#AAnnapurna, #ఏఅన్నపూర్ణ, #వివాహంఅనేవ్యవస్థమాయమవుతోందా, #VivahamAneVyavasthaMayamavuthoda, #TeluguSpecialArticle, #AnnapurnaArticles, #సామాజికసమస్యలు
Vivaham Ane Vyavastha Mayamavuthoda - New Telugu Article Written By A. Annapurna
Published In manatelugukathalu.com On 26/12/2024
వివాహం అనే వ్యవస్థ మాయమవుతోందా? - తెలుగు వ్యాసం
రచన: ఏ. అన్నపూర్ణ
(ఉత్తమ అభ్యుదయ రచయిత్రి)
''మా అబ్బాయికి ఏమైనా సంబంధం ఉంటే చెబుదురూ..” అంటూ అబ్బాయి తల్లి ఒకరు అడిగారు.
ఆవిడ బ్యాంకు ఆఫీసర్గా పనిచేసి రిటైర్ అయ్యారు. పార్కులో పరిచయం. పేరు ఇందుమతి.
''అలాగే ! అమ్మాయిలు ఐతే వున్నారు. కానీ మీరే వాళ్ళతో డైరెక్టుగా మాటాడుకోండి. ''అంటూ నెంబర్ ఇచ్చాను.
''అబ్బాయి తల్లి మీకు బంధువా? మీపేరు చెప్పవచ్చా..” అన్నారు ఇందుమతి.
''చెప్పండి. ఇందులో రహస్యం ఏముంది! ఐతే ఎంతవరకూ సక్సెస్ అవుతుంది అనేది చెప్పలేను. ''అన్నాను.
'జాతకాలు నప్పలేదుట’. వారం రోజుల తర్వాత ఆవిడ చెప్పేరు.
కోయంబత్తూర్ లోవుండే మా కజిన్ అడిగింది. నీకు తెలిసిన పెళ్ళికొడుకు ఉంటే చెప్పమని.
సరే అని నాకుతెలిసిన సంబంధం పంపించాను. నెల రోజులు అయినా మాటామంతి కబురులేదు.
ఇటు అబ్బాయి మదర్.. ‘ఏమన్నారు?’ అంటూ రోజూ అడిగేది. నేను ఫోనుచేసి మా కజిన్ ని అడిగితె ''ఇది ఇదివరకే చూసాను. అబ్బాయి షార్టుగా వున్నాడు అందుకే వదిలేశాం.. ''అంది.
దానితో చెంపలు వాయిన్చుకుని ఇక ఎవరికీ చెప్ప కూడదు అని నిర్ణఇంచుకున్నాను. ఇది జరిగి నాలుగేళ్లు అయి నది. ఇంతవరకూ ఇద్దరికీ పెళ్ళికాలేదు.
ఇవి రెండు సంబంధాలు ఉదాహరణ కోసం చెప్పెను. కానీ చాలా మంది అబ్బాయిలు అమ్మాయిలూ వున్నారు. ఇక్కడ అబ్బాయిలను చూసే జాలిపడాలి. అబ్బాయి మదర్, 'అమ్మాయి ఎలావున్నా పర్వాలేదు. జాబ్ వద్దు. జాతకం పట్టింపు లేదు. శాఖ - ప్రాంతం అభ్యంతరం లేదు. గుళ్లో పెళ్లి లేదా సింపుల్గా చేసినా సంతోషమే పెళ్ళికి ఒప్పుకుంటే చాలు..’ అనే స్థితిలో వున్నా అమ్మాయిలు (తల్లి తండ్రులు) వొప్పుకోడం లేదు.
అబ్బాయి ఎదో కంట్రీ లో హై పేమెంట్ ఉండాలి. ఆరు అడుగులు ఎత్తులో గుర్తుపట్టలేని దిక్కుమాలిన ఫెషన్తో గడ్డాలు మీసాలతో (బందిపోటులా) ఉండాలి.
చూస్తేనే రోతవస్తుంటే వాళ్ళుఅమ్మాయిలకు ఎలా నచ్చుతారో అర్ధంకాదు.
కొందరు యువకులు పెళ్లి గురించి ఆలోచించడం మానేశారు. మొదట సంబంధం ఎంచుకోడం ఒక సమస్య ఐతే ఇంటర్ వ్యూ లో సెలక్ట్ కావడం ఇంకా పెద్ద సమస్య. అబ్బాయిని సవాలక్ష ప్రశ్నలు వేసి నాకు ఇలావుంటేనే ఇష్టం అని ఒప్పించి. , మరో వంద కండిషన్లు పెట్టి కనీసం ఒక ఆరు నెల్లు విహారాలు చేసి చివరికి నాకు వొద్దు.. అంటున్నారు అమ్మాయిలు. ఒకప్పుడు అబ్బాయి సంబంధం పై చేయిగా ఉంటే ఇప్పుడు అమ్మాయిది పై చేయిగా వుంది.
పెళ్లి అనేది ఏ ఒక్కరి ఆధిపత్యం కాదు. ''జీవిత భాగస్వాములు'' అనేమాటలోనే ఒక అర్ధం వుంది.
ఒకరికోసం ఒకరుగా పొరబాట్లను సరిచేసుకుంటూ 'మన పిల్లల కోసం సహనంతో ఓర్పు, కట్టుబాటు, బంధం, ఆత్మీయత, అనురాగం తో జీవనయానం సాగిద్దాం..’ అనే ఆలోచన ఉండటంలేదు.
పెళ్లి, పిల్లలు, జీవితం అనుకోకుండా 3D (డాషింగ్ డిమాండ్స్ డామినేషన్ ) అనే అహంతో వివాహ బంధాలను అతి సులువుగా విచ్ఛిన్నం చేసుకోడమూ బాధాకరమే.
అమ్మాయి తల్లి తండ్రులం కావడమే గొప్ప అర్హత అనుకునే వారు తప్పులు చేస్తున్నారు. డబ్బుకి పెత్తనానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. ఎన్ని తరాలు మారినా భార్యా భర్తల బంధం అనేది పవిత్రంగా చూడాలి. చిన్న చిన్న అభిప్రాయం బేధాలు సహజం. వాటిని సహనంతో పరిష్కరించుకోవాలి. ఇద్దరికీ నచ్చ చెప్పవలసింది తల్లి తండ్రులు. వారిని రెచ్చగొట్టి దూరం చేయద్దు. అహంభావం అవమానం అనే అర్ధం తీసుకోవద్దు.
లవ్ మ్యారేజ్ చేసుకుని కూడా డబ్బుకి ప్రాధాన్యం ఇవ్వొద్దు. ఎవరు సంపాదించినా కుటుంబానికే చెందుతుంది. (భార్యా భర్తా పిల్లలు)భార్యా భర్తలు ఒకటిగా ఉంటే మూడోవారు జోక్యం చేసుకోలేరు. తొందరపాటు చిన్నతప్పు నోటిదురుసుతనం పెద్ద శిక్షగా మారనీయవద్దు. పిల్లలు ఆరోగ్యంగా ఆనందంగా పెరగడానికి తల్లి తండ్రుల అనుబంధం ముఖ్యం మరిచిపోవద్దు.
అబ్బాయిలూ భార్యను ప్రేమగా చూసుకోండి. అమ్మాయిలూ భర్తని గౌరవించండి. ఆ లోటు ఎవరూ తీర్చలేరు. దుర్మార్గుడు వ్యసనపరుడు అయితే భరించకండి. మంచివాడే ఐతే విడిచిపెట్టకండి. నాన్సెన్స్ నేను ఛస్తే వినను నాదే పై చేయి అనుకుంటే అసలు పెళ్లి చేసుకోకండి.
రెడీమేడ్ భర్తలు - పిల్లలు కొనుక్కునే చెడ్డరోజుల్లో వున్నారు. వాటి వైపు దారి మళ్లకండి. రాముడు ఏక పత్ని వ్రతుడు ఐనట్టే - సీతలు కూడా అనుసరించాలిగా! మంచి సాంప్రదాయానికి ప్రాణం పోయండి. త్వరగా పెళ్లిళ్లు చేసుకుంటే త్వరగా పుట్టిన బిడ్డలతో భార్యా భర్తల బంధం పటిష్టంగా జీవితకాలం నిలబడుతుంది.
ఏ. అన్నపూర్ణ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత్రి పరిచయం : ఏ. అన్నపూర్ణ
నాపేరు అన్నపూర్ణ. నేను ఇరవై సంవత్సరాలు ఏక ధాటిగా కథలు నవలలు వ్యాసాలు కవితలు కాకుండా జనరల్ నాలెడ్జ్ బుక్స్ చదివిన తర్వాత కథలు రాయడం మొదలు పెట్టాను. అమెరికాలో స్థిరపడ్డాక వచ్చిన అవకాశాలు నా రచనకు మరింత పదును పెట్టాయి. నా రచనలు చాలా వరకు నేను చూసిన ఎదురుకున్న సంఘటనల ఆధారంగా రాసినవే. ''మంచి సందేశాత్మక రచన చేయాలనే '' తపన.... తప్పితే ఏదో ఆశించి రాయడంలేదు. ఆ దాహం తీరనిది. దీని నుంచే మంచి రచన వస్తుందని అనుకుంటాను. ఎందరో గొప్పవారు చెప్పినట్టు నేర్చుకోడానికి ఫుల్స్టాప్ వుండకూడదు. ఆలా తెలుసుకుంటూ ఉండటమే కర్తవ్యమ్. నాకు ప్రోత్సహం ఇస్తున్న పత్రికల వారికీ ధన్య వాదాలు. నాది కాకినాడ. పండితవంశంలో పుట్టుక, సాహిత్యం ఊపిరి- వంశపారంగా అబ్బిన వరం.
నా మొదటికథ చదివి రచనలను ప్రోత్సహించినది ''వసుంధర.R రాజగోపాల్గారు.'' నామొదటి నవల చదివి నా శైలిని మెచ్చుకుని , చతురలో ప్రచురించడo గొప్ప అర్హతగా అభినందించిన '' శ్రీ యండమూరి.....'' ఇంకా ఇప్పుడూ కొనసాగిస్తూ ఉండటానికి కారకులు.
అలాగే నా వ్యాసాలకు సుస్థిర స్థానం కల్పించింది డా. జయప్రకాశ్ నారాయణ్ LOKSATTA ఫౌండర్. నా కవితలకు గుర్తింపు తెచ్చిన ప్రముఖ జర్నలిస్ట్ ఐ.వెంకట్రావ్ గారు, (నా మొదటి కవిత వారి '' పత్రిక ''లో వెలుగు చూసింది.)
విచిత్రం ఏమిటంటే వీరిలో మహిళా రచయిత్రు లెవరూ లేకపోడం.
రచయితలో వుండే ప్రత్యేకతను గుర్తించిన గుణం వీరిది. మరో విషయం ''జనార్ధన మహర్షి'' గారి కవితలు చదివి చిన్న మార్పులు చేస్తే బాగుంటుందేమో అని చెప్పినందుకు కొత్తగా ఏమాత్రమూ కోపం తెచ్చుకోకుండా ఆయన కొత్తగా రాసిన కవితల సంపుటిని నాకుపంపి '' సరిచూసి ఇస్తే నేరుగా ప్రింటికి ఇస్తాను ''అని చెప్పడం వారి విజ్ఞతకు సహస్ర వందనాలు. వీరంతా నేను ఎన్నటికీ మరువలేని మహానుభావులు.
ఇంకా కొందరు వున్నారు. సమయం వచ్చినపుడు వారిని గురించి చెబుతాను.
30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి,
ఉత్తమ అభ్యుదయ రచయిత్రి బిరుదు పొందారు.
(writing for development, progress, uplift)
Comments