీ.. నేను

కాదన్నాను.. నచ్చ చెప్పాను.. బతిమలాడాను.. భయపెట్డాను. అబ్బే. అతడి సొద

అతడిదే. పైగా.. తన చేష్టలని ఎలా బుజువు చేయగలవని నన్ను అతడు గేలి చేశాడు..

ఎగతాళి చేశాడు.. తిరిగి తిరిగి భయ పెట్టేవాడు. ఇంట్లో చెప్తే.. సహనం విడిచి పెట్టకు..

స్టాఫ్ మధ్య ఉంటూ అతడికి దూరంగా ఉండమని నాతో అనే వారు.. తమలో తాము

కుమిలి పోయేవారు. చివరికి ఉద్యోగం వదులుకో మన్నారు.. కానీ నాకది చేతకాని

తనంగా తోచింది. అందుకే.. ఆలోచించాను. ఒక విలేకరి సోదరిని కలిశాను. నా

ఆలోచనలన్ని చెప్పాను. ఆవిడ సహకారంతోనే.. మీ ముందుకి రాగలిగాను.. దయచేసి

నా క్షోభని విస్తృతంగా వెల్లడి చేయండి.. ఆ ఆఫీసర్ ల్లాంటి వారిని నివారించండి..'

చెప్పడం ఆపేసింది విద్యుల్లత.

మర్నాడు ఉదయం..

మీడియోలో విద్యుల్లత విన్నపం హాట్ న్యూస్ ఐంది.

***

విద్యుల్లత.. ఆఫీస్ కి వెళ్లింది. ఆమె మిక్కిలి మొండిగా ఉంది.

ఆఫీస్ లో నిన్నటిలాంటి గందిక లేదు.. సాధారణ అలికిడి ఉంది.

ఎవరి పనులు వారు చేసుకుంటున్నారు.

హాజర్ పట్టీ లో సంతకంకై ఆఫీసర్ కేబిన్ కి వెళ్లింది విద్యుల్లత.

సీట్లో ఆ ఆఫీసర్ లేడు. హెడ్ క్లర్క్ ఉన్నాడు.

హాజర్ పట్టీ చూపుతూ.. 'సంతకం చేయమ్మా. ఆఫీసర్.. మేనేజ్మెంట్ చే డిస్మిస్

కాబడ్డాడు. ఆర్డర్స్ ప్రకారం నేను.. అతడి ఛార్జీ.. టెంపరరీగా తీసుకున్నాను' మెల్లి

మెల్లిగా చెప్పాడు హెడ్ క్లర్క్.

విద్యుల్లత హాజర్ పట్టీలో సంతకం చేస్తోంది. ఆమె నిబ్బరం నిశ్చింతయ్యింది.

ఆ తర్వాత.. విద్యుల్లతకి ఆ ఆఫీసర్ గురించి మరో విషయం తెలిసింది.

అది.. ఆ ఆఫీసర్ కుటుంబ సభ్యులు.. అతడ్ని వెలి వేసేశారని.

విద్యుల్లత విస్మయమయ్యింది.

***

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.

లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.


గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

మనతెలుగుకథలు.కామ్ లో రచయిత ఇతర రచనలకు క్లిక్ చేయండి.

రచయిత పరిచయం : బివిడి ప్రసాదరావు.

రైటర్, బ్లాగర్, వ్లాగర్.

వీరి బ్లాగ్ - బివిడి ప్రసాదరావు బ్లాగ్

వీరి యూట్యూబ్ ఛానల్ - బివిడి ప్రసాదరావు వ్లాగ్

వీరి పూర్తి వివరాలు ఈ క్రింది లింక్ ద్వారా తెలుసు కోవచ్చు.




246 views0 comments

Comments


bottom of page