top of page
Writer's pictureA . Annapurna

విలువలు కోల్పోతున్న జీవితాలు



'Viluvalu Kolpothunna Jeevithalu' - New Telugu Article Written By A. Annapurna

Published In manatelugukathalu.com On 23/05/2024  

'విలువలు కోల్పోతున్న జీవితాలు' తెలుగు వ్యాసం

రచన: ఏ. అన్నపూర్ణ

(ఉత్తమ అభ్యుదయ రచయిత్రి)


ఇటీవల కొన్ని కుటుంబాలలో పెళ్ళై, ఇద్దరు పిల్లలు వున్న వారు సైతము అనైతిక సంబంధాలతో కన్న బిడ్డలకు వేదన కలిగిస్తున్నారు. స్త్రీ -పురుషుల ఈ ధోరణి సమాజానికి చెరుపు చేస్తుంది. వీరు ఎక్కడో పుట్టి పెరిగిన అడివి మనుషులు కారు. ఆధునికత సంతరించుకుని చదువు, ఒక గుర్తింపు, హోదా కలిగినవారే!


దీనికి కారణాలు పరస్పరం ఎన్ని చెప్పుకున్నా ఎవరికివారికి బుద్ధి, జ్ఞానం అంటూ ఉంటుంది. తప్పటడుగు వేసే సమయంలో 'నేను ఇలా చేయడం సరికాదు. దీనివలన రెండు కుటుంబాల విచ్ఛిన్నత, ఇబ్బందులు, వ్యక్తిగత గౌరవం కోలుపోవడం జరుగుతుంది....’ అనే ఆలోచన ఉండాలి. 


 మాటాడితే ''ప్రేమించాను'' అనే మాటలు వాడుతూ వుంటారు. ప్రేమ అంటే పంచదార కాదు, పదిమందికి

ఒకేలాంటి ప్రేమను పంచడానికి. ఈ ప్రేమకు పర్యాయ పదం అనైతిక శారీరక సంబంధం. అసలు పెళ్లి వేరు, ప్రేమవేరు అనే మనుషులు వీళ్ళు. 


ప్రేమ అనేమాట మీద గౌరవం అంటూ వుంటే, ‘అది ఒక్కరికే చెందుతుంది’ అనేలా పవిత్రంగా ఉండాలి. అంతేకాని మనిషి మనిషికి మారకూడదు. ప్రేమించే మనిషిని కూడా గౌరవించాలి. 


వొక్కరితోనే జీవితం అనుకోవాలి. అలా మారుతూ వుండే స్వభావం ఉన్నవారిలో లోపం ఉన్నట్టు గా భావించాలి.. 

ఎంతగా పరిచయంవుండి ప్రేమించే పెళ్లి చేసుకున్నా, భార్య భర్తలుగా మారాక విబేధాలు తప్పవు. అది సహజం కూడా. వాటిని పెద్దవిగా చేసుకుని గొడవలు పడకూడదు. సహనంతో పరిష్కరించుకోవాలి. అంతేకాని మనశ్శాంతి లేదనో వృత్తిపరంగా దగ్గిర అయ్యామనో వేరే వ్యక్తులతో ఇంటి విషయాలను పంచుకోడం తప్పు. 


అది బలహీనత అవుతుంది. మగ స్నేహితులు వుంటారుగా.. వాళ్ళతో చెప్పుకోవచ్చు. అది ఇష్టం లేనివారు కౌన్సిలింగ్కి వెళ్ళచ్చు. అలాగే ఆడవారు కూడా పరాయి మగవారితో చెప్పవద్దు. అది ఇలాంటి చెడు స్నేహానికి దారితీస్తుంది. 

 ఏవో చిరాకులు, కోపం వలన ఆ క్షణం ఒకరి ప్రవర్తన రెండో వారికి తప్పుగా తోచినపుడు తీరికగా ఆలోచించుకుంటే చిన్నవిగా కనిపిస్తాయి. మరీ బలమైన కారణాలు ఉండీ సరిపడనప్పుడు పెద్దవారి సహాయం కూడా తీసుకుని మర్యాదగా విడిపోవాలి. 


అంతేకాని రెండు పడవల సంసారం అధోగతికి దారి తీస్తుంది. అసలు తప్పులు చేయనివారు వుండరు. ఆ తప్పు దిద్దుకునేదే అవ్వచ్చు. కానీ మరోతప్పు చేయకండి. 


పెద్దవాళ్ళకి బాధ లేకపోవచ్చు. సునాయాసంగా సర్దుకుపోవచ్చు. ఎలాగైనా జీవిస్తారు. కానీ పిల్లలు ఉంటే చాలా నష్టపోతారు. ఆ పిల్లలు సరిగ్గా పెరగరు. మానసిక క్షోభకు గురి అవుతారు. అసలు పెళ్లిచేసుకున్న మనిషిలో లేనిది, మరొక మనిషిలో ఉందనుకోడం భ్రమ. ప్రతీ వారిలో లోపాలు కచ్చితంగా ఉంటాయి. 


నేను మగవాడిని, ఏమి చేసినా సమాజము నన్ను తప్పుపట్టదు అని మగవారు భ్రమ పడుతుంటారు. ఆ రోజులు కావు ఇప్పుడు. ఎవరు తప్పు చేసినా బయటకు వస్తుంది. ఉన్న గౌరవం పోగొట్టుకుంటారు. 


ఇది మహిళకూ వర్తిస్తుంది. ‘నాకూ చదువుంది. లేకపోయినా ఎన్నో వుద్యోగం చేసే అవకాశాలు చాలావున్నాయి పిల్లలను బాగా చదివించుకుంటాను’ అనే అహంకారానికి పోవద్దు. డబ్బు సంపాదించుకోవచ్చు. కన్న తల్లి - తండ్రి ప్రేమను తీసుకురాలేరు. కొందరు పిల్లలు రాటుదేలిన మనసు కలవారు వుంటారు. అర్ధం చేసుకోగలరు. కొందరు తట్టుకోలేరు. తల్లి పట్ల వ్యతిరేకత పెంచుకుంటారు. 


ఆ బాధను ఎవరితో పంచుకోవాలో అర్ధంకాక అసలు సమస్యను తెలుసుకోలేక మనుసు గాయపడి కుమిలిపోతారు. 

పిల్లలపట్ల తండ్రి కఠినంగా వుండరు. అలా ఉండివుంటే పిల్లలు తల్లివేపే వుంటారు. సున్నిత మనస్కులు

అలజడికి లోనై ఇల్లువదిలి వెళ్లిపోడమో సూసైడ్ చేసుకోడమో జరిగే ప్రమాదం ఉంది. 


 భార్య భర్తల మధ్య ఏగొడవ వచ్చినా ఒకసారి పిల్లలు పరిష్కరించగలరు. ‘నిజానికి నేనంటే లోకువ. లక్ష్యంలేదు. ఎవరి ఆకర్షణలోనోపడి నాలో లోపాలు ఎంచుతారు…’ అని భార్య అనుకోడం కూడా మగవారి పట్ల నిజమే జరుగుతోంది. అలాంటి స్థితి ఎవరూ తెచ్చుకోవద్దు. చక్కని కుటుంబాన్ని పరాయి మనిషి వ్యామోహంలో విచ్ఛిన్నం చేసుకోవద్దు. గడిచిపోయిన మంచి జీవితం తిరిగి రాదు. ఒక్కతప్పు జీవితకాలం శిక్ష అవుతుంది. అసలే ఈ రోజుల్లో పెళ్లిళ్లు ఆలస్యంగా జరుగుతున్నాయి. 


ఇరవై ఏళ్లకే దాపత్యంలో కలతలు తెచ్చుకుని క్షణికమైన సుఖాలకోసం పక్కదార్లు పట్టద్దు. అందమైన జీవితాన్ని ఆస్వాదించండి. పిల్లలను ఆరోగ్యకరమైన వాతావరణంలో పెంచుతూ మంచి భవిష్యత్తు ఇవ్వండి. దూరదృష్టితో పెద్దల సహాయంతో సమస్యను రాకుండా చూసుకోండి. ముఖ్యంగా మిమ్ములను మీరు అదుపులో పెట్టుకోండి. జీవితాన్ని

 ఆషామాషీగా తీసుకోవద్దు. బాగు చేసుకున్నా, ఛిద్రం చేసుకున్నా కొన్ని సందర్భాలలో భార్యా భర్తలే కారకులు

అవుతారు. 


ఒకప్పుడు అత్తమామలతో పడక వేరుగా ఉంటే ఇప్పుడు భార్యా భర్తలలోనే సఖ్యత లోపించడం చూస్తున్నాం. కాలం మారలేదు. మనుషులే విలువలు పోగొట్టుకుంటున్నారు స్వయంకృతంతో !


విలువైన జీవితాన్ని స్త్రీ పురుషులు ఇద్దరూ కూడా భద్రంగా కాపాడుకోండి. అందరికీ ఆదర్శంగా నిలవండి !

 **************************************************************************

ఏ. అన్నపూర్ణ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం 


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



 మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.


గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.



రచయిత్రి పరిచయం : ఏ. అన్నపూర్ణ


నాపేరు అన్నపూర్ణ. నేను ఇరవై సంవత్సరాలు ఏక ధాటిగా కథలు నవలలు వ్యాసాలు కవితలు కాకుండా జనరల్ నాలెడ్జ్ బుక్స్ చదివిన తర్వాత కథలు రాయడం మొదలు పెట్టాను. అమెరికాలో స్థిరపడ్డాక వచ్చిన అవకాశాలు నా రచనకు మరింత పదును పెట్టాయి. నా రచనలు చాలా వరకు నేను చూసిన ఎదురుకున్న సంఘటనల ఆధారంగా రాసినవే. ''మంచి సందేశాత్మక రచన చేయాలనే '' తపన.... తప్పితే ఏదో ఆశించి రాయడంలేదు. ఆ దాహం తీరనిది. దీని నుంచే మంచి రచన వస్తుందని అనుకుంటాను. ఎందరో గొప్పవారు చెప్పినట్టు నేర్చుకోడానికి ఫుల్స్టాప్ వుండకూడదు. ఆలా తెలుసుకుంటూ ఉండటమే కర్తవ్యమ్. నాకు ప్రోత్సహం ఇస్తున్న పత్రికల వారికీ ధన్య వాదాలు. నాది కాకినాడ. పండితవంశంలో పుట్టుక, సాహిత్యం ఊపిరి- వంశపారంగా అబ్బిన వరం.

నా మొదటికథ చదివి రచనలను ప్రోత్సహించినది ''వసుంధర.R రాజగోపాల్గారు.'' నామొదటి నవల చదివి నా శైలిని మెచ్చుకుని , చతురలో ప్రచురించడo గొప్ప అర్హతగా అభినందించిన '' శ్రీ యండమూరి.....'' ఇంకా ఇప్పుడూ కొనసాగిస్తూ ఉండటానికి కారకులు.

అలాగే నా వ్యాసాలకు సుస్థిర స్థానం కల్పించింది డా. జయప్రకాశ్ నారాయణ్ LOKSATTA ఫౌండర్. నా కవితలకు గుర్తింపు తెచ్చిన ప్రముఖ జర్నలిస్ట్ ఐ.వెంకట్రావ్ గారు, (నా మొదటి కవిత వారి '' పత్రిక ''లో వెలుగు చూసింది.)

విచిత్రం ఏమిటంటే వీరిలో మహిళా రచయిత్రు లెవరూ లేకపోడం.

రచయితలో వుండే ప్రత్యేకతను గుర్తించిన గుణం వీరిది. మరో విషయం ''జనార్ధన మహర్షి'' గారి కవితలు చదివి చిన్న మార్పులు చేస్తే బాగుంటుందేమో అని చెప్పినందుకు కొత్తగా ఏమాత్రమూ కోపం తెచ్చుకోకుండా ఆయన కొత్తగా రాసిన కవితల సంపుటిని నాకుపంపి '' సరిచూసి ఇస్తే నేరుగా ప్రింటికి ఇస్తాను ''అని చెప్పడం వారి విజ్ఞతకు సహస్ర వందనాలు. వీరంతా నేను ఎన్నటికీ మరువలేని మహానుభావులు.

ఇంకా కొందరు వున్నారు. సమయం వచ్చినపుడు వారిని గురించి చెబుతాను.

30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి,

ఉత్తమ అభ్యుదయ రచయిత్రి బిరుదు పొందారు.

(writing for development, progress, uplift)






56 views0 comments

Comments


bottom of page