top of page

యమబాల - పార్ట్ 1



'Yamabala - Part 1/4' - New Telugu Story Written By Vagumudi Lakshmi Raghava Rao

Published In manatelugukathalu.com On 07/06/2024

'యమబాల పార్ట్ 1/4' పెద్ద కథ ప్రారంభం

రచన: వాగుమూడి లక్ష్మీ రాఘవరావు


"మనదే భారత్... మనదే భారత్... మనదే భారత్" ట్రైన్ వాయువేగంగ పరుగులు తీస్తుంది. భారతీయ సంస్కృతీ సాంప్రదాయాలను తెలియచేసే అనేకానేక చిత్ర పటాలు ట్రైన్ మీద చూసేవారి మనసులను రంజింపచేస్తున్నాయి. 


‘యస్.. దిస్ ట్రైన్ ఈజ్ సమ్ థింగ్ స్పెషల్’ అని ట్రైన్ లో ఉన్నవారు కొందరు అనుకుంటున్నారు. 


 కొందరికి పరుగులు తీసే ట్రైన్ చూస్తే చాలు మనసు పరవసిస్తుంది. వయసు చిన్నదవుతుంది. ఆనందం ఉప్పొంగుతుంది. అంతే.. ఆ తర్వాత జింగిడిబింగిడి రంగిడిమంగిడి మంగిడే... మంగిడి. 


 ఈ విషయం లో దేవతల మెంటాలిటీలో కూడా పెద్ద తేడా ఉండదు. వారూ అంతే. అది అంతే అన్నట్లు " మనదే భారత్" ట్రైన్ చూచిన శ్రీరామ భక్త హను మాన్ ఆంజ నేయ స్వామి మనసు ఆహ్లాదంలో తేలి యాడింది.. 


" రామ రామ శ్రీరామ.. ఇక్ష్వాకు కుల తిలక ఇన వంశో ద్దారక శ్రీరామ " అని పాడుతూ, కాసేపు ట్రైన్ తో పోటీ పడాలని తన శక్తిని, తన రూపాన్ని ఆంజనేయ స్వామి చిన్న వానరంలా తనని తాను కుదించుకున్నాడు. సురశక్తి ముందు ఎంత విజ్ఞాన తేజమైన కించిత్ శిరము వంచవలసిందే. తప్పదు మరి అది అంతే.. 


 ఎత్తయిన కొండల నడుమకు "మనదే భారత్" ట్రైన్ వచ్చింది. ఆకుపచ్చని కొండలు అందంగా ఆహ్లాదంగ వెనుకకు వెళ్ళిపోతున్నాయి అనేకంటే పారిపోతున్నాయి అంటే మనసుకు బాగుంటుంది. నిజానికి ఎంత అసత్యమైన మనసుకు నచ్చేది కవిత్వం. 


 ట్రైన్ లో కిటికీ దగ్గర కూర్చుని బయట ప్రకృతిని చూస్తుంటే కలిగే ఆనందం వర్ణనాతీతం. నవరస భరితం. 


 కొండల మీద వానర రూప ఆంజనేయస్వామి పరుగులు తీస్తున్నాడు. తన శక్తిని ఎంతగా తగ్గించు కున్నా స్వామే ట్రైన్ కంటే ముందున్నాడు. అది చూసి స్వామి ఆనందంతో గంతులు వేస్తున్నాడు. 


 అనంతరం పెద్దనది మీద ఉన్న బ్రిడ్జి పైకి "మనదే భారత్" ట్రైన్ వచ్చింది. ట్రైన్ వేగంగా ముందుకు సాగిపోతుంది.. స్వామి నదిలో పడవల మీద ఉన్న తెరచాపల గుండా ముందుకు గెంతుతున్నాడు. 


 "ఇది ఉరుకుల పరుగుల ఊహాగానం.... కాదుర కాదుర నరుడా.. వాయుపుత్రుని సుందర ఆహ్లాద వాయు వేగం చూడరా చూడరా. ఇదే ఇదే రా మానవుడా... ". అని ప్రకృతి మాత పరవసించిపోతుంది. 


స్వామి రకరకాల రీతులలో పరుగులు తీస్తున్నాడు. ట్రైన్ కంటే ముందుంటున్నాడు. స్వామి పరుగులు చూసి వాయుదేవుడు "ఔరౌర అమ్మక చెల్లా.. ఆహోరే మనసంతా నువ్వే పుత్ర " అంటూ వాయుదేవుడు ఈల పాటలు, గాలి పాటలు పాడుతున్నాడంటే అతని పెద్దరికానికి భంగం కలుగుతుందేమో కానీ అతని ముఖం చూస్తే పాడుతున్నట్లే ఉన్నాడు. 


 తెలివి ఉన్నవాడిని తీసుకువెళ్ళి అడవిలో పడేసిన అడవినే అమెరికాగా మలుస్తాడు. ఇక సురుడైన ఆంజనేయ స్వామి గురించి చెప్పవలసిన పనేముంది. ? అతనెక్కడ ఉంటే అక్కడ అంతా శ్రీరామ మయం. సీతారామ తేజం. 


మనదే భారత్ "ట్రైన్లో ఎదురెదురుగా కూర్చొని ఉన్న విరాట్, నయాజిత్ ఒకరి ముఖాలు ఒకరు చూసుకుని లేచి నిలబడ్డారు. విరాట్ అరచేతితో, తన గుండును ఒకసారి నిమురు కున్నాడు. కుడి అరచేతి లోని మద్యన ఉన్న మూడు వేళ్ళతో తన నుదుటన అడ్డంగా రాసుకున్నాడు. పక్కననే ఉన్న పదునైన కర వాలంను తీసుకున్నాడు. 


 విరాట్ ప్రశాంత వదనంతో నయాజిత్ ను చూ సాడు. కొంచెం కాటుక దిద్దుకున్న కళ్ళతో ఉన్న నయా జిత్ ఒకసారి కళ్ళు మూసి తెరిచాడు. అతని చూపులో పైకి నవ్వు, లోపల కౄరత్వం కనపడుతుంది. 


అతని భుజానికి వేళాతున్న సంచి నడుం కు చిన్న 🎀 రిబ్బన్ తో కట్టివేయబడి ఉంది.. ఇద్దరూ రైలు తలుపుల దగ్గరకు వెళ్ళారు. విరాట్ ఒక తెరచాప నుండి మరో తెరచాప మీదకు గెంతుతున్న ఆంజనేయ స్వామి ని చూసాడు. స్వామి తనను ఆశీర్వది స్తున్నట్లు విరాట్ కు అనిపించింది. 


 "పంచముఖ స్వరూపాయ|పంచభూతాత్మకాయ|

 నవ వ్యాకరణ బ్రహ్మ|నమామి హనుమ|

 ఆంజనేయస్వామిని చూస్తూ విరాట్ మనసులో అనుకున్నాడు. 


 "మనదే భారత్ " ట్రైన్ బ్రిడ్జి ని దాటింది. మరలా అటవీ ప్రాంతంలోని ఎత్తైన ప్రాంతం నుండి ట్రైన్ ప్ర యాణం చేస్తుంది. అటవీ ప్రాంతం నడుమ ఒక వంకర టింకర రోడ్డు వారికి కనపడింది. అది ట్రైన్ బిడ్జికి రెండు తాటి చెట్లంత లోతుగ కిందన ఉన్న రోడ్డు. ఎత్తైన కొండ మీద రైల్వే బ్రిడ్జి. దానిపై ట్రైన్ ప్రయాణం చేస్తుంది. ట్రైన్ మహా వేగంగా ముందుకు సాగిపోతుంది. 


 రోడ్డు పై దరిదాపు అయిదువందల మంది ఆటవికులు పెద్దగా అరుస్తూ ట్రైన్ వైపు చూసారు. వారు ట్రైన్ మీదకు రాళ్ళను రువ్వుతున్నారు.. ఎందుకంటే అదో శునకానందం. 


 విరాట్ "జై వీర హనుమాన్ "అంటూ ట్రైన్ ఒక పక్కనుండి కిందికి దూకాడు. నయాజిత్ కూడా ట్రైన్ మరో పక్కనుండి కిందికి దూకాడు. 


 విరాట్ చేతిలో పెద్ద కరవాలం ఉంది. విరాట్ కరవాలం పట్టుకున్న విరాట్ స్వరూపునిలా ఉన్నాడు. విరాట్ చేతిలోని కరవాలం ఒక ఆటవికుని తలను తాకింది. ఆటవికుని శరీరం రెండుగ చీలింది. అక్కడి వాతావరణం భయంకరంగా మారింది. 


 వాయుపుత్రుడు భీమసేనుడు జరాసంధుని శరీరం చీల్చి అవతల పడేయగా, జరాసంధుని శరీరం అల్లంత దూరంలో పడిన దానికన్నా భయంకరంగా ఆటవికుని రెండు శరీర ముక్కలు దూరం దూరంగా పడ్డాయి.. 


 ట్రైన్ నుండి దూకిన నయాజిత్ ఒక చెట్టు కొమ్మ ను పట్టుకుని కిందికి దూకాడు. విరాట్ ఒడుపుగ తన చేతిలోని కత్తితో మరో ఆటవికుని తల నరికాడు. ఆ తల నయాజిత్ కాళ్ళ దగ్గరకు వెళ్ళిపడింది. దెబ్బకు ఒక తలకాయ అన్నట్లు గా పది నిమిషాలలో ఆటవికు లందరూ విరాట్, నయాజిత్ చేతిలో హతమయ్యారు. 


విరాట్ నిర్మానుష్యంగా ఉన్న కీకారణ్యం రోడ్డు మీద గుట్టలు గుట్టలుగా పడిన ఆటవికుల శవాలను చూసాడు. 


 విరాట్ నయాజిత్ ముఖం చూసాడు. ఒకసారి వారి ద్దరూ ఎలా స్నేహితులయ్యిందీ విరాట్ గుర్తుకు చేసు కున్నాడు. 


 విరాట్ ఇసుక తుపాను ఎత్తును గమనిస్తూ, దాని ని అధిగమించి ఎగురుతూ ఇసుక తుపాను నుండి తప్పించుకున్నాడు. యంత్రాలతో సృష్టించబడ్డ ఆ ఇసుక తుపాను ఒకేసారి ఆశ్చర్యాన్ని, అద్భుతాన్ని, భయాన్ని కలిగిస్తుంది. ఆకాశాన విమానం లో వెళు తున్న నయాజిత్ విరాట్ శక్తి సామర్థ్యాలను గ్రహించా డు. విరాట్ ను తన స్వప్రయోజనానికి వాడుకోవాల నుకున్నాడు. 

 శ్రీవేంకటేశ్వర స్వామి దేవాలయం దగ్గర విరాట్ తన చేతులతో అన్నదానం చేస్తున్నాడు. అక్కడి వారంతా విరాట్ గొప్పతనం గురించి పలుపలు రీతులలో మాట్లాడుకుంటున్నారు. వారి మాటల్లో విరాట్ పెద్ద మేనత్త గుండుసూదుల పెద్ద గుండమ్మ, చిన్న మేనత్త గుండు సూదుల చిన్న గుండమ్మ ల ప్రసక్తి వచ్చింది. 


 పెద్ద గుండమ్మ యింటికి వచ్చిన అతిథులకు కడుపునిండా భోజనం పెట్టడం, యింటి వ్యవహారా లన్నిటిని ఒంటి చేత్తో కడు సమర్థనీయంగా ముందుకు తీసుకు వెళ్ళడం వంటి వాటిలో మహా సమర్థురాలైతే, చిన్న గుండమ్మ పొలం విషయాలలో, వ్యవసాయ పనుల విషయాలలో వ్యవహారాలన్నిటిని మహా మహా సమర్థనీయంగ నడపటంలో మహా సమర్థురాలని అక్కడి వారంత చెప్పుకుంటున్నారు. 


 ఇద్దరి మేనత్తల గుణగణాలన్నిటిని విరాట్ చక్కగ పుణికిపుచ్చుకున్నాడని కొందరనుకుంటున్నారు. 


నయాజిత్ అక్కడి వారందరి మాటలను విని, విరాట్ దగ్గరకు వెళ్ళాడు. విరాట్ కు ఇసుక తుపాను సంగతిని గుర్తు చేసాడు. " అది నా మిత్రులు మిషన్ ల సహాయంతో సృష్టించిన కృత్రిమ ఇసుక తుపాను. నా శక్తి సామర్థ్యాలను గమనించడానికి వారు నాకు ఆ పరీక్ష పెట్టారు. రామభక్త హనుమాన్ వీరాంజనేయ స్వామి అనుగ్రహంతో పరీక్ష లో నెగ్గాను. " అని విరాట్ జరిగింది నయాజిత్ కి చెప్పాడు.. 


 నయాజిత్ తనని తాను గొప్ప ధనవంతునిగ పరిచయం చేసుకున్నాడు. తనకి అనేక వ్యాపారాలలో షేర్లు ఉన్నవని చెప్పాడు. అన్న దానానికి తను కూడా కొంత ధనం సహాయం చేస్తానన్నాడు. విరాట్ నయా జిత్ మాటల ఆంతర్యాన్ని గమనిస్తూ "సరే " అన్నాడు. విరాట్ గతం నుండి వర్తమానానికి వచ్చాడు. 


" నయా... నీగురించి అంతా ఎంక్వైరీ చేయించానురా రాక్షస గ్యాంగ్ హీరో.. నీలాంటి వారు అభ్యుదయం, చైతన్యం వంటి వాటి పేర్లను, నిరుపేదల పేర్లను అడ్డు పెట్టుకుని మరికొందరితో కలిసి విపరీతంగా సంపా దించేస్తారు. ఆ తర్వాత సంపాదించినదాని వాటాల దగ్గర తేడా వస్తే నా లాంటి వారి సహాయంతో నీకు అడ్డుగా ఉన్నవారిని తొలగిస్తావు.. ధనమూలం ఇదమ్ జగత్. దట్సాల్. నిరుపేదలు, సమాజం, సంఘసేవ వంటి ఆదర్శాలు తమ సంపాదనకు పెట్టుబడి లేని ఆవేశ ఉపన్యాసాలు. అంతే... 


 వీరంతా ఆటవిక వేషంలో ఉన్న నీ గ్యాంగ్ స్టార్ సే. వీరు నీకు చెందినవారే.. వీరి కష్టమంతా నీ వద్దనే ఉంది. వీరి తో పాటు మరో గ్యాంగ్ స్టార్ ఉన్నా డు. వాడు ఎక్కడ ఉంటాడో నాకు తెలిసిందిలే.. " అంటూ విరాట్ ఒడుపుగా నయాజిత్ భుజానికి ఉన్న సంచిని లాక్కుని అందు లోని లాప్ టాప్ తీసుకు న్నాడు. అనంతరం విరాట్ శరవేగంగా వేసిన ఒకే ఒక కత్తి వేటుకు నయాజిత్ తల వెళ్ళి చెట్టు కొమ్మల నడుమ చిక్కుకుంది. 


 విరాట్, తెగిపడి చెట్టుకొమ్మ మీద ఉన్న నయాజిత్ తలను చూస్తు శవాల గుట్ట మీద కూర్చున్నాడు. నయా జిత్ అంతకు ముందు తన కంప్యూటర్ ను ఓపెన్ చేసిన పాస్ వర్డ్ ను గుర్తు చేసుకుంటూ కంప్యూటర్ ను ఓపెన్ చేసాడు. కంప్యూటర్ లోని ఫోటోలన్నిటిని చూ సాడు. కంప్యూటర్ సహాయంతో తన మిత్రుడు వికట కు, " వికట ఆప్రేషన్ సక్సెస్ నయాజిత్ నన్ను ఉపయో గించుకుని తన వారందరిని చంపేసి, నా చేతిలో నా లుగు వందల కోట్లు ఉంచి, ప్రజలను, ప్రభుత్వాలను భయపెట్టి సంపాదించిన కోట్ల కోట్ల రూపాయిలను తన స్వంతం చేసుకోవాలనుకున్నాడు. అయితే అతని ఆటలు మన ముందు సాగలేదు. ఇక ఈ ఆప్రేషన్ లో మరో తలకాయ ఉంది. నెక్స్ట్ అదే.. రడీ గ ఉండు" అని ఫోన్ చేసాడు. 


 సముద్రం లో ప్రయాణిస్తున్న ఓడ ప్రయాణ వేగాన్ని అంచనా వేసుకుని విరాట్, ఓడకు దగ్గరగ వచ్చిన విమానం నుండి ఓడలోకి దూకాడు. విమానంలో ఉన్న వికట విమానాన్ని పైకి పోనిచ్చాడు. 


 ఓడలోకి దూకిన విరాట్ ను వందమంది అనుచ రుల నడుమన ఉన్న చురకేర్ చూసాడు. విరాట్ నయా జిత్ కంప్యూటర్ లో చూచింది ఇతనినే అనుకున్నాడు. 


 చురకేర్ అనుచరులు విరాట్ మీదకు ఉరికారు. 

విరాట్ వారందరిని చావచితక బాదుతూ ఓడనుండి సముద్రంలోకి విసరసాగాడు. 


 సముద్రంలో పైపైకి ఎగురుతూ సంచరించే ఒక పెద్ద సర్పం నోటిలో ఒక అనుచరుడు పడ్డాడు. అతగాడి తలను ఆ సర్పం కొరికేసింది. అతని తల మరో సర్పం నోటిలో పడింది. అతని మొండెం మరో సర్పం నోటిలో పడింది. కొందరు అనుచరులు సము ద్రంలో పడి అక్కడి పెద్ద పెద్ద చేపల తోకల దెబ్బలకు నీటి పైకి ఎగిరి మరలా సముద్రంలో మరో జల చరానికి బలవుతున్నారు. ఇలా అందరూ జలచరాలకు బలయ్యారు. 


 సముద్రంలో గోరంత ఉన్న చేపలు చెవులు చిల్లులు పడేలా శబ్దాలు చేస్తున్నాయి. ఆ శబ్దాల వలన సముద్రంలో పడే చురకేర్ అనుచరుల చెవులు చిల్లులు పడుతున్నాయి. రక్తం సముద్రపు నీటిలో కలిసి పోతుంది. చివరకు చురకేర్ మిగిలాడు.. 


 విరాట్ చురకేర్ ను బట్టలు ఊడదీసి కొట్టాడు. కడకు విరాట్ చురకేర్ గుండె 💓 మీదన ఉన్న ఫోన్ నెంబరు ను, బ్యాంకు ఎకౌంటు నెంబర్ ను చూసాడు. విరాట్ మెదడులో రెండు నెంబర్లు పదిలంగా కుదురు కున్నా యి. తన గుండె 💓 మీదన ఉన్న నెంబర్లను విరాట్ చూసా డన్న కోపంతో చురకేర్ విరాట్ ను సముద్రంలో ఒక వైపుకు తోసి అతను మరొక వైపుకు దూకాడు. 


 పెద్ద చేప ఒకటి నీళ్ళలో పడుతున్న చురకేర్ ను చూచి తోకతో అతని మెడ మీద గట్టిగా కొట్టింది. దానితో చురకేర్ తల ఆకాశం లో ఎగురుతున్న విమా నం దగ్గరకు వెళ్ళి మరలా సముద్రంలో పడి మరో చేప కు ఆహారం అయ్యింది. 


 విరాట్ సముద్రంలో పడే సమయంలో ఒక చేప తన పెద్దనోరును తెరిచింది. విరాట్ విశాలంగా ఉన్న చేప నోటిలో పడ్డాడు. వెంటనే చేప నోరు మూసు కుని చెవులతో నోటిలోకి పోయిన వాటినన్నిటిని కడు 


 వేగంగా వదిలింది. చేప నోటిలోకి వెళ్ళిన విరాట్ చేప చెవినుండి వేగంగా పైకి దూసుకు వచ్చాడు.. అది చూసి, విమానంలో ఉన్న వికట వెంటనే తాళ్ళ నుచ్చెన వేసాడు. విరాట్ తాళ్ళ నుచ్చెనను పట్టు కుని నెమ్మ దిగా పైకి ఎగబాకాడు. 


 నయాజిత్ కంప్యూటర్, చురకేర్ ద్వారా రాబట్టిన ఫోన్ నెంబర్, ఎకౌంటు నెంబర్ సహాయంతో విరాట్ నయాజిత్ సర్వ ఆస్తుల వివరాలన్నిటిని సేకరించాడు. 


విరాట్, వికట నయాజిత్ ధనం, వజ్రాలు, బంగారం దా చిన చోటుకు వెళ్ళి ఆ సంపదనంతా చూసారు. 


ఇదంతా ప్రజల కష్టం. ఏదో ఒక విధంగా ప్రజలకే చేరాలి అని విరాట్ వికటతో అన్నాడు. 

 వికట దృష్టి అక్కడ ఉన్న రెండు బంగారు పట్టీల మీద పడింది. ఆకు పచ్చని వజ్రాలతో పొదగబడిన పసిడి పట్టీలను వికటతో పాటు విరాట్ కూడా చూసాడు. 


"వీటి ఖరీదు అంచనా వేయడం కష్టమే. " వికటతో అన్నాడు విరాట్.

=======================================================================

ఇంకా వుంది.. 

=======================================================================

వాగుమూడి లక్ష్మీ రాఘవరావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.



రచయిత పరిచయం: వాగుమూడి లక్ష్మీ రాఘవరావు





36 views0 comments

留言


bottom of page