#పెనుమాకవసంత, #PenumakaVasantha, #XXXSmilePlease, #XXXఇస్మయిల్ప్లీజ్, #TeluguComedyStories, #తెలుగుహాస్యకథలు
XXX Smile Please - New Telugu Story Written By - Penumaka Vasantha
Published In manatelugukathalu.com On 03/12/2024
XXX ఇస్మయిల్ ప్లీజ్ - తెలుగు కథ
రచన, కథా పఠనం: పెనుమాక వసంత
Youtube Link: https://youtube.com/shorts/dx4t336wqTE
"ఎంత ఆ డైరెక్టర్ తో పోటీ అయితే మాత్రం పేరు త్రిబులెక్స్ పేరు పెట్టటం బాలేదు, రాజపూరివర్మ గారు.
"మీరు ఊరుకోండి, గురివింద్ గారు. ఇపుడు జనాలకు, సినిమా పేర్లు వెరైటీ గా ఉండాలి. అపుడే మన సినిమా సూపర్ హిట్"
"ఏమి హిట్టో!? సినిమా పేరే దరిద్రం గా ఉంది. త్రిబులెక్స్ ఏందీ, అది సోప్ పేరయ్యా”, అన్నాడు నిర్మాత గింజ, గురివింద్.
"పేరు గురించి ఫీల్ అవ్వకండి. మన సినిమాలో విలన్ని ఈ త్రిబులెక్స్ సోప్ తో రుద్ది, రుద్ది, వాడిలోని నెగటివ్ ను పోగొట్టి, మంచివాడుగా తీర్చి దిద్దటమే, ఈ సినిమా కథ."
"విలన్ని రుద్దటమేమో గానీ! ముందు నువ్వు త్రిబులెక్స్ సోప్ తో నీ బట్టలు శుభ్రం గా ఉతుక్కుని, గడ్డం గీచుకుని రేపు సెట్ కు రా. చూడలేక, చస్తున్నాం" అన్నాడు గింజ గురివింద్.
“ఇపుడు నా గడ్డం మీకు ఏమీ అడ్డం గురివింద గారు..
నేను గడ్డం తో వుంటే జనాలు సినిమా కోసం ఎంత కష్ట పడ్డాడో అనుకుంటారు. అదీకాక ఇపుడు కో
గడ్డం ఫ్యాషన్ కదా”.
“ఫ్యాషన్ సరే, కాస్త ట్రిమ్ అన్నా చేసుకోవయ్యా. సరే గానీ.. పాటలు ఏమి పెడుతున్నావు!?” అన్న గింజ గురివింద్ తో “కాటు, కాటు, పాము కాటు, అంటూ రెండు పాముల డాన్స్ ఈ సినిమాకు హైలెట్” అన్నాడు రాజపూరివర్మ.
"ఏమి కాటో కానీ ఈ సినిమా తర్వాత మనమిద్దరం ఇక పాముల్ని పట్టుకోకుండా చెయ్యి చాలు”, అని వెటకారంగా అన్న నిర్మాత గింజ గురివింద్ తో "చూస్తూ ఉండండి, ఈ కాటు డాన్స్ ఇప్పటికే కోటి వ్యూస్ తో దూసుకుపోతుంది. దీనికి, ఆస్కార్ అవార్డ్ వస్తుందంటున్నారు జనాలు" అన్నాడు రాజపూరివర్మ.
"ఆస్కార్ కాదు కానీ.. ! పెట్టిన డబ్బులు వచ్చేట్లు చెయ్యి చాలు" అన్నాడు గురివింద్.
మొహం చిన్న బుచ్చుకుని రాజా పూరీ వర్మ “కాస్త మీరు నన్ను ప్రోత్సాహ పరిస్తే.. కాలు భళి సినిమా తీద్దాం అని ప్లాన్ చేస్తున్నా” అన్నాడు.
“ఓరి నీ పాసు కూల.. బహుభళి కి పోటీగానా..
సరే ముందు ఇది హిట్ అయితే అపుడు ఆలోచిద్దాములే రాజా చపాతి వర్మ” అన్నాడు గురివింద.
‘పూరీ’ అని తన పేరును సరి చేసాడు డైరెక్టర్.
ఇలా వున్నాయండి ఇప్పటి సినిమా పేర్లు!
సమాప్తం
పెనుమాక వసంత గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ పెనుమాక వసంత గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత్రి పరిచయం:
పేరు వసంత పెనుమాక, గృహిణి. రచనలు చేయటం, పాటలు వినటం హాబీస్.మన తెలుగు కథలకు కథలు రాస్తున్నాను. ధన్యవాదములు.
Satish Kumar
•2 days ago
వసంత శ్రీ గారి కథ, కథనం nd గళం మూడు బాగున్నాయి.. 👏💐🥰
"XXX ఇస్మయిల్ ప్లీజ్" పెనుమాక వసంత గారు రాసిన హాస్య కథ. ఈ కథలో, సినిమా దర్శకుడు రాజపూరి వర్మ, నిర్మాత గింజ గురివింద్, ఇతర పాత్రలు కలిసి సినిమా ప్రాజెక్ట్ పై చర్చిస్తున్న సందర్భాన్ని వర్ణిస్తారు. ఇందులో, సినిమా పేరును "త్రిబులెక్స్" అనే సోప్ పేరుతో పెట్టడం, పాటల "కాటు డాన్స్" జోక్, దర్శకుడు నెగటివ్ పాత్రను మార్చే ప్రయత్నాలు హాస్యంగా చూపించబడతాయి.
ఈ కథలో, సినిమా పేపర్, పాటలు, నేపథ్యంలో జరిగిన అడ్డంకులు, సహజమైన వ్యంగ్యంతో ప్రస్తావించబడ్డాయి. "సోప్ పేరుని సినిమా పేరుగా పెట్టడం" అనే అంశం హాస్య స్ఫూర్తితో వినోదాన్ని కలిగిస్తుంది.
ఈ కథ సామాన్యంగా చిత్ర పరిశ్రమలో ఉండే ప, సమాజంలో అనేక సార్లు వినబడే ట్రెండ్స్, పరిస్థితులపై సరదాగా రాశారు