top of page

యమబాల - పార్ట్ 4



'Yamabala - Part 4/4' - New Telugu Story Written By Vagumudi Lakshmi Raghava Rao

Published In manatelugukathalu.com On 18/06/2024

'యమబాల పార్ట్ 4/4' పెద్ద కథ

రచన: వాగుమూడి లక్ష్మీ రాఘవరావు


జరిగిన కథ:


విరాట్ శక్తి సామర్థ్యాలను తన స్వార్థానికి వాడుకుంటాడు నయాజిత్.

అతను తనను వంచించిన విషయం గ్రహిస్తాడు విరాట్.

నయాజిత్ ను, ఆటవికులు వేషాల్లో వచ్చిన అతని అనుచరులను సంహరిస్తాడు.

విరాట్ ని తప్పించుకునే ప్రయత్నంలో చురకేర్ చనిపోతాడు.

నయాజిత్ ప్రజలనుంచి దోచుకున్న ధనాన్ని తిరిగి వారికే ఇవ్వాలనుకుంటాడు విరాట్.

స్వర్గం నుండి భూలోకానికి వచ్చిన యమబాల విరాట్ మేనత్త గుండమ్మ ఇంటికి వస్తుంది.

విరాట్ కి ప్రాణ గండం ఉన్నట్లు ఆమెకు తెలుస్తుంది.

అతన్ని పాముకాటు నుండి తప్పిస్తుంది యమబాల..


ఇక యమబాల పెద్దకథ చివరి భాగం చదవండి..


" ఈ పల్లెటూరు చాలా బాగుంది ఆంటీ. ముఖ్యంగా మీ అక్కయ్య పెద్ద గుండమ్మ గారి ఆరోగ్యకర వంటలు, ఉన్నంతలో పదిమందికీ సహాయం చేస్తూ ఉన్న ఆస్తిని పద్ధతిగా సంరక్షించే మీ నైపుణ్యం సూపర్ అంటే సూపర్. అది సరే మీరిద్దరూ పెళ్లి ఎందుకు చేసుకో లేదు?" చిన్న గుండమ్మ ను ప్రశ్నించింది యమబాల. 


"దాని గురించి చెప్పాలంటే పెద్ద చరిత్రే అవుతుందమ్మ. సంక్షిప్తంగా చెబుతాను. విను. మా తండ్రిగారు రఘుపతి రాజారాం గారికి ముగ్గురు సంతానం. నేనూ మా అక్క పెద్ద గుండమ్మ మా తమ్ముడు కృష్ణ వరప్రసాద్. మా చిన్నప్పుడే మా తల్లిగారు మరణించారు. మా తండ్రి గారు మళ్ళీ పెళ్ళి అనే ఆలోచన చెయ్యలేదు. మా ముగ్గురిని అల్లారు ముద్దుగా పెంచారు. 

 నాగ సత్యం కృష్ణ వర ప్రసాద్ చిన్న తనం నుంచే ప్రాణ స్నేహితులు అయ్యారు. 


 కృష్ణ వరప్రసాద్ యమ ద్వితీయ రోజున భగినీ హస్త భోజనం చేసి ధర్మపురి యమధర్మరాజు ను దర్శిం చుకువచ్చేవాడు. ఆ రోజు మేమంత ఎంతో సరదాగా గడిపేవారం. నరకాసురుని సంహరించిన శ్రీకృష్ణుని కథలను, భగినీ హస్త భోజనానికి శ్రీకృష్ణుని పిలిచిన సుభద్ర కథలను చెప్పుకునేవారం. ఆ కథలను చెప్పే హరిదాసులను, బుర్ర కథ చెప్పేవారిని ఆహ్వానించే వారం. 

 నాగ సత్యం అన్నయ్య నాగేశ్వర్ ను పెద్ద గుండమ్మ ప్రేమించింది. ఆ విషయం తెలియని నేను కూడా నాగేశ్వర్ ని ప్రేమించాను.. నాగేశ్వర్ ఒకరికి తెలియకుండా ఒకరిని వివాహం చేసుకుని ఇద్దరికి భర్త అవ్వాలనుకున్నాడు. 


ఈ విషయం నాగ సత్యం ద్వారా మా తండ్రిగారికి తెలి సింది. మా తండ్రిగారు నాగేశ్వర్ ని మా ఇద్దరి ముందు నిలేసాడు. నాగేశ్వర్ తన తప్పును ఒప్పు కున్నాడు. 


 మా కంటే ముందే మా తమ్ముడు కృష్ణ వరప్రసాద్ తన క్లాస్ మేట్ విశాలను ప్రేమించాడు. అది తెలిసిన మా తండ్రిగారు ముందుగా మా తమ్ముని వివాహం జరిపించేసారు. వారి సంతానం విరాట్. 

 విరాట్ పుట్టినప్పుడు మా తండ్రిగారు మా వివా హాల ప్రసక్తి తెచ్చారు. అప్పుడు నాగేశ్వర్ తనను పెళ్ళి చేసుకోమని అక్కను బతిమాలాడు. బెదిరించాడు. అక్క అందుకు ఒప్పుకోలేదు. ఆ రాత్రే గుండెపోటుతో నాగేశ్వర్ మరణించాడు. ఈ సంఘటన జరిగిన పది


దానితో నాకూ మా అక్కకు వివాహం మీద విరక్తి కలి గింది. విరాట్ ఆలనా పాలనా చూసుకుంటూ అలా అలా బతికేస్తున్నాము. మా తమ్ముడు కృష్ణ వరప్రసాద్ లాగానే ఉంటాడు విరాట్. 

కృష్ణ వరప్రసాద్ కర్ర తిప్పడంలో, జలస్తంబవిద్యలో, వ్యవసాయం చేయడంలో మంచి నైపుణ్యం ఉన్నవాడు. " యమబాలతో అంది చిన్న గుండమ్మ. 


" విరాట్ కూడా చాలా చాలా విద్యలలో నైపుణ్యం కలవాడులా ఉన్నాడు. అనేకగ్రామాలను దత్తత తీసు కున్నాడు. అక్కడివారికి కావల్సిన సదుపాయాలన్నీ చూస్తున్నాడు. " అంది యమబాల. 

" నిజమే వాడు మాకంటే బాగా మా ప్రజలను చూసు కుంటున్నాడు. " అది చిన్న గుండమ్మ. 

యమబాల ఒంటరిగా విరాట్ ను కలిసింది. విరాట్ కిరీట ధారిణి, గదా ధారిణి అయిన యమబాలను చూ సాడు. విరాట్ కళ్ళు నులుముకుని మరలా యమ బాలను చూసాడు. యమబాల విరాట్ మనసును గ్రహించింది. 


" విరాట్ మమ ప్రేమికా. నీ మనసును గ్రహించాను. నేను నీకు దేవ కాంతలా కనపడుతున్నాను. అవును. నిజమే నేను దేవ కాంతను. యమధర్మరాజు గారాల పుత్రికను యమబాలను. 

 నాకొకసారి భూలోకం చూడాలనే బుద్ది పుట్టింది. అదే విషయం తండ్రి యమధర్మరాజు గారికి చెప్పాను. 


వారు ముందుగా వలదు వలదు అన్నారు. నేను ఒకటికి పదిసార్లు ప్రాధేయపడగా వారు "సరే "అన్నారు. అప్పుడే నాకు మరో ఆలోచన వచ్చింది. తండ్రిగారు జీవుల ప్రాణాలను తీస్తారు కదా?ఆ పని నేనొకసారి చెయ్యా లనుకున్నాను. నాబలవంతం మీద తండ్రి గారు ఒప్పుకున్నారు. నీ ప్రాణములు తీసే బాధ్యతను నాకు అప్పగించారు. నిజానికి ఈ రోజుతో నీ ఆయువు పరిసమాప్త మయ్యింది. అయితే నేను నీ ప్రేమలో పడ్డాను. ఇదే విషయం తండ్రిగారికి చెప్పాను. వారు నీకు చంద్రుడు పెట్టిన శాపాన్నే వరంగా మలుచు కో అని చెప్పారు. 


 నేను భూలోకానికి వచ్చినప్పుడు ఒక విచిత్రం జరిగింది. నేను ఒకసారి ఉయ్యాల ఊగేటప్పుడు నా పాదాలు ఆకాశం వైపుకు వెళ్ళాయి. చంద్రునిలో ఉన్న కుందేలు పిల్ల నా పాదాల పట్టిలకు ఉన్న ఆకుపచ్చని వజ్రపు ఛాయ గడ్డి అని భ్రమించి దానిని తినడానికి పరిగెత్తింది. అప్పుడు చంద్రుడు కుందేలు పిల్లను పట్టడానికి ప్రయత్నించి విఫలమయ్యాడు. అంత దీనంతటికి కారణం నేనని నామీద కోపంతో, " యమ బాల నీవలన నేను కొంచెం ఇబ్బందులకు గురయ్యాను. కావున 150 దివ్య రోజులు భూమి మీద గడిపి ఆపై నీకు నచ్చిన వారితో నీ లోకం వెళ్ళు అని శపించాడు. 


 నేను భూలోకంలోకి రాగానే భూకాంతను అయ్యా ను. దేవతలకు ఒక రోజు మానవులకు ఒక సంవత్స రంతో సమానం. అంటే నేను భూమి మీద మానవ కాంతగ 150 సంవత్సరాలు ఉండాలి. నీ ప్రాణం తీసే అధికారం నా తండ్రి నాకే ఇచ్చాడు. కాబట్టి ఈ సమస్య కు పరిష్కారం నాలో సగం సంవత్సరాల ప్రాణం నీకు ధారపోస్తాను. నీ పూర్వ జన్మ పుణ్య ఫలం వలన నీలో కొంత దైవాంశ ఉంది. ఆ దైవాంశయే నీకిప్పుడు నిండూ నూరేళ్ళ జీవితాన్నీ ప్రసాదిస్తుంది. శాంతి బద్దంగ, స త్త్వ బద్దంగా, న్యాయబద్దంగా ఈ భూమి మీద మనిషి చేసే మంచి పనికి తప్పకుండా ఏదో ఒక మేలు జరుగు తుంది. నువ్వు చేసిన మంచి, నీ తండ్రిగారు స్వీకరిం చిన భగినీ హస్త భోజనం, యమధర్మరాజు పూజ ఫలమే నీ ఆయుష్షు ను పెంచు తుంది. ఇక నేనూ నా శాపం ఇదంత జగన్నాటక సూత్ర ధారి రచన. దానిని నువ్వే కాదు మేం కూడా గమనించలేం.. 


 పురాణాలలో రురుడు ప్రమధ్వర విషయంలో ఇదే పని చేసాడు. కావున ఇక నువ్వు నిండూనూరేళ్ళు భూమి మీద ఉంటావు. నేను చంద్రుని ప్రాధేయపడగా నా శాపాన్ని ఇలా తగ్గించుకునే అవకాశం ఇచ్చాడు. నా శాపం నీకు వరం కాబోతుంది. " యమబాల తను వచ్చిన సంగతి ని చెప్పింది. 


 డైమండ్, సాయిశ్రీ ఇచ్చిన చిత్రాలన్నిటినీ పరిశీలిం చాడు. అందులో ఒక చిత్రం తీసి ఈ చిత్రం గురించి చెప్పండి అని నాగ సత్యాన్ని ప్రశ్నించాడు. నాగ సత్యం ఏదేదో చెప్పడానికి ప్రయత్నించాడు. 


 ‌‌డైమండ్ నాగ సైదులు ను, నాగ సత్యాన్ని, సాయిశ్రీని అరెస్టు చేసి విరాట్ ఇంట అందరి ముందు నిలబెట్టాడు. 


" యస్ ఐ యాం డైమండ్. ఇన్విస్టిగేషన్ ఆఫీసర్ ని. అయితే నేను ఇన్విస్టిగేషన్ చేసేది కృష్ణ వరప్రసాద్ విశాలగారి కేసు. వారు కారు ప్రమాదంలో చనిపోలేదు. 

ఈ విషయం మాకు ఈ మధ్యనే తెలిసింది. వారెలా చనిపోయారన్నది ఈ నాగ సత్యం తోనే చెప్పి స్తాను. ఊ.. చెప్పు. " అని నాగ సత్యం ను గదిమాడు డైమండ్. 


" మా అన్నయ్య నాగేశ్వర్ మనసా వాచా కర్మణా పెద్ద గుండమ్మ నే ప్రేమించాడు. అయితే అతనిని చెడ్డగా మార్చి రఘుపతి రాజారాం గారి ఆస్తినంతా హస్తగతం చేసుకోవాలనే దుర్భుద్దితో చిన్న గుండమ్మ ప్రేమను కూడా అంగీకరించమని నేనే అన్నయ్య మనసు మార్చా ను. కృష్ణ వరప్రసాద్ గారి ప్రాణ స్నేహితునిగ నటిస్తూ అన్నయ్యను చంపి ఆ నేరం కృష్ణ వరప్రసాద్ మీద వెయ్యాలనుకున్నాను. అది కుదరలేదు. ఆ నాటి రాత్రి కారులో కృష్ణ ప్రసాద్ తో మీ అక్కల మీద మచ్చ పడిం ది. ఎటు తిరిగీ వారికి పెళ్ళికాదు. వారిని ఉంచుకుని మీ ఆస్తి వ్యవహారాలన్నీ నేను చూస్తానన్నాను. దానితో కృష్ణ వరప్రసాద్ నన్ను చంపినంత పని చేసాడు. నేను తప్పించుకుని కారుని పక్కనే ఉన్న లోయలోకి తోసేసి, దానిని ప్రమాదంగా చిత్రించాను. 


 ఆ తర్వాత పెద్ద గుండమ్మ, చిన్న గుండమ్మ తమ తమ సామర్థ్యం తో ఆస్తిని సంరంక్షించుకుంటూ, విరాట్ ను పెంచి పెద్ద చేసారు. చివరికి లాభం లేదనుకుని ఈ నాగ సైదులు ను పెళ్ళి చేసుకున్నాను. " అన్నాడు నాగ సత్యం. 


" కథ అంతటితో అయిపోయిందా?" నాగ సత్యం ను అడిగాడు డైమండ్. 


" లేదు. నా భార్య నాగ సైదులు నాలాగే ఆలోచించే మనిషి. ఇద్దరం గోతికాడ నక్కల్లా పెద్ద గుండమ్మ ను, చిన్న గుండమ్మ ను అంటి పెట్టుకొని ఉన్నాం. పట్టణంలో విరాట్ మూమెంట్స్ కనిపెట్టమని సాయిశ్రీని నియ మించాం. సాయిశ్రీ విరాట్ ఏదో నిధిని సంపాదిం చాడ ని తెలుసుకుని ఇక్కడకు వచ్చింది. విరాట్ ను చంపై నా సరే నిధిని దక్కించుకోవాలని సాయిశ్రీ చూ స్తుంది. " అందరి నడుమ అన్ని విషయాలు నాగ సత్యం చెప్పాడు. 


"పాముకు పాలు పోసిన అది కాటు వేయక మానదు. వీళ్ళ ముగ్గురూ ఇంతే" అని పెద్ద గుండమ్మ, చిన్న గుండమ్మ తో అన్నాడు డైమండ్. 


డైమండ్ ముగ్గురిని ప్రభుత్వానికి అప్పగించాడు. 


హిరణ్యకశిపుని కడుపున పుట్టిన ప్రహ్లాదుడు వీడు" అంటూ విచక్షణ్ ను పెద్ద గుండమ్మ, చిన్న గుండమ్మ లు దగ్గరకు తీసారు. 


" విరాట్ మీ తలిదండ్రుల కేసు విషయం లో అవసర మైతే నువ్వూ, నీ మేనత్తలు స్టేషన్ కు రావల్సి ఉం టుంది. నువ్వు చేసే మంచి పనికి ఎల్లప్పుడూ నా సపోర్ట్ ఉంటుంది. పేదల సొమ్ము పేదలు కే చేరాలి. ఆ పని నువ్వు చేస్తున్నావు. నీ విషయంలో సాయిశ్రీ లాంటి వాళ్ళు నోరు తెరిస్తే వాళ్ళ లాకప్ డెత్ విష యాన్ని నువ్వు పేపర్ లో చూస్తావు. 


 నయాజిత్ అక్రమార్జన కేసు కూడా నేనే టేకప్ చేసాను.. నిజం చెప్పాలంటే నయాజిత్ కేసు గురించి ఆలోచించేటప్పుడే నీ ఫోటో ను చూడటం జరిగింది. 


నీ మిత్రులు నువ్వు ఇసుక తుపానును ఎదుర్కొన్న వీడియో నాకిచ్చారు.. అందులో నువ్వు ఇసుక తుపాను ను మించి ఎగురుతూ పరిగెత్తిన సీన్స్ సూపర్ గా ఉన్నాయి. మానవమాత్రులకు అది చెయ్యడం అంత తేలిక కాదు. నీలో ఏదో సూపర్ అంటే సూపర్ క్వాలిటీస్ చాలా ఉన్నాయి. ఎక్కువమంది వారికున్న సూపర్ క్వాలిటీస్ ను చెడుకు ఉపయోగిస్తారు. నువ్వు అలాకాదు. నీ సూపర్ క్వాలిటీస్ అన్నీ మంచికే ఉపయోగిస్తున్నావు. నీకంతా మంచే జరుగుతుంది. కాదు కాదు మంచే జరగాలి. 


 నువ్వు ఆచ్చుగుద్దినట్లు నీ తండ్రి కృష్ణ వర ప్రసాద్ గారి లాగానే ఉన్నావు. అప్పుడు నా దృష్టి మీ తండ్రి కృష్ణ వరప్రసాద్ గారి కారు ప్రమాదం మీదకు మళ్ళింది. అక్కడి నుండే ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టా ను. సక్సెస్ అయ్యాను. ఇక అంతా న్యాయమే మంచిగా జరుగుతుంది. 

 నీ పెళ్ళికి నన్ను పిలవడం మాత్రం మరిచిపోకు. యమబాల.... విరాట్.... పేర్లు బాగున్నాయి. " అంటూ అందరి దగ్గర డైమండ్ సెలవు తీసుకున్నాడు. 


 యమబాల విరాట్, చిత్రబాల వికటల పెళ్ళిళ్ళు అంగరంగవైభవంగా జరిగాయి. ఆ పెళ్ళికి యమ ధర్మరాజు, చిత్ర గుప్తుడు, చంద్రుడు కూడా వచ్చారు. అయితే వారు విరాట్, యమబాల, చిత్రబాల, పెద్ద గుండమ్మ, చిన్న గుండమ్మ, విచక్షణ్ లకే కనపడ్డారు. 


 ఈ భూమి మీద యమబాల విరాట్ లు నిండూ నూరేళ్ళు జీవించారు. అక్కడ ఉన్న వందగ్రామాలవారు వారి పేర్లు అనుక్షణం జపిస్తూనే ఉన్నారు. 



=======================================================================

  శుభం భూయాత్

=======================================================================

వాగుమూడి లక్ష్మీ రాఘవరావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.



రచయిత పరిచయం: వాగుమూడి లక్ష్మీ రాఘవరావు







23 views0 comments

Comentarios


bottom of page