'World Famous Writer - Part 2/2' - New Telugu Story Written By Mohana Krishna Tata
Published In manatelugukathalu.com On 05/05/2024
'వరల్డ్ ఫేమస్ రైటర్ - పార్ట్ 2/2' తెలుగు పెద్ద కథ
రచన: తాత మోహనకృష్ణ
కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
ఒక పేరున్న పత్రికకు మొదటి కథను పంపించాడు ఆనందరావు. ఆ మొదటి కథ ఆమోదం పొంది ఆ పత్రికలో అచ్చు వేసారు. అప్పటినుంచి ఇక అడపా తడపా రచనలు చేస్తూనే ఉన్నాడు ఆనందరావు. అన్నీ ప్రచురణ అయ్యాయి. రచనలు చేయడం లో ఆనందరావు కు సలహాలు, సూచనలు ఇచ్చేది భార్య సావిత్రి. వారి పెళ్ళిచూపులలో కుడా కవి చమత్కారం చూపించాడు ఆనందరావు. సన్మానం కోసం ఎదురుచూస్తున్నాడు ఆనందరావు.
ఇక వరల్డ్ ఫేమస్ రైటర్ పెద్దకథ చివరి భాగం చదవండి..
అనుకున్న కొన్ని రోజులకే.. 'మీ' పత్రికల వారు ఆనందరావు కు సన్మానం ప్రకటించారు. పెద్ద ఫంక్షన్ హాల్ లో ప్రముఖుల ముందు ఆ సన్మానం జరిగింది. సావిత్రి ఆనందానికి అవధులు లేవు. దామిని కుడా అక్కడకు వచ్చింది. అక్కడ సన్మానం లో ఆనందరావుని చూసిన దామిని చాలా ఆనందపడింది.
"ఆనందరావు గారు.. ! మీ రచనలు చదివిన స్పూర్తి తో నేను కుడా చిన్న చిన్న రచనలు చేయడం మొదలు పెట్టాను.. "అంది దామిని
"చాలా సంతోషం దామిని.. "
"మీరు నాకు ఒక మాట ఇవ్వాలి.. ఇక పైన మీరు నాకు గురువుగా ఉండి.. మీ సలహాలు, సూచనలు నాకు అందించాలి.. కాదనకండి.. మీరైనా చెప్పండి సావిత్రిగారు.. !"
"ఏమండీ.. ! ఒప్పుకోండి.. ఇది మీకు చాలా మంచిది కుడా.. "
"నువ్వు చెబుతున్నావు కాబట్టి.. ఓకే చేస్తున్నాను.. "
"చాలా థాంక్స్ గురుజీ.. " అంది దామిని
కొన్ని రోజుల తర్వాత.. ఒక టీవీ ఛానల్ వారు ఆనందరావు ని ఇంటర్వ్యూ కి పిలిచారు..
ఇప్పుడు మనం ప్రముఖ రైటర్ ఆనందరావు గారిని ఇంటర్వ్యూ చేద్దాం..
"నమస్తే.. ! ఆనందరావు గారు.. ! ఈ రోజు మీరు ఒక ఫేమస్ రైటర్. మీకు ఈ మధ్య ఒక పత్రిక వారు సన్మానం కూడా చేశారు. ఎలా ఫీలవుతున్నారు?"
"చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను" అన్నాడు ఆనందరావు
"రచనలు చెయ్యడానికి మీకు స్పూర్తి ఎవరు.. ?"
"చిన్నప్పటినుంచి కథలు, కవితలు అంటే చాలా ఇష్టం. ఎన్నో పుస్తకాలు చదివాను. వాటినుంచి ప్రేరణ పొంది, నేను కుడా రాయడం మొదలుపెట్టాను. పెళ్ళైన తర్వాత, ఇప్పుడు నా భార్య నాకు చాలా సపోర్ట్ ఇస్తోంది.. "
"అయితే, మీరు రచనలు ఏ టైం లో ఎక్కువగా చేస్తారు.. ?"
"కథ స్పురించిన వెంటనే రాయడం మొదలు పెడతాను. అది పగలైన, రాత్రైనా, అర్ధరాత్రైనా సరే.. "
"మీరు నిజంగా చాలా గ్రేట్.. ! మరి ఒక కథ గాని, నవల గాని రాయడానికి మీకు ఎంత టైం పడుతుంది.. ?"
"గంటలో రాసిన కథలు ఎన్నో.. ఎక్కువ టైం తీసుకుని రాసిన కథలు కుడా చాలానే ఉన్నాయి. నవలలు అయితే, జాగ్రతగా కొంచం టైం తీసుకుని రాస్తాను.. "
"మా ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చినందుకు చాలా థాంక్స్. మీరు ఇంకా ఏమైనా చెప్పాలని అనుకుంటున్నారా ఆనందరావు గారు.. !?"
"నేను ఇంకా జీవితంలో సాధించాల్సినవి చాలా ఉన్నాయి.. అప్పుడు మళ్ళీ కలుద్దాం.. "
"అల్ ది బెస్ట్ ఆనందరావు గారు.. " మా ఛానల్ తరపున, ప్రేక్షకుల తరపున.. ఆనందరావు గారికి శుభాకాంక్షలు..
"హలో ఆనందరావు గారు.. ! మీ ఇంటర్వ్యూ చూసాను.. కంగ్రాట్స్ అండి.. మీరు మా ప్రత్రికలో ఒక మంచి వెబ్ సిరీస్ రాయాలి.. కాదనకండీ.. !"
"నేను రాయదలచుకోలేదు.. కృష్ణగారు.. "
"అదేమిటి అలాగనేసారు.. ?"
"గతం లో మీ పత్రికకు రాసిన కథలు, వెబ్ సిరీస్ కి మీరు చేసిన ప్రచారం జనాల్లోకి అంతగా వెళ్ళలేదు. ఎంత సేపూ ఆడవారు రాసిన వాటికే తెగ పబ్లిసిటీ ఇస్తారు. వారికే సన్మానం కుడా చేస్తున్నారు.. మమల్ని అసలు పట్టించుకోలేదు.. "
"ఆడవారు రాసిన వాటికీ పబ్లిసిటీ ఎక్కువ చేస్తే, లేడీస్ సెంటిమెంట్ తో పత్రిక బాగా ఎదుగుతుందని.. అంతే.. ! మిమల్ని అవమానించాలని కాదు.. "
"నెక్స్ట్ సన్మానం మీదే.. ! ఎక్కువగా, తొందరగా, పర్ఫెక్ట్ గా వెబ్ సిరీస్ రాసేది మీరు ఒక్కరే ఉన్నారు. ఇప్పుడు మీకు చాలా పేరు కుడా వచ్చింది. కావాలంటే మీ కోసం బోలెడంత పబ్లిసిటీ చేస్తాను.. "
"నాకు ఇప్పుడు సన్మానం అవసరం లేదు. ఇప్పుడు పాన్ ఇండియా మూవీస్ నడుస్తున్న రోజులు. నాకేమో ఈ ఒక్క సిటీ లోనే పేరు వచ్చింది.. "
"అయితే, ఏమిటి చెయ్యాలో చెప్పండి.. మీరు మాత్రం మా పత్రికకు మంచి వెబ్ సిరీస్ రాయాలి.. " అని అడిగారు కృష్ణగారు
"అలాగే రాస్తాను. కానీ.. దానిని పాన్ ఇండియా లెవెల్ లో పబ్లిష్ చెయ్యాలి. అంటే, అన్ని భాషలలోకి అనువాదం చేసి అన్నీ చోట్ల రిలీజ్ చెయ్యాలి.. " అన్నాడు ఆనందరావు
"అలా చెయ్యాలంటే.. అనువదించడం లో బాషా ప్రావీణ్యం ఉన్నవారు కావాలి.. "
"మీరు ఏం చేస్తారో.. నాకు తెలియదు. కనీసం తెలుగు, ఇంగ్లీష్, హిందీ భాషలలో నైనా పబ్లిష్ చెయ్యాలి అంతే.. ! నెక్స్ట్ టైం నా ఇంటర్వ్యూ అందరూ 'బీబీసీ' లో చూడాలి.. "
"అలాగే లెండి.. ముందు మీరు వెబ్ సిరీస్ స్టార్ట్ చెయ్యండి.. " అన్నారు కృష్ణగారు
వెబ్ సిరీస్ పూర్తైన అనతి కాలంలోనే.. ఆనందరావు కు పేరు ప్రఖ్యాతలు బాగా వచ్చాయి. అంతా 'మీ' పత్రిక వారు చేసిన సన్మానం పుణ్యమేనని ఎప్పుడూ గుర్తు చేసుకుంటాడు ఆనందరావు..
ఒకరోజు అనుకోకుండా.. ఎవరో ఆనందరావు ఇంటి కాలింగ్ బెల్ కొడుతున్నారు. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో, ఆనందరావు వెళ్లి తలుపు తీసాడు. వచ్చిన వారిని చూసిన తర్వాత, ఆనందరావు కు నోట మాట రాలేదు..
"లోపలి రావొచ్చా ఆనందరావు గారు.. ?" అని అవతలి నుంచి అడిగారు
"ఎంత మాట.. రండి.. రండి.. కూర్చోండి.. "
"సమయానికి ఇంట్లో ఎవరూ లేరు.. ఏం తీసుకుంటారు.. ?" అని అడిగాడు ఆనందరావు
"ఏం పర్వాలేదు.. ఇంతకీ నన్ను గుర్తు పట్టారా.. ?"
"ఎంతమాట.. మీరు ది గ్రేట్ డైరెక్టర్ నాగేంద్రమౌళి.. పాన్ ఇండియన్ డైరెక్టర్. మీరు తీసిన సినిమాలతో మన తెలుగు సినిమా ఇండస్ట్రీకి పాన్ ఇండియన్ స్టాయి లో గుర్తింపు వచ్చింది. మీకు నేను వీర అభిమానిని. అలాంటిది.. మీరే మా ఇంటికి రావడం అంటే.. అంతా నా అదృష్టం"
"ఇటుపక్క షూటింగ్ ఉంటే, మిమల్ని కలిసి పోదామని వచ్చాను.. "
"అంతా నా అదృష్టం.. "
"మీరు రాసిన వెబ్ సిరీస్ చదివాను.. బాగా నచ్చింది.. నేను నెక్స్ట్ తీయబోయే పాన్ ఇండియా మూవీ కోసం మీరు ఒక కథ రాయాలి.. రాస్తారా.. ?"
"దేవుడే దిగివచ్చి వరం ఇస్తానంటే, వద్దంటాన చెప్పండి.. తప్పకుండా.. " అన్నాడు ఆనందరావు
"ఇదిగోండి అడ్వాన్సు.. కథ అయిపోగానే చెప్పండి.. "
"అలాగే నాగేంద్రమౌళి గారు.. "
ఆనందరావు ఆ కథను చాలా బాగా రాసాడు. అతి తొందరలోనే సినిమా సెట్స్ మీదకు వెళ్ళింది.. ఆ తర్వాత రిలీజ్ అయిన సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యింది. ఆనందరావు అనుకున్న దానికన్నా పాపులారిటీ చాలా ఎక్కువ వచ్చింది. ఇప్పుడు ఆనందరావు ఒక పాన్ ఇండియా రైటర్.
అతి త్వరలోనే, సినిమాలు వేరే దేశాలలో కుడా బాగా పాపులర్ అయి.. ఆనందరావు కథలకి, స్క్రిప్ట్ రైటింగ్ కి చాలా ఫేమస్ అయ్యాడు. ప్రపంచం అంతా ఫేమస్ అయ్యాడు. అనతికాలంలోనే 'బీబీసీ' లో పెద్ద ఇంటర్వ్యూ ఇచ్చాడు ఆనందరావు.
అంతా ఆ 'మీ' పత్రిక వారు అప్పట్లో చేసిన సన్మానం పుణ్యమేనని.. ఎప్పుడూ గుర్తు చేసుకుంటాడు ఆనందరావు..
==============================================================
సమాప్తం
==============================================================
తాత మోహనకృష్ణ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ తాత మోహనకృష్ణ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం
విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత పరిచయం:
Profile Link:
Youtube Play List Link:
నా పేరు తాత మోహనకృష్ణ. నాకు చిన్నతనం నుండి కథలంటే ఇష్టం. చందమామ, వార పత్రికలలో కథలు, జోక్స్ చదివేవాడిని. అలా, నాకు సొంతంగా కథలు రాయాలని ఆలోచన వచ్చింది. చిన్నప్పుడు, నేను రాసిన జోక్స్, కథలు, కొన్ని వార పత్రికలలో ప్రచురింపబడ్డాయి. నేను వ్రాసిన కధలు గోతెలుగు.కామ్, మనతెలుగుకథలు.కామ్ లాంటి వెబ్ పత్రికలలో ప్రచురింపబడ్డాయి. బాలల కథలు, కామెడీ కథలు, ప్రేమ కథలు, క్రైం కథలు రాయడమంటే ఇష్టం.
ధన్యవాదాలు
తాత మోహనకృష్ణ
コメント