'Walking Shoes' - New Telugu Article Written By A. Annapurna
Published In manatelugukathalu.com On 02/05/2024
'వాకింగ్ షూస్!' తెలుగు వ్యాసం
రచన: ఏ. అన్నపూర్ణ
(ఉత్తమ అభ్యుదయ రచయిత్రి)
''వాకింగ్ చేసేవారికి దుస్తులు ఎంత ముఖ్యమో పాదాలకు వేసుకునే షూస్ అంత ముఖ్యం!
రోజూ కనీసం ఒకగంట (ఇంటినుంచి బయలుదేరి తిరిగి ఇంటికి చేరుకునే సమయం కలుపుకున్నా)పాటు మన శరీరాన్ని కాలి షూస్ మోస్తాయి. ఇంతకంటే ఎక్కువ నడిచేవారు విషయంలోనూ వారి బరువునుబట్టి ఆభారం షూ మీద పడుతుందికదా. వీటి విషయంలో తప్పక శ్రద్ధ తీసుకోవాలి. వీటిని ఆరు నెలలకు ఒకసారి తప్పకుండా మార్చుకోవాలి. సైజు విషయం కూడా పరిగణలోకి తీసుకోవాలి. సాక్స్ వేసుకుంటాం కనుక అసలు సైజుకి అర ఇంచి, షూలో ప్యాడ్స్ వేసుకునేవారు ఒక ఇంచి పెద్దగా వుండే షూ వేసుకోవాలి.
ఈ విషయం పాదాలు పరీక్ష చేసే డాక్టర్ (పోడియాట్రిక్ ) చెప్పేరు నాకు మొదటిసారి అమెరికా వెళ్ళినపుడు 1994 లో. పాదాలలో రకరకాల ఇబ్బందులు వుంటాయని ఎవరికైనా తెలుసా? చాలా కొద్దిమందికే తెలుస్తుంది. పాదం పూర్తిగా నేలమీద ఉంటే ఫ్లాట్ ఫుట్. వేళ్ళకు మడమకు మధ్య ఆర్చి ఉండిఖాళీ ఉంటే అది సరి ఐన ఆకృతి. జన్యు లోపాలు తల్లి తండ్రుల వంశ పారంపర్య ఆకృతులు సంక్రమిస్తాయి.
వాటిని కొద్దిగా సరిచేసుకునే సులువైన మార్గ మీ షూస్ ఎంపిక, . ఫ్లాట్ ఫుట్ వున్నా వారు షూలో తప్పనిసరిగా పాడ్ వేసుకోవాలి. అప్పుడు నడక చురుకుగా ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఈ పాడ్స్ ఆన్లైన్లో దొరుకుతున్నాయి. మంచి ఖరీదైన షూ వేసుకుని దానికి తగిన సాక్స్ ప్యాడ్స్ వేసుకుంటే ఎన్ని మైళ్ళు అయినా నడవగలం. (అది అలవాటు వయసును బట్టి కూడా ఉంటుంది )కొంత సరైన షూస్ ఎంపిక కూడా ఆధారపడుతుంది.
వయసుతోబాటు చిన్నతనంలో వచ్చే ఆర్త రైటిస్ వలన కూడా ఎముకలు అరుగుతాయి. దీనికి ఒక ఉదాహరణ మన కాలి జోళ్ళు చెబుతాయి. వాటి అడుగుభాగం పరిశీలిస్తే అర్ధం అవుతుంది. మడమ దగ్గిర కొందరికి కాలి వేళ్ళ అడుగుభాగం కొందరికి ఒకసైడులో కొందరికి ఈ అరుగుదల కనిపిస్తుంది. దానితో నడక తేడా ఉంటుంది. మీరు నడిచేటప్పుడు ఎదుటివారిని గమనించండి. అందరి నడకా ఒకేలా ఉండదు. తేడాలు కనిపిస్తాయి.
ఓకే షూ వాడటం కంటే రెండు ఉంచుకుని మార్చి మార్చి వాడాలి. శుకంపెనీ వారు స్పోర్ట్స్ అధఃలెట్స్ వాకర్స్ జాగింగ్ చేసేవారికి తగిన విధంగా తయారు చేస్తారు. కాలి జోళ్ళు మెత్తగా మృదువుగా డయాబెటిక్ వారికి సదుపాయాంగా ఉండేలా ఉంటున్నాయి. అదృష్టవశాత్తు మనకు అన్ని సదుపాయాలూ వున్నాయి.
కొందరు నాసిరకం చెప్పులు ఇంట్లో వాడే చెప్పులు అసలు చెప్పులే లేకుండానూ నడుస్తారు. అది మంచి పద్ధతికాదు. పాదాలకు గాయాలు అవుతాయి కాలు స్లిప్ అవుతుంది. అప్పుడు మనకు వుండే రోగాలు బయటపడి ఇబ్బందులు కలుగుతాయి. ఆలోచన అవగాహన అప్రమత్తత అవసరం. సాక్స్ కూడా వేసవిలో కాటన్ షార్ట్ గా ఉండేవి తర్వాత సీజన్లో ఊలు లాంగ్ సాక్స్ వాడాలి. అన్నిటికి ఒకటే వాడరాదు. వారంకంటే ఎక్కువ రోజులు వాడకుండా ఉతికినవి వేసుకోవాలి.
వీటికి శుభ్రత చాలా అవసరం. చెమట, నేలమీద వుండే సూక్ష్మ జీవులు చేరి ఇన్ఫెక్షన్ వస్తుంది. షూస్ కూడా నెలకోసారి వాషింగ్ మెషిన్ వేయాలి. మగవారి ఆఫీసుకెళ్లే బూట్లు ఆడవారు వేసుకోకూడదు. సాక్స్ తప్పనిసరి. పాదాలు నొప్పులు వాపులు వస్తాయి. ఆ మెటీరియల్ వేరుగా ఉంటుంది. స్త్రీ -పురుషుల పాదాలు వేరు వేరుగా ఉంటాయి. అనుభవంతో అమెరికా డాక్టర్ చెప్పిన విషయాలు ఇవి.
అప్పట్లో పాదాలగురించిన సబ్జక్ట్ ఉందనే తెలియదు. ఇప్పుడు మనకు ఆ బ్రాన్డ్ అన్ని వస్తువులు దొరుకుతున్నాయి. అక్కడ ప్రతి ఇంట్లో గోడపొడవునా షూ రాక్స్ ఉంటాయి కుటుంబం మొత్తం వాడే రకరకాల జోళ్ళు షూలతో. మొదట్లో అన్ని ఎందుకు అనుకునేదాన్ని. తర్వాత అర్ధం అయింది, అక్కడ చలి ఎక్కువ, స్నో ఎక్కువ, వర్షాలూ ఎక్కువే.
కనుక అన్ని సీజన్లకు తగినట్టు ఉండాలికదా. మనకు మూడు సీజన్లే. కనుక ఉన్నంతలో జాగ్రత్త పడదాం. సంతోషంగా సౌకర్యంగా నడకను ఆస్వాదిద్దాం.
హావ్ ఏ గ్రేట్ వీకెండ్ !
**************************************************************************
ఏ. అన్నపూర్ణ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
రచయిత్రి పరిచయం : ఏ. అన్నపూర్ణ
నాపేరు అన్నపూర్ణ. నేను ఇరవై సంవత్సరాలు ఏక ధాటిగా కథలు నవలలు వ్యాసాలు కవితలు కాకుండా జనరల్ నాలెడ్జ్ బుక్స్ చదివిన తర్వాత కథలు రాయడం మొదలు పెట్టాను. అమెరికాలో స్థిరపడ్డాక వచ్చిన అవకాశాలు నా రచనకు మరింత పదును పెట్టాయి. నా రచనలు చాలా వరకు నేను చూసిన ఎదురుకున్న సంఘటనల ఆధారంగా రాసినవే. ''మంచి సందేశాత్మక రచన చేయాలనే '' తపన.... తప్పితే ఏదో ఆశించి రాయడంలేదు. ఆ దాహం తీరనిది. దీని నుంచే మంచి రచన వస్తుందని అనుకుంటాను. ఎందరో గొప్పవారు చెప్పినట్టు నేర్చుకోడానికి ఫుల్స్టాప్ వుండకూడదు. ఆలా తెలుసుకుంటూ ఉండటమే కర్తవ్యమ్. నాకు ప్రోత్సహం ఇస్తున్న పత్రికల వారికీ ధన్య వాదాలు. నాది కాకినాడ. పండితవంశంలో పుట్టుక, సాహిత్యం ఊపిరి- వంశపారంగా అబ్బిన వరం.
నా మొదటికథ చదివి రచనలను ప్రోత్సహించినది ''వసుంధర.R రాజగోపాల్గారు.'' నామొదటి నవల చదివి నా శైలిని మెచ్చుకుని , చతురలో ప్రచురించడo గొప్ప అర్హతగా అభినందించిన '' శ్రీ యండమూరి.....'' ఇంకా ఇప్పుడూ కొనసాగిస్తూ ఉండటానికి కారకులు.
అలాగే నా వ్యాసాలకు సుస్థిర స్థానం కల్పించింది డా. జయప్రకాశ్ నారాయణ్ LOKSATTA ఫౌండర్. నా కవితలకు గుర్తింపు తెచ్చిన ప్రముఖ జర్నలిస్ట్ ఐ.వెంకట్రావ్ గారు, (నా మొదటి కవిత వారి '' పత్రిక ''లో వెలుగు చూసింది.)
విచిత్రం ఏమిటంటే వీరిలో మహిళా రచయిత్రు లెవరూ లేకపోడం.
రచయితలో వుండే ప్రత్యేకతను గుర్తించిన గుణం వీరిది. మరో విషయం ''జనార్ధన మహర్షి'' గారి కవితలు చదివి చిన్న మార్పులు చేస్తే బాగుంటుందేమో అని చెప్పినందుకు కొత్తగా ఏమాత్రమూ కోపం తెచ్చుకోకుండా ఆయన కొత్తగా రాసిన కవితల సంపుటిని నాకుపంపి '' సరిచూసి ఇస్తే నేరుగా ప్రింటికి ఇస్తాను ''అని చెప్పడం వారి విజ్ఞతకు సహస్ర వందనాలు. వీరంతా నేను ఎన్నటికీ మరువలేని మహానుభావులు.
ఇంకా కొందరు వున్నారు. సమయం వచ్చినపుడు వారిని గురించి చెబుతాను.
30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి,
ఉత్తమ అభ్యుదయ రచయిత్రి బిరుదు పొందారు.
(writing for development, progress, uplift)
Comments