top of page
Writer's pictureBVD Prasada Rao

వీరి మధ్యన... ఎపిసోడ్ 2

కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.






Youtube Video link

'Veeri Madhyana Episode 2' New Telugu Web Series


Written By BVD Prasada Rao


రచన: బివిడి ప్రసాదరావు




బివిడి ప్రసాదరావు గారి ధారావాహిక 'వీరి మధ్యన..' రెండవ భాగం


గత ఎపిసోడ్ లో...


పెళ్లి చూపులకు ముందుగా సాహసి పంపిన వీడియో చూస్తాడు సామ్రాట్. ఇద్దరికీ పెళ్లి చూపులు జరుగుతాయి.పెళ్లి చూపుల్లో సామ్రాట్ అడిగిన కొన్ని ప్రశ్నలు తనకు నచ్చనట్లు చెబుతుంది సాహసి.



ఇక వీరి మధ్యన..

రెండవ భాగం చదవండి...


"నేను మంచోడ్ని అని స్టాంపు వేసుకోను కానీ, చెడ్డవాడ్ని మాత్రం కాదు. నిన్నే కాదు ఎవర్నీ ఇబ్బంది పరిచే వాడిని కాదు. ప్రామిస్. నమ్ము." చెప్పాడు సామ్రాట్.


"థాంక్యూ" ఆగి చెప్పింది సాహసి.

"సంతోషం." అన్నాడు సామ్రాట్.

"కాల్ కట్ చేస్తాను." చెప్పింది సాహసి.

"ఒన్ మినిట్. నీ ఫోటో పంపరాదూ." అన్నాడు సామ్రాట్ మెల్లిగా.


"ఫోటోనా." అంది సాహసి వెంటనే.

"ప్లీజ్. డోన్ట్ థింక్ అదర్వైజ్. నీకు ఇష్టమైతేనే. సరేనా." అనేశాడు సామ్రాట్.


అర నిమిషం తర్వాత, "వాట్సాప్ కు పంపుతా." చెప్పేసింది సాహసి.

"మహా భాగ్యం. థాంక్యూ." చెప్పాడు సామ్రాట్.


ఆ కాల్ కట్ చేసేక, నిండుగా ఊపిరి పీల్చుకుంది సాహసి.

***

"అన్నా నమస్తే." అంటూ సామ్రాట్ కేబిన్ లోకి వచ్చాడు రమేష్.

సామ్రాట్ కో ఎంప్లాయ్ రమేష్.

"టీ టైం. రా. బయటికి వెళ్లి వద్దాం." చెప్పాడు రమేష్.


"ఫ్యూ మినిట్స్." అంటూ తిరిగి వర్క్ ను కొనసాగించాడు సామ్రాట్.

ఐదు నిమిషాలు లోపే, ఇద్దరూ టీ కై కదిలారు.


టీ తాగుతూ, "రేపు మా ఊరు వెళ్తున్నాను." చెప్పాడు రమేష్.

"వీక్ ఎండ్ కూడా కాదు. ఏంటీ అర్జంట్." అడిగాడు సామ్రాట్.


"మా వాళ్లు ఏదో పెళ్లి సంబంధం చూశారట. పిల్లను చూడ్డానికి ఊరెళ్లాలంటే, వెళ్తున్నాను." చెప్పాడు రమేష్.


"గుడ్. గో హెడ్. అన్నట్టు, ఈ మధ్య నేనూ పిల్లను చూశాను. సంబంధం కుదిరింది." చెప్పాడు సామ్రాట్ చిన్నగా నవ్వుతూ.


"కంగ్రాట్స్ అన్నా." చేయి చాచాడు రమేష్.

ఆ చేతిని అందుకుంటూ, "థాంక్యూ." చెప్పాడు సామ్రాట్.


"ఆ అమ్మాయి సాఫ్ట్వేర్ ఎంప్లాయేనా. నేను మాత్రం మన ఫీల్డ్ అమ్మాయినే ఎంపిక చేసుకుంటాను." అన్నాడు రమేష్.


ఖాళీ కప్పును పక్కన పెట్టి, "బ్యాంక్ ఎంప్లాయి." చెప్పాడు సామ్రాట్.

రమేష్ ఖాళీ కప్పును పక్కన పెట్టాడు. ఏమీ అనలేదు.


ఇద్దరూ తిరిగి అక్కడ నుండి తమ పనులకై కదిలారు.

"అమ్మాయిది ఏ ఊరు. పెళ్లి తర్వాత ఇక్కడకు ట్రాన్స్ఫర్ కాగలదా. లేదా ఉద్యోగం మానేస్తుందా. లేదా మానిపించేస్తున్నావా." అడిగాడు రమేష్.


"వరంగల్. ఇక్కడ బ్రాంచీకి మారొచ్చట. తనకు ఉద్యోగం చేయడమంటే ఇష్టమట" సామ్రాట్ చెప్పాడు.

"అచ్ఛా. అమ్మాయి ఎలా ఉంటుంది. ఫోటో చూపుతావా." నవ్వేడు రమేష్.


సామ్రాట్ తన వాట్సాప్ లోకి ఉదయమే చేరిన సాహసి ఫోటోను రమేష్ కు చూపాడు.

ఫోటోలోని సాహసిని చూస్తూనే, "ఈమా." అన్నాడు రమేష్.


"ఈమె నీకు తెలుసా." అడిగాడు సామ్రాట్.

"య. ఈమె డిగ్రీలో నా క్లాస్మేట్." చెప్పాడు రమేష్.


"ఏంటీ. నువ్వు బికాం చదివావా." అడిగాడు సామ్రాట్.

"అవునన్నా. ఇంటర్మీడియట్ చదువుతూనే మరో పక్క నేను కంప్యూటర్ కోర్స్ లు డిగ్రీ చదువు వరకు చేశాను. ఆ సర్టిఫికేట్సే నాకీ జాబ్ ను తెచ్చి పెట్టాయి." చెప్పాడు రమేష్.


"గుడ్." అన్నాడు సామ్రాట్.

"మరోలా అనుకోకు అన్నా. నీ ఉడ్బి చాలా పొగరు మనిషి. ఎవర్నీ కేర్ చేసేదే కాదు. ఎవర్నీ కలిసేదే కాదు. ఎవరైనా చొరవ ఐతే, 'అమ్మో. అమ్మోరి తల్లి' లా అయ్యిపోయేది. మేమంతా సాహసి కాదు 'పక్కా రాక్షసి' అనే వాళ్లం." చెప్పాడు రమేష్.


సామ్రాట్ ఏమీ మాట్లాడ లేదు.

"ఈమెతో నువ్వు మాట్లాడేవా." అడిగాడు రమేష్.


"వై నాట్. చూపులప్పుడే కాదు, ఈ మధ్య రోజూ మాట్లాడుకుంటున్నాం. నాకు చాలా సరళమైన మనిషిగా అనిపిస్తుంది. అలానే సూటిగా మూవ్ అయ్యే మనిషి గానూ గుర్తించాను. ఐ లైక్ హెర్ సో మచ్" చెప్పాడు సామ్రాట్.


"ఓకే అన్నా." అనేశాడు రమేష్.

ఇద్దరూ నవ్వుకుంటూ తమ తమ కేబిన్స్ వైపు నడిచారు.

***

రాత్రి ఎనిమిది దాటింది.

"ఎక్కడా." అడిగాడు సామ్రాట్ తన ఫోన్ నుండి.


"గదిలో." చెప్పింది సాహసి. ఫోన్ ను తన కుడి చెవి వైపు నుండి తన ఎడమ చెవి వైపుకు మార్చుకుంది.

"డిన్నర్ ఐందా." అడిగాడు సామ్రాట్.

"ఐంది. మీది." అడిగింది సాహసి.


"లేదు. ఇంటికి వచ్చి పది నిమిషాలైంది. నీతో మాట్లాడేశాక తింటా." చెప్పాడు సామ్రాట్.

"ఇంకేంటి." అంది సాహసి.


"ఏముంది. ఎదురు చూస్తున్నాను." చెప్పాడు సామ్రాట్.

"దేనికి." అడిగింది సాహసి.


"వచ్చే నెల ఇరవై తొమ్మిదికి." చెప్పాడు సామ్రాట్.

"చాలదు. వచ్చే నెల ముప్పైకి అంటే నమ్మేదాన్నేమో." చెప్పింది సాహసి.

"అదేంటి." డంగయ్యాడు సామ్రాట్.

"మరే. వచ్చే నెల ఇరవై తొమ్మది రాత్రి, ఒంటి గంటా పదహారు నిమిషాలకు లగ్నం." చెప్పింది సాహసి.


"ఆ. కదా. అలా ఐతే ముప్పైయే. సర్లే." గుణిచాడు సామ్రాట్.

నవ్వుకుంది సాహసి.

"మరేంటి." అడగలిగాడు సామ్రాట్.

"చెప్పాలి." అంది సాహసి.


"మా ఇంట్లో పెళ్లి పనులు హడావిడిగా సాగుతున్నాయి." చెప్పాడు సామ్రాట్.

"మీకు ఎందుకట. పెళ్లి చేయిస్తుంది మా వాళ్లు కదా." చెప్పింది సాహసి.

"నేను అదే అన్నాను. అమ్మ సర్రుమంది. 'చేతులు ఊపుకు పోతామా ఏం.' అంటూ, పాపు గంట క్లాస్ పీకింది." చెప్పాడు సామ్రాట్.


నవ్వుకుంది సాహసి.

"మీ వైపు పనులు ఎంత వరకు వచ్చాయి." అడిగాడు సామ్రాట్.

చెప్పింది సాహసి.


"ఈ 'ఆదివారం షాపింగ్ కు వెళ్లాలి' అంది అమ్మ. పెళ్లికి నేను బట్టలు ఎంపిక చేసుకోవాలట." చెప్పాడు సామ్రాట్.


"అవునా. నావి ఐపోయాయి. రడీ టు వేరింగ్. అన్నట్టు నేను చెప్పి ఉన్నానుగా. ఆ కలర్ డ్రస్ తీసుకోవాలి. ప్లీజ్. నేను ఆ కలరే తీసుకున్నాను లగ్నం సమయంకి." చెప్పింది సాహసి.


"తప్పక. వీలైతే, నీ లగ్నం డ్రస్ ఫోటో పెట్టగలవా." అడిగాడు సామ్రాట్.

"ఆంటీకి ఫోటో పంపానుగా. చూడ్లేదా." అంది సాహసి.


"లేదు. అమ్మని అడిగి, చూస్తాలే." చెప్పాడు సామ్రాట్.

"మీక్కూడా ఆ ఫోటో పంపుతాలే." చెప్పింది సాహసి.


"ఇప్పటికైనా ఏకవచనం లోకి వచ్చేయవా. నాకు అలా ఇష్టం. చెప్పాగా" అన్నాడు సామ్రాట్.

"సారీ. ఇంకా అలవాటు కాకుంటుంది." చెప్పింది సాహసి.

"ఇంకేంటి." అన్నాడు సామ్రాట్.

"మీరే చెప్పండి." అంది సాహసి.


"హే." అన్నాడు సామ్రాట్. ఆ వెంబడే, "మీరేంటి. మీరు అనకు. నాకు ఏదోలా ఉంది. ఆ. ఏకవచనంలోకి వచ్చేయరా. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్." చెప్పాడు.


ఆగి, "నువ్వు చెప్పు." అనగలిగింది సాహసి.

"థట్స్ గుడ్, పక్కా రాక్షసి." అన్నాడు సామ్రాట్.


వెంటనే, "ఏంటేంటేంటి. ఏమిటా పిలుపు. ఎక్కడదా పిలుపు." గాభరయ్యింది సాహసి.

సామ్రాట్ ఏమీ మాట్లాడలేదు.


"నా కాలేజీలో నాకు అలా అనే పేరు ఉంది. మీ.. సారీ, నీకు ఎలా తెలుసు." అంది సాహసి.

"అదేమిటో నాకు అలా తెలిసి పోతుంటాయి." చెప్పాడు సామ్రాట్ చిత్రంగా.


"చాల్లే. సినిమా డైలాగులు కట్టి పెట్టి, ఎలా తెలిసిందో ముందు చెప్పు." అంది సాహసి.

"అప్పటి నీ క్లాస్మేట్, ఇప్పటి నా కో ఎంప్లాయి, రమేష్ చెప్పాడు." చెప్పేశాడు సామ్రాట్.


"ఓ. అలానా." అనేసి, "రమేషా, ఏమో.. ఉండొచ్చు. గుర్తు లేదు." ఊరుకుంది సాహసి.

"నీ పొగరుకు, నీ అమ్మోరి తల్లి పూనకంకి ఇప్పటికీ నిన్ను తలుచుకొని, హడలి పోతున్నాడు రమేష్." చెప్పాడు సామ్రాట్.


"మరే. నాతో వ్యవహారం అలానే ఉంటుంది. చనువు చూపితే చంకెక్కే తీరు మగాళ్లది." చెప్పింది సాహసి.


"తల్లీ. శాంతించు. నన్ను కరుణించు. నేనూ మగాడ్నే." అన్నాడు సామ్రాట్.

"నువ్వు నాకు వేరేలే." చెప్పింది సాహసి నవ్వుకుంటూ.

"థాంక్స్ తల్లీ. నేను అమాయకుడ్ని." అన్నాడు సామ్రాట్.


"మీకు, సారీ, నీకు నువ్వే సర్టిఫికేట్ ఇచ్చుకోవడం సరి కాదు." అంది సాహసి.

"మరి నువ్వే చెప్పు. నేను అందరిలా అనిపిస్తున్నానా." అడిగాడు సామ్రాట్.


"అలా అనలేను కానీ, నువ్వు ఆరాల మనిషివి, ఆరాట పడే మనిషివి. ఐనా నువ్వు నాట్ బేడ్." అంది సాహసి. వెంబడే నవ్వుకుంది.


"చూడు. నీతోనే నేను గుడ్ బోయ్ అనిపించుకుంటాను." చెప్పాడు సామ్రాట్.

"అసాధ్యం." అనేసింది సాహసి.


"అదేంటి. అలా అనేశావు." డీలా పడ్డాడు సామ్రాట్.

"మరే. నువ్వు ఇప్పుడు బోయ్ వి కాదు." అంది సాహసి.


"య. నేను నీతో 'గుడ్ మాన్' అనిపించుకు తీరుతా." చెప్పాడు సామ్రాట్.

నవ్వుకుంది సాహసి. "సర్లే. టైం బాగా ఐంది. డిన్నర్ కు వెళ్లు." చెప్పింది.


ఆ కాల్ కట్ కాగానే, సామ్రాట్ తన గది నుండి డైనింగ్ టేబుల్ ముందుకు చేరాడు.

***

వారం రోజులు గడిచాయి.


రాత్రి పది కాబోతుంది. సామ్రాట్ మంచం మీద నడుము వాల్చాడు కానీ, నిద్ర పోలేదు. తన కుడి చేతిలోని, తన సెల్ ఫోన్ వైపే చూస్తున్నాడు.


పదయ్యింది. ఆ ఫోన్ రింగవుతుంది. వెంబడే ఆ కాల్ కు కనెక్టు అయ్యాడు.

"థాంక్యూ, వేచి ఉన్నందుకు." అటు నుండి ఆమె చెప్పింది.


ఆమె జ్వాల. గత మూడు రోజులుగా, సామ్రాట్ కు, సరిగ్గా రాత్రి పది గంటలకు ఫోన్ చేస్తుంది. తన పేరు చెప్పక, 'రేపు ఇదే టైంకు ఫోన్ చేస్తా. వేచి ఉండాలి, ప్లీజ్.' అని మాత్రమే చెప్పి, కాల్ కట్ చేసేస్తుంది.


సామ్రాట్ కు తొలుత చిత్రమనిపించినా, పిదప గింజుకుంటున్నాడు.

'ఎవరామె. ఎందుకిలా ఫోన్ చేస్తుంది.' ప్రశ్నించుకుంటున్నాడు. తంటాలు పడుతున్నాడు. పోనీ ఆ ఫోన్ నెంబర్ ను ట్రేస్ చేద్దామంటే, రోజుకొక ఫోన్ నెంబర్ తో కాల్ వస్తుంది.


జ్వాల ఈ మారు మాత్రం, ప్రతి రోజులా కాక, 'వేచి ఉన్నందుకు థాంక్స్' అంది. ఆమె అలా అంటుండగానే, "హే. ఎవరు నువ్వు. ఏమిటీ పిచ్చి పని." గట్టిగానే అరిచేశాడు సామ్రాట్.


"కోపమా." అంది జ్వాల.

"ఏమీ కాదు. అసలు నువ్వు ఎవరు. నాకు ఎందుకు ఈ సొద." అన్నాడు సామ్రాట్ గబగబా.


"కూల్ సామ్రాట్." అంది జ్వాల నింపాదిగా.

"వాట్. నా పేరు నీకు తెలుసా." టక్కున లేచి కూర్చున్నాడు సామ్రాట్.


"పిచ్చోడా. నీ పేరే కాదు. నీ గురించి అంతా తెలుసు." చెప్పింది జ్వాల.

"అరె. నువ్వు ఎవరో నాకు తెలీదు." చిరాకవుతున్నాడు సామ్రాట్.


"కూల్ గా హేండిల్ చేస్తే, నా గురించి చెప్తాను." అంది జ్వాల.

"ఆ. అఘోరించు." అన్నాడు సామ్రాట్ విసురుగా.


"అదే. అదే తగ్గించుకో. చెప్పాగా. 'హేండిల్ విత్ కేర్' అని." చెప్పింది జ్వాల. తను నవ్వుకుంటుంది.


సామ్రాట్ ఏమీ మాట్లాడలేదు.

"మౌనమా. అలకా." అడిగింది జ్వాల.


"ఏమీ కాదు. ముందు చెప్పు." అన్నాడు సామ్రాట్.

"రేపు చెప్పుతా." అంది జ్వాల.


"లేదు లేదు. ఈ సస్పెన్స్, ఈ టెన్షన్ నా వల్ల కాదు. ప్లీజ్ ఇప్పుడే చెప్పేయ్." గబగబా మాట్లాడేడు సామ్రాట్.

"అచ్ఛా. బహుద్ పసంద్ హై. నీలోనూ బతిమలాడేతనం ఉందా." అంది జ్వాల చిత్రంగా.


"ఎవరబ్బా నువ్వు. ఎందుకు నన్ను ఇలా వేపేస్తున్నావు." అన్నాడు సామ్రాట్ నీర్సంగా.

"అంత హైరానా పడక్కర లేదు అబ్బాయ్. నా ప్రశ్నకు జవాబు ఇచ్చేస్తే, నేనే నీ ముందుకు వచ్చేస్తాను." చెప్పింది జ్వాల.


"ప్రశ్నా. ఏమిటీ. ఈ తిరకాసేమిటి." గింజుకుంటున్నాడు సామ్రాట్.

"ముందు నువ్వు కూల్ అవ్వు." అంది జ్వాల.

సామ్రాట్ మాట్లాడలేదు.


"రిలేక్స్డ్ మాన్. ఏదీ, గట్టిగా గాలి పీల్చుకో." చెప్పింది జ్వాల.

ఫోన్ ను మరో వైపుకు మార్చుకుంటూ, "ఏమిటీ ఎక్సర్సైజ్ లు. స్పీకవుట్. ఎవరు నువ్వు." అన్నాడు సామ్రాట్ చిరగ్గా.


"నువ్వు రిలేక్స్ కావడానికే చెప్పుతున్న. ముందు చెప్పింది చేయ్. లేదా మరో రోజు పెంచేస్తాను నేను ఎవరో చెప్పడానికి." చెప్పింది జ్వాల.


"అబ్బబ్బే. వద్దొద్దు. ఇప్పుడే చెప్పు." గాభరా అయ్యాడు సామ్రాట్.

"ఐతే, నేను చెప్పేలా చెయ్యి." చెప్పింది జ్వాల.

"సరే. చస్తానా. చెప్పు." అనేశాడు సామ్రాట్.

"ఏదీ. గట్టిగా గాలి పీల్చుకో.." ఆగింది జ్వాల. సామ్రాట్ అలానే చేశాడు.


"కొద్దిసేపు ఆ గాలిని బిగపట్టు." చెప్పింది జ్వాల. సామ్రాట్ అదీ చేశాడు.

అర నిమిషం ఆగి, "ఇప్పుడు ఆ గాలిని మెల్లిగా వదిలిపెట్టు." చెప్పింది జ్వాల. సామ్రాట్ నెమ్మదిగా గాలి విడిచాడు.


అర నిమిషం తర్వాత, "ఐంది కదా." అంది జ్వాల.

"ఆ." అన్నాడు సామ్రాట్.


"గుడ్. ఇప్పుడు ఈ ప్రక్రియను ఐదు సార్లు చేసి, చెప్పు." చెప్పింది జ్వాల.

"లేదు లేదు. నేను కూల్ అయ్యాను. చెప్పేసి." అన్నాడు సామ్రాట్ హైరానాగా.


"నో నో. ఫస్ట్ చేయ్. నేను లైన్ లో ఉంటాను. నువ్వు నీ ఫోన్ ని చెవి దగ్గరే పెట్టుకొని, నేను చెప్పింది చేయ్. నాకు నీ ఊపిరి చప్పుళ్లు వినిపించాలి." చెప్పింది జ్వాల. సామ్రాట్ తప్పక, ఆ ప్రక్రియను ఐదు మార్లు చేశాడు.

***

(కొనసాగుతుంది..)

***

బివిడి ప్రసాదరావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ లో లాగిన్ కావడానికి, మేము నిర్వహిస్తున్న వివిధ పోటీల వివరాలు తెలుసుకోవడానికి ఈ లింక్ క్లిక్ చేయండి.


ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.

లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


రచయిత పరిచయం : బివిడి ప్రసాదరావు.

రైటర్, బ్లాగర్, వ్లాగర్.

వీరి బ్లాగ్ - బివిడి ప్రసాదరావు బ్లాగ్

వీరి యూట్యూబ్ ఛానల్ - బివిడి ప్రసాదరావు వ్లాగ్

వీరి పూర్తి వివరాలు ఈ క్రింది లింక్ ద్వారా తెలుసు కోవచ్చు.




307 views0 comments

Comments


bottom of page