#PVPadmavathiMadhuNivrithi, #పివిపద్మావతిమధునివ్రితి, #VyasarachanaPoteeloVijethaEvaru, #వ్యాసరచనపోటీలోవిజేతఎవరు, #TeluguChildrenStories

Vyasarachana Poteelo Vijetha Evaru - New Telugu Story Written By - P V Padmavathi Madhu Nivrithi Published In manatelugukathalu.com On 16/01/2025
వ్యాసరచన పోటీలో విజేత ఎవరు - తెలుగు కథ
రచన: పి. వి. పద్మావతి మధు నివ్రితి
1). ఆ మంచి పాఠశాలలో, ఆ రోజు వ్యాస రచన పోటీ.
అంశం: "మీకు నచ్చిన 'అందమైన మనస్సు' గల.. 'మంచితనం తో నిండిన'.. మంచి మనిషి ఎవరు? (మీ స్నేహితుడు లేక అభిమాన నాయకుడు, ఎవరైనా సరే).. ఎందుచేత?"
సమయం: గంట వ్యవధిలో.
ఏదో ముఖ్య పని ఉండి, గిరి టీచర్ గారు, మాధవ్ అనే "ఆరవ తరగతి విద్యార్థి - బాబు" ని పర్యవేక్షకుడు.. పరిశీలకుడు.. న్యాయ నిర్ణేతగా వ్యవహరించ మని చెప్పి, హుటా హుటిన పాఠశాల బయిటికి వెళ్ళిపోయారు.
--- X X X ----
2). అందరు విద్యార్థులు - విద్యార్థినిలు ఏదేదో వ్రాస్తున్నారు హుషారుగా. మహాత్మా గాంధీ గురించి, చాచా నెహ్రు.. లాల్ బహదూర్ శాస్త్రి.. సుభాష్ చంద్ర బోస్.. భగత్ సింగ్ త్యాగాల గురించి వగైరా.
వ్రాసేటప్పుడు, కొందరి కళ్ళలో నీరు కూడా కురుస్తుంది. ప్రవహిస్తుంది అనటం సబబు. ఆ వీరుల - వీర నారీమణుల ఆత్మ సమర్పణలు, ప్రాణ త్యాగాలు, కుటుంబ త్యాగాలు.. వీరి హృదయ- తీగలను మీటి.. మంచితనాన్ని మేలుకొలిపిందేమో?
అందరిలో ఏదో తెలియని ఉల్లాసం, ఉత్సాహం, ఉత్తేజం. ఆ హల్ లో.. ఏదో దేశభక్తి - మంచితనం యొక్క తరంగాలు పొంగి పొర్లుతున్నాయి.. అనవచ్చు.
ఎందుకు?
అంతటి స్ఫూర్తి దాయకం ఆ అంశం. నిస్వార్థంగా.. మనందిరికి మంచి
జీవితం.. స్వేచ్ఛా వాయువులు.. మంచి సంతోష పూరిత నిర్వహణ ఇచ్చిన ఆ భారతీయ మహనీయుల పై, నాయకుల పై.. వారి త్యాగాల పై, కసరత్తులు పై.. వ్రాయటమంటే.. సాక్షాత్తు ఆ బ్రిటిష్ వారికి కూడా మంచి ఊపు వచ్చేస్తుందేమో?
--- X X X -----
3). "ఇంకా 10 నిముషాల సమయం మాత్రమే మిగిలి ఉన్నది. తొందరగా వ్రాయండి.. ముగింపు పలికే వాక్యాలు మొదలు పెట్టండి", అంటూ మాధవ్ ప్రకటించాడు.
అంతలో, అతడి సహ విద్యార్థిని (తన ఆరవ తరగతిలో).. 'అందాల చిన్నారి వింధ్య'.. హుటా హుటిన వచ్చింది.
బ్యాగ్ లోని పేపర్ - పెన్సిల్ తీసి ఏది టక టక వ్రాసింది.. గీచింది.
సమయం అయిపోయింది.
అందరి వద్ద పేపర్లు తీసేసుకున్నాడు మాధవ్.
"భోజనాలు చేసుకోండి ఇక్కడే కూర్చుని.. అరగంట - గంట లో.. నేను పేపర్లు దిద్ది.. విజేత పేరు ప్రకటిస్తాను.. అలాగే రెండవ మరియు మూడవ ప్రైజెలు (అదే విజేతల పేర్లు) కూడా ప్రకటిస్తాను.. ఇక్కడే, ఈ కుర్చీలోనే కూర్చుని", అని ప్రకటించాడు మాధవ్.
---- X X X -----
4). అందరి భోజనాలు అయ్యాయి.
అర్థగంట సమయం దాటింది.
"ఇంకా రెండు పేపర్లు మిగిలి ఉన్నాయి దిద్ద-టానికి.. అంతే.. సహనం వహించండి", అంటూ చిరునవ్వుతో అన్నాడు మాధవ్.
గోడ గడియారం టిక్కు టిక్కు అనే శబ్దం అందరికీ చెవుల్లో గింగురు-మంటున్నది అక్కడ. అంతటి నిశ్శబ్ధం తాండవిస్తుంది ఆ గది లో. అంటే?.. అందరిలో అంత ఉత్సుకత.. ఆసక్తి.. ఎవరు తొలి విజేత? 2 వ, 3వ పురస్కారాలు ఎవరికి?.. అంత ఉత్కంఠ భరితంగా ఉంది అక్కడి వాతావరణం.
---- X X X -----
5). 'మంచి మాదవ్' పేపర్లు దిద్దడం పూర్తి అయ్యింది. వారి వారి పేర్ల పక్కన మార్కులు వేసి పట్టిక తయారు చేశాడు ఇంకో పేపర్లో.
మాధవ్ లేచి నిల్చున్నాడు పట్టిక తో.
ఇలా ప్రకటించాడు, "మొదటి విజేత.. ఈ వ్యాస రచన పోటీలో.. 'అందాల వింధ్య'.. నా సహ విద్యార్థిని ఆరవ తరగతి లో.. రెండవ విజేత.. "
"ఆపండి అక్కడే.. చాలించండి ఈ గారడీ" అంటూ అరిచారు, అక్కడ కూర్చున్న వారంతా.. అభ్యర్థులు అంతా.
"అంత ఆలస్యం గా వచ్చింది 'అందాల వింధ్య'. కేవలం 10 నిమిషాలలో ఏమి అంత వ్రాసేసింది? ఆమెకే ఇవ్వాలి బహుమతి అంటే మమ్మల్నందరిని ఎందుకు పిలిచారు ఈ పోటీకి?.. ఆమెకే ఇచ్చేసి ఉండవచ్చు కదా సరాసరి. ఈ వ్యాస పోటీ డ్రామాలు ఎందుకు? మమ్మల్ని వెదవలు చేయటానికా?", అంటూ కట్టెలు తెంచుకున్న కోపం తో అరిచారు అక్కడున్న వారందరూ.
"అస్సలు అంత ఆలస్యంగా వచ్చిన అందాల వింధ్యని ఎలా వ్రాయ నిచ్చావు వ్యాసం", అంటూ ప్రశ్నించారు కొందరు.. ఎద్దేవా వేసినట్టుగా.
గట్టిగా నవ్వాడు మాధవ్.
మళ్లీ గది అంతా నిశ్శబ్దంగా మారిపోయింది. అతడి 'కంచు కంఠం' నవ్వు - శబ్ద ధ్వనికి ఆశ్చర్య పోయారు అందరూ.
---- X X X -----
6). మాధవ్ తన స్మార్ట్ ఫోన్ లో వీడియో చూపించాడు.
ఏముంది ఆ వీడియోలో?
అక్కడ 'అందాల వింధ్య' స్కూల్ గేట్ - ద్వారం వద్ద కూర్చున్న పేద వారికి డబ్బులు ఇస్తూ కనిపించింది. తన టిఫిన్ డబ్బా లో ఉన్న తిండి వారికి దానం చేసింది. వారితో మాట్లాడింది. కుశల ప్రశ్నలు వేసింది. వారి బాగోగులు కనుక్కుంది. ఆ పాఠశాలలో కానీ లేక వేరే చోట గానీ.. వారు చేయగలిగిన పని వారికి ఇప్పిస్తానని, ఒక్క వారంలో.. ఆ స్కూల్ పెద్దలలో, యాజమాన్యంతో మాట్లాడి అని వాగ్దానం చేసింది. హామీ ఇచ్చింది. తరువాత స్కూల్ ద్వారం గుండా లోపలికి అడుగు పెట్టింది.
మాధవ్ తన స్మార్ట్ ఫోన్ ఆఫ్ చేసాడు.
మాధవ్ ఇలా అన్నాడు చెమ్మగిల్లిన తన కళ్ళు తుడుచుకుంటూ..
"చూసారా 'చిన్నారి అందాల వింధ్య' యొక్క అందమైన మనస్సు.. మేమే ఏర్పాటు చేశాం ఆ పేద ప్రజలను ఆ స్కూల్ ద్వారం దగ్గర. మీరంతా వారిని గమనించలేదు కూడా. మారు మాట్లాడ లేదు వారితో. వారి బాగోగులు అడిగి తెలుసుకోవడం వల్లే ఆమె వ్యాస పోటీకి ఆలస్యంగా వచ్చింది. ఆలస్యం గురించి, వ్యాస పోటీ బహుమతి గురించి ఆమె ఆలోచించలేదు. ఆ అమృత వర్షిణి ఆ పేద వారి బాగోగుల గురించి ఆలోచించింది. అంటే.. నిస్వార్థమైన తేనె మనస్సు అందాల వింధ్య ది. లేత మనస్సు మరియు పవిత్ర హృదయం ఆ దేవతా శిరోమణి ది ".
అందరి కళ్ళలో ఆశ్రు బిందువులు నిండుకున్నాయి. వారి స్వార్థపూరిత మనసుని.. వారు పశ్చాత్తాపంతో కూడిన ఆ అశ్రు బిందువులతో కడిగేసుకున్నారు. ఆ క్షణంలోనే.. అప్పటికప్పుడే.. అక్కడే.. "అందరూ మంచి-వారే" గా మారిపోయారు.
------- X X X -------
7). 'అందాల వింధ్య' ఏమి వ్రాసింది.. కేవలం ఆ పది నిమిషాలలో.. ఇదిగో చూడండి", అంటూ ఆమె పేపర్ చూపించాడు మాధవ్.
బాపు / మహాత్మ గాంధీ చిత్రం.. అతడు తన పై వస్త్రం ఒక పేద మహిళలకు దానం చేయటం.. ఆమె మానం కాపాడటానికి. ఆ దీనురాలిని చలి నుండి కాపాడటానికి.
ఆ చిత్రం కింద: మన జాతి పిత.. అందమైన మనస్సు గల మహాత్మ గాంధీ అని వ్రాసి ఉంది (అందాల వింధ్య అందమైన చేతి వ్రాత తో).
అందరూ ఇలా అన్నారు, " మూడు బహుమతులు 'అందాల వింధ్య' కే ఇచ్చేయండి.. ఆమె నిస్వార్ధపు - కరుణ పూరిత - అందమైన మనస్సుకు నివాళిగా", అంటూ చప్పట్లు కొట్టారు.
"మంచి మాధవ్ - అందాల వింధ్య లు తేనె మనస్సుల - లేత మనస్సుల - పవిత్ర హృదయాల - జోడీ" అని కొనియాడారు ఆ ఇద్దరినీ.
ఆప్పుడే వచ్చిన గిరి సార్ (హిందీ టీచర్) విషయం తెలుసుకొని 'మంచి మాధవ్ - అందాల వింధ్య' జంటను మనస్పూర్తిగా దీవించారు.
-------X X X -------
నీతి:
i)
మానవ సేవే మాధవ సేవ
ii)
ఒక్కరే పెద్ద గా సహాయాలు చేయ లేరు. అందుకే మంచి వ్యవస్థీకరణ (system of happy development management and JOYFUL success SOLUTIONS in the entire world) రావాలి అన్ని చోట్లలో.. తద్వారా చక - చక మంచి పనులు జరిగి పోవాలి, ఎవరికి కావలసింది వారికి.. అదీ వంద శాతం (100%) సంతోష పూరిత నిర్వహణ తో.
iii)
భారత జనాభా 143 కోట్లు. ప్రతి మనిషి రోజుకు కనీసం ₹1 దానం చేస్తే.. ముఖ్య మంత్రి - ప్రధాన మంత్రి ప్రభుత్వ నిధికి (CM - PM treasury - poor fund).. ఖజానా కి రోజూ ₹143 కోట్లు హెచ్చుతుంది. దానితో తేలికగా పేదరికం నిర్మూలించవచ్చు. పేదలకు మంచి వేతనం - ఉపాధి - తిండి - గుడ్డ - ఇల్లు - విద్య - సౌకర్యాలు కల్పించ-వచ్చు.
iv) అందమైన మనస్సు అంటే ??? మనకు మాత్రమే కాదు.. ఇతరులకు - అందరికి కూడా.. మంచి ఆరోగ్యం, సౌభాగ్యం, ప్రగతి, అభ్యుదయం, మంచి - మాటలు - చేతలు - ఆచరణ - కనీస విద్య, వేతనం - ఎల్లప్పుడు సంతోష పూరిత నిర్వహణ.. అదే అందరికీ మంచిని పంచటం (- పెంచటం).. అదే పేదరికం నిర్మూలించడం (ప్రపంచమంతటా).. కోరాలి.
v) కనీసం చిన్న చిన్న సహాయాలు (వీలయినంత) అయినా చేయాలి మనుషులు అన్నాక.
vi) మంచి చేయకున్నా పర్వాలేదు, చెడు మటుకు చేయ రాదు, కష్టం - నష్టం కలిగించ రాదు (మనుషులు అన్నాక).. కీడు, హాని కలలో కూడా తల-పెట్ట-రాదు ఎవరికి.. మోసాలు చేయరాదు. ఏ ఒక్కరినీ - ఏ ఒక్క కుటుంబాన్ని కూడా బలి - పశువు చేయ రాదు మన లాభాల కోసం.
vii) మనిషి జీవితం అశాశ్వతం. ఎప్పుడు పోతాయో మనకే తెలీదు. దేవుడు మనుషులకు విచక్షణా జ్ఞానం ఇచ్చాడు. మంచి - చెడు తెలుసుకునే మెదడు ఇచ్చాడు. అందుకే ఎల్లప్పుడూ మనుషులు (100% - వంద శాతం) నిర్మాణాత్మక త, సంతోష పూరిత నిర్వహణ మరియు ఆనంద పూరిత పరిష్కారాల తీరు అవలంభించాలి - ఆచరించాలి.
-------- కథ సమాప్తం ----------
పి. వి. పద్మావతి మధు నివ్రితి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:
నేను స్నేహపూరిత ఎడ్యుకేటర్ [Friendly Educator cum (1 to 1 cum TEAM'S) HAPPY Developer] ను. బౌధ్ధ నగర్, సికింద్రాబాద్ లో ఉంటాను. స్పీడ్ వేదిక్ మాథ్స్ (Speed vedic Maths), గణితం (regular Maths), ఇతర విషయాలు బోధిస్తాను.
మా బృందం (team), వివిధ విషయాల పై, ప్రపంచానికంతా సబ్జెక్టివ్ క్విజ్ (పాఠాలు) (Subjective) క్విజ్ అందిస్తుంది ఉచితంగా [*P V Madhu - World - Theoretical (Subjective) Quiz Teachers TEAM ద్వారా]. (వేల సంఖ్య లో పాఠాలు - అధ్యాయాలు అందించాము ఇప్పటిదాకా).
మా విద్యార్థులు ఆబ్జెక్టివ్ (Objective) క్విజ్ అందిస్తారు ఉచితంగా ప్రపంచానికంతటా [*Miss Nivriti Sreelekha World (Objectives) Quiz Teachers TEAM ద్వారా]. (ఇప్పటికీ వందల సంఖ్యలో అందించారు)
నేను, మా విద్యార్థులు, మా తల్లి - దండ్రులు, కుటుంబ సభ్యులు... అనేక అంశాల పై (సమాజ సమస్యలకు పరిష్కారాలు, ప్రోత్సాహకరపు సంతోష కరపు నిర్వాహకము, తేలికగా విద్య - బోధన పద్ధతులు... ఇతరత్రా విషయాలపై)... ఆంగ్ల - తెలుగు దిన - మాస పత్రికలకు... తరచూ లేఖలు వ్రాస్తాము. వందల సంఖ్య లో మా లేఖలు ప్రచురణ అయ్యాయి.
మా విద్యార్థుల బృందం (*Miss Nivriti Sreelekha World (Objectives) Quiz Teachers' TEAM)... ఇప్పటివరకు Bill Gates Notes Blog కు 550 పై చిలుకు లేఖలు వ్రాసింది. (సమాజాన్ని ఉద్ధరించే అంశాలపై, పరిష్కారాల సూచనలు, ప్రోత్సాహపు - నిర్వహణ పై).
మా (+ మా విద్యార్థుల) బృందం యొక్క క్విజ్ లు ప్రతి వారం డెక్కన్ క్రానికల్ ఆదివారం సంచిక (Deccan Chronicle daily newspaper Sunday edition) లో ప్రచురణ అవుతాయి (వందల సంఖ్యలో ఇప్పటిదాకా అయ్యాయి). మా - మా విద్యార్థుల బృందాన్ని ప్రోత్సహిస్తున్న అన్ని పత్రికలకు ధన్యవాదాలు.
మా - మా విద్యార్థుల బృందానికి నోబెల్ లారేట్ ల మరియు ప్రపంచ నాయకుల వద్ద నుండి (ప్రశంస - ప్రోత్సాహపు) లేఖలు వచ్చాయి. అవి మా అందరికీ ఎన లేని ఉత్తేజం - ఉల్లాసం - శక్తి ఇచ్చాయి.
మాకు విద్య పై, తెలుగు మరియు గణితం పుస్తకాలు, పత్రికలు చదవడం పై (చిన్నపటి నుండి) మక్కువ - ఇష్టం కలిగించింది మా అమ్మ గారు (పి. వి. పద్మావతి). ఆవిడ ఒక గణిత విశ్రాంతి టీచర్. మా మనసుల్లో - గుండెల్లో ఎప్పటికీ ఉంటారు. మాకు చిన్నపటి నుండి ఇంట్లో అన్ని విషయాలలో పాఠాల - సందేహాల సృష్టీకరణ చేసేవారు. చిట్కాలు చెప్పేవారు. ఒక పెద్ద భరోసా గా ఉండేవారు.
ఆవిడ ప్రోత్సాహం వల్లనే మేము చిన్న తెలుగు కథలు వ్రాసాము. వ్రాస్తున్నాము... ఇప్పటికీ. కొన్ని బాలభారతం, బొమ్మరిల్లు, చంద్ర ప్రభ, సాహితీ కిరణం, ఇతరత్ర పత్రికల్లో ప్రచురణ అయ్యాయి.
మా నాన్న గారు ఒక విశ్రాంత ఉద్యోగి. మాకు ఆంగ్లం మరియు సాంఘీక శాస్త్రం పై మక్కువ వచ్చేలా ప్రోత్సహించారు. వారి (మరియు కుటుంబ సభ్యుల) ప్రోత్సాహం - చలువ వల్లనే నేను ఇంజనీరింగ్, పి. జి చేయగలిగాను.
ధన్యవాదాలు "మా తెలుగు కథలు" టీమ్ - బృందానికి. వారి ప్రోత్సాహం - సంతోష పూరిత నిర్వహణ - awards - rewards స్ఫూర్తి దాయక నిర్వాహకానికి. ఇది No. 1 website అవ్వాలి ప్రపంచంలో అని ఆశిస్తూ...
పి. వి. పద్మావతి మధు నివ్రితి
(సికింద్రాబాద్, తెలంగాణ, భారత్)
ఈ: pvmadhu39@gmail. com
(మా theoretical subjective క్విజ్, మా విద్యార్థుల Objective క్విజ్ కావలసిన వారు మాకు మా ఈమెయిల్ ద్వారా తెలియ జేయ వచ్చు. ఉచితంగా ఈమెయిల్ ద్వారా పంపిస్తాము).
.
ఈకథ పాఠశాలలో జరిగిన వ్యాసరచన పోటీ నేపథ్యంలో, మానవీయత, సహృదయం, సేవా భావం వంటి అంశాలను హృద్యంగా ఆవిష్కరించింది. పి.వి. పద్మావతి మధు నివ్రితి గారి రచన పిల్లలకు మాత్రమే కాకుండా, పెద్దలకు కూడా మంచి సందేశం అందిస్తుంది.
అంతేకాక, మానవ సేవ గొప్పతనాన్ని వివరించే ఈ కథ పిల్లలకు స్ఫూర్తి నిచ్చి, మంచి పనులపట్ల ఆకర్షణ కలిగించగలదు. "మానవ సేవే మాధవ సేవ" అనే నీతి ఈ కథలో చక్కగా ప్రతిఫలించింది.