top of page
Writer's picturePitta Govinda Rao

విలేజ్ బ్రాండ్



'Village Brand' - New Telugu Story Written By Pitta Gopi

Published In manatelugukathalu.com On 21/02/2024

'విలేజ్ బ్రాండ్' తెలుగు కథ

రచన: పిట్ట గోపి


కనీస సౌకర్యాలు లేని చింతపల్లి అనే ఆ ఊరు అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంది. అసలు ఆ ఊరే పట్టణానికి దూరంలో ఉంది. ఓట్లు కోసం వచ్చే నాయకులే తప్ప అభివృద్ధి చేయటానికి వచ్చే నాయకులు లేరు. గట్టిగా అడిగే దమ్ము ప్రజ‌కు లేదు. వాళ్ళంతా పేద, మధ్యతరగతికి చెందిన వాళ్ళే. 


ఆ ఊరిలోనే ఇద్దరు ప్రాణ స్నేహితులు రాణా, రాకేష్ ఉన్నారు. ఇద్దరూ పేదింటి కుసుమాలే. చదువులో ఎవరికి వారే సాటి. ఇద్దరూ తెలివైనవారే. అన్ని పేద కుటుంబాల్లో కూడా కష్టపడే పిల్లలు ఉండకపోవచ్చు కదా.. ! రాణా ఆ కోవాకు చెందినవాడే. రాకేశ్ తండ్రి కష్టాన్ని అర్థం చేసుకుని చిన్నప్పటి నుండే తండ్రికి ఏదో ఒకలా సహాయపడుతూ చదువు కొనసాగించేవాడు. 


చదువురాని తల్లిదండ్రులు తమ పిల్లలకు ఎన్ని తెలివితేటలు ఉన్నాయో, చదువు పై ఎంత ఆసక్తి ఉందో తెలుసుకునే శక్తి ఉండదు. అందుకే పేదల పిల్లలు అందరూ గొప్పవాళ్ళు కాలేకపోతున్నారు. కొందరు పిల్లలే తమ చదువు పై తామే నిర్ణయం తీసుకుని, చదువుకు తగ్గ సంపాదన చేస్తుంటారు. 


బాల్యం ఎంత మధురం కదా.. అసలు బాల్యానికి పగ, ద్వేషం, ఈర్ష్య, ఆసుయ వంటివి తెలియదు. బాల్యంలో చక్కగా ఒకరికొకరు స్నేహితులుగా మెలిగిన వారిద్దరూ పై చదువులకు వెళ్ళే సరికి మనసులో కనపడని రహస్యాలతో ఒకరికొకరు శత్రువులుగా మారారు. ముఖ్యంగా రాణా. 


ఊరిలో రాకేశ్ తండ్రికి సహయపడుతు చదువుకుంటుంటే, రాణా కేవలం ఇంటి దగ్గర ఉండి చదువుకుంటున్నాడు పైగా రాణా, రాకేష్ లు ఇద్దరు ఒకేలా చదువుతారు. ఇది ఊరి జనాలు నోటిలో నానే మాట. అందుకు రాకేశ్ మాత్రం ఏం చేస్తాడు.. ? అనవసరంగా రాణానే పగ పెంచుకున్నాడు. అక్కడితో ఆగక తన చదువు పూర్తి అవగానే అమెరికాలో పెద్ద టెక్సా కంపెనీలలో ఉద్యోగం సంపాదించి అక్కడికి పోయాడు. 


ఇప్పుడు ఊరిలో ఎక్కడ చూసినా రాణా గూర్చే మాటలు. పూరిపాక ఊరు నుండి అమెరికా వెళ్ళి నెలకు లక్షల్లో సంపాదన అంటే మాటలా మరీ.. ? అదే విధంగా అంతటి చదువు చదివి ఊరిలో ఉంటు పని చేస్తున్న రాకేశ్ పై నెగిటివ్ మాటలు


రాకేష్ కూడా అక్కడికి వెళ్ళగలడు. ఎందుకంటే రాణా చదివిన చదువే రాకేష్ చదివాడు. అతడి కంటే రాకేష్ పదిరెట్లు తెలివైనోడే. చిన్నప్పటి నుండి తల్లిదండ్రులు కష్టం చూస్తూ పెరిగాడు. పైగా పిల్లలు వయస్సు పెరుగుతుంటే తల్లిదండ్రులు వయస్సు పెరగకుండా ఉంటుందా.. ?


తల్లిదండ్రులు పిల్లలకు చదువుకు పంపేది మంచి భవిష్యత్ నిర్మించుకుంటారనే తప్ప ఆ చదువు చాటున తమను మర్చిపోతారని, ఇబ్బందులు పెడతారని కాదు. ఆ విషయం రాకేశ్ కి బాగా తెలుసు. చదువు పూర్తి అయినా కొంత కాలం ఊరిలో ఉంటు తల్లిదండ్రులుకు సహయపడే వాడు. 

ఎంతైనా చదువుకున్నోడు కదా ఊరిలో ఉండి డబ్బు ఎలా సంపాదించాలో తెలుసుకోలేడా.. అసలే ఆ ఊరు పట్టణానికి దూరంలో ఉంది. ఊరిలో ఎక్కువ ప్రభుత్వ భూములు ఎన్నో ఏళ్లుగా వినియేగం లేకుండా ఉన్నాయి. వాటి పై రాకేశ్ కన్ను పడింది. తన ఆలోచనలుతో అక్కడ వ్యవసాయం ప్రారంభించాడు. 


కొత్త కొత్త ఒరవడితో సొంత కష్టంతో, సొంత ఆలోచనలతో సేద్యం చేసి ఒకే ఏడాదిలో రెండు, మూడు పంటలతో అదిక లాభాలు అర్జించి నాలుగేళ్ళలో తిరిగి అదే భూమిని కనుగోలు చేశాడు. ఒక్కో ఏడాది పంట దిగుబడి తగ్గినా.. నష్టం ఉండేది కాదు. అక్కడే రాకేశ్ ఊరిలోనే బంగారం దొరుకుతుంటే ఎక్కడో వెతుక్కోవటం ఎందుకనుకున్నాడు. సేంద్రియ ఎరువులు వాడుతూ వ్యవసాయంలో నూతన ఒరవడి తీసుకుని వచ్చాడు. పొలం పని తండ్రికి అప్పగించాడు. పశుపోషణతో ఒకవైపు పాల ఉత్పత్తులు మొదలెట్టాడు. ఆరంభంలో ఎన్నో కష్టా నష్టాలు ఎదుర్కున్న రాకేశ్ ఇప్పుడు అదిక లాభాలు అర్జిస్తున్నాడు. 


అమ్మకు ఆనందంగా చూసుకోవాలి, నాన్నకు సంపాదనలో ఎలాగైనా సహయపడాలి అనే తన చిన్ననాటి ఆలోచనను ఇప్పుడు ఆచరిస్తున్నందుకు ఆనందించాడు. 


రాణా లక్షల జీతంతో ఊరిని, ఊరిలో తల్లిదండ్రులును మర్చిపోయాడు. దీంతో డబ్బు మీద ఉన్న ద్యాస తల్లిదండ్రులు పై లేదని రాణాని ఊరి జనాలు తిట్టుకునేవారు. రాకేశ్ ఎంత చదువు చదివినా.. తల్లిదండ్రులును సంతోషంగా చూసుకుని ఊరిలో ఒక బ్రాండ్ అంబాసిడర్ గా మారాడని మెచ్చుకునేవాళ్ళు. నిజమే కదా మరీ.. 


ఎక్కడో దూరాన ఉండి లక్షలు సంపాదించి తల్లిదండ్రులును చూసుకోని వాడి కంటే, ఎంత కష్టం వచ్చినా కన్నవాళ్ళని వదలించుకోకుండా దగ్గరుండి వారిని చూసుకోవటమే కాక వారి ఆనందానికి కారణం అయ్యేవారిని మెచ్చుకోకుండా ఉండరు కదా.. ?


రాకేశ్ కి వ్యవసాయంలోను, పశుపోషణను పనివారి అవసరం అవటం, ఊరిలో కొందరికి పని కల్పించటం, వారి కుటుంబ యోగక్షేమాలు ఆలోచించటం, తాను కూడా కష్టపడుతుండటంతో మంచితనానికి బాగా అలవాటుపడ్డాడు. తన సంపాదన కూడా ఇప్పుడు లక్షల్లో ఉండటంతో ఊరిని అభివృద్ధి చేయటానికి ప్యూహం రచించాడు. 


రాకేశ్ నడుస్తున్న తీరు నిజంగా అమోఘం. ముందు మనము, మన కుటుంబం తర్వాతే సమాజం అన్నారు కదా పెద్దలు దానికి తగ్గట్టుగా ఉంది రాకేశ్ తీరు. నాయకులు చేయాల్సిన పనులు అన్ని తన ఖర్చుతో చేశాడు. ఊరికి సీసీ రోడ్డు, దానికి ఇరువైపులా పచ్చని మొక్కలు, వీది దీపాలు, మంచినీటి సౌకర్యాలు, మురుగు కాలువలు మొదలైన సౌకర్యాలు కల్పించి అందరి మన్ననలు అందుకున్నాడు. 


రాకేశ్ తాను ఎదిగిన తీరు, తన ఊరుని ఉద్దరించిన తీరు చాలా చాలా గ్రేట్. 


ఇదిలా ఉంటే రాణా ఒకరోజు గ్రామం చూడ్డానికి సొంత కారులో వచ్చాడు. రాకేశ్ గూర్చి, ఊరు గూర్చి తెలియని రాణా లక్షలు సంపాదించే తనకు ఊరిలో అమాంతం ఆకాశానికి ఎత్తేస్తారనుకున్నాడు. ఊరు సీసి రోడ్డుతో ఉండటం, పచ్చని చెట్లు ఊరు పొలిమేరను చూసి రాంగ్ ప్లేస్ కి వచ్చానా.. ? అని కన్ఫ్యూజ్ లో పడ్డాడు. కొంచెం ముందుకు వెళ్ళగా బోర్డు చూసి తన గ్రామమనే స్థిమితపడ్డాడు. 


 కారులో ఊరు వెళ్ళిన రాణాను ఎవరి పట్టించుకోకపోవటం, ఊరు రూపురేఖలు మార్చింది రాకేశ్ అని తెలుసుకుని రాకేశ్ అంటే మనసులో ఆసుయ ఉన్న రాణా మరింత ఆసుయ పెంచుకున్నాడు. రాకేశ్ వచ్చి యోగక్షేమాలు అడిగి తన స్నేహత్వాన్ని నిరూపించుకున్నాడు. అయినా.. రాకేశ్ కష్టపడుతున్నాడు అని అతడి సంపాదనను తక్కువగా మాట్లాడేవాడు రాణా. 


"చూడు డియర్, చేసే పనిలో నిజాయితీ కనుక ఉండి, నీ కాళ్ళ పై నీవు నిలబడగలిగితే కష్టపడ్డానికి సిగ్గు ఎందుకు.. ? రాకేశే నిజమైన హీరో. తన కష్టంతో తన వారిని పోషించి ఊరుని కూడా ఉద్దరించిన రాకేశే నిజమైన హీరో. ఊరికి అవతల ఉండి నువ్వు సంపాదిస్తున్న దానికంటే రాకేశ్ ఎక్కువే సంపాదిస్తున్నాడు. అందరికీ మంచి వ్యవసాయ పద్దతులు నేర్పాడు. ఊరికి కొత్త కొత్త యంత్రాలు పరిచయం చేశాడు. కోట్లు దోచుకునే నాయకులు చేయలేని పని కష్టపడి సంపాదించిన డబ్బుతో ఊరు ఉద్దరించినోడు ఎక్కడా.. ?తల్లిదండ్రులు యోగక్షేమాలు కూడా పట్టించుకోని నువ్వు ఎక్కడా.. ? 


రాకేశ్ ని విమర్శించే అర్హత నీకు ఉందో లేదో తెలుసుకో. ఏ పని చేస్తున్నామన్నది కాదు ఒకరి మీద ఆదారపడకుండా బతుకుతున్నామా లేదా అది చూడు. మన ఊరు బ్రాండ్ ఇమేజ్ అమాంతం పెరిగిందంటే కారణం రాకేశే. శత్రువులు ఎక్కువ అవుతారని రాజకియాలకు దూరంగా ఉంటున్నాడు కానీ.. ! రాజికియాలు చేయకుండా ప్రజలకు దగ్గరగా ఉంటున్న ఏకైక వ్యక్తి రాకేశ్. అతడి స్థానానికి నువ్వు సరితూగవు " అని రాణాకు ఊరి జనాలు బుద్ధి చెప్పారు. 

**** **** **** **** **** ****

పిట్ట గోపి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు. లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.


గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం: పిట్ట గోపి ( యువ రచయిత )

Profile:

Youtube Playlist:

సమాజం వేసే తప్పుడడుగులను సరిచేయాలంటే పదిమంది కి మంచి విషయాలు తెలపాలి. అలా జరగాలంటే మనం మంచి రచయిత గా మారి పాఠకులకు అందేలా చేయాలనేది నా అభిలాష. ఎనిమిదో తరగతిలో జరిగిన చిన్న రోడ్డుప్రమాదంతో స్వల్ప వినికిడి సమస్య తలెత్తినా.. సామాన్యుడిగా ఉండటానికే ప్రాధాన్యతనిస్తా. ఈ రోజు మనం వేసే ప్రతి మంచి అడుగుని మనకంటే చిన్నవారు ఖచ్చితంగా అనుసరిస్తారనే ఆశ కలవాడిని. చదువుకునే ప్రతిఒక్కరు... సమాజం కోసం ఆలోచిస్తే... ఈ సమాజం అభివృద్ధి పథంలో నడువటం ఖాయం 



\


32 views0 comments

Commentaires


bottom of page