#AAnnapurna, #ఏఅన్నపూర్ణ, #YuvathaJeevithamViluvaindi, #యువతాజీవితంవిలువైంది, #TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems
![](https://static.wixstatic.com/media/acb93b_d0ff44b3efdf4f7d94ec4aada3892536~mv2.jpg/v1/fill/w_940,h_788,al_c,q_85,enc_auto/acb93b_d0ff44b3efdf4f7d94ec4aada3892536~mv2.jpg)
Yuvatha Jeevitham Viluvaindi - New Telugu Poem Written By A. Annapurna
Published In manatelugukathalu.com On 07/02/2025
యువతా! జీవితం విలువైంది - తెలుగు కవిత
రచన: ఏ. అన్నపూర్ణ
(ఉత్తమ అభ్యుదయ రచయిత్రి)
అన్నము పున్నెము ఎరుగని వయసులో ఆకర్షణల మాయాజాలం
విజేతవైనా పతనానికి దిగజారినా ఇదే సమయం ప్రమాదకరమైన మలుపు
ఉన్నతమైన శిఖరాలకు చేరాలంటే ఆకర్షణకు లోబడకూడదు
చదువుపై ధ్యాస మాత్రమే ఉండాలి నీ విజయానికి మెట్టు కావాలి
నీకు ఎన్నో అవకాశాలు వున్నాయి వాటిని అందుకోవాలి
స్నేహితులు ఉండాలి కానీ వారు నీ మంచి కోరేవారు కావాలి
నీ కష్టాన్ని సంతోషాన్ని పంచుకునేవారు కావాలి నీ శరీరాన్ని కాదు
స్నేహం పవిత్రమైంది అది నీ హితవు కోరుతుంది నీకు ఆసరా ఇస్తుంది
మరేదో ఆశించేవారు స్నేహితులు కారు అది గమనించుకుని మసలుకో
ఆకర్షణ సహజమైనది - క్షణికమైంది కూడా. లోబడిపోయావో నీ పతనం మొదలు
స్థైర్యంగా నిలబడితే అప్పుడే నువ్వు విజయం సాధించగలవు
పెద్దవారు ఎన్నోతరాలు చూసివుంటారు మారిన కాలానికి సాక్షులు
వారిని నిర్లక్ష్యం చేయద్దు వారిసలహాలు అమూల్యమైనవి ఆచరించ తగ్గవి
వారి అనుభవాలని మీకు పాఠాలుగా చెబుతారు ఆచరించండి
మీ స్నేహాలనుకూడా పెద్దలతో పంచుకోండి అది మీకు భధ్రతనిస్తుంది
జీవిత భాగస్వాముల ఎంపికకు భరోసాను కల్పిస్తుంది
స్వేచ్ఛ పేరుతొ ఒంటరిగా వుండాలని లేదా పెళ్ళికాకుండా సహజీవనం చేయడం
గాలిపటంలాంటిది భధ్రత లేదు బంధం ఉండదు బాధ్యతకు దూరంఅవుతుంది
ఒంటరిగా ఉండటమే ఇష్టం ఐతే అనాధ పిల్లలను పెంచుకోండి వారికి ప్రేమను పంచండి
అప్పుడు మీరు చేసేపనిలో ఆశయం అర్ధం ఒక జీవితాన్ని నిలబెట్టిన ఆత్మ సంతృప్తి
దేనికి సాటిరావు ఆలోచించండి!
********
ఏ. అన్నపూర్ణ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
![](https://static.wixstatic.com/media/acb93b_85faa205e5684f5db2e85ab2bb888976~mv2.jpeg/v1/fill/w_417,h_520,al_c,q_80,enc_auto/acb93b_85faa205e5684f5db2e85ab2bb888976~mv2.jpeg)
రచయిత్రి పరిచయం : ఏ. అన్నపూర్ణ
నాపేరు అన్నపూర్ణ. నేను ఇరవై సంవత్సరాలు ఏక ధాటిగా కథలు నవలలు వ్యాసాలు కవితలు కాకుండా జనరల్ నాలెడ్జ్ బుక్స్ చదివిన తర్వాత కథలు రాయడం మొదలు పెట్టాను. అమెరికాలో స్థిరపడ్డాక వచ్చిన అవకాశాలు నా రచనకు మరింత పదును పెట్టాయి. నా రచనలు చాలా వరకు నేను చూసిన ఎదురుకున్న సంఘటనల ఆధారంగా రాసినవే. ''మంచి సందేశాత్మక రచన చేయాలనే '' తపన.... తప్పితే ఏదో ఆశించి రాయడంలేదు. ఆ దాహం తీరనిది. దీని నుంచే మంచి రచన వస్తుందని అనుకుంటాను. ఎందరో గొప్పవారు చెప్పినట్టు నేర్చుకోడానికి ఫుల్స్టాప్ వుండకూడదు. ఆలా తెలుసుకుంటూ ఉండటమే కర్తవ్యమ్. నాకు ప్రోత్సహం ఇస్తున్న పత్రికల వారికీ ధన్య వాదాలు. నాది కాకినాడ. పండితవంశంలో పుట్టుక, సాహిత్యం ఊపిరి- వంశపారంగా అబ్బిన వరం.
నా మొదటికథ చదివి రచనలను ప్రోత్సహించినది ''వసుంధర.R రాజగోపాల్గారు.'' నామొదటి నవల చదివి నా శైలిని మెచ్చుకుని , చతురలో ప్రచురించడo గొప్ప అర్హతగా అభినందించిన '' శ్రీ యండమూరి.....'' ఇంకా ఇప్పుడూ కొనసాగిస్తూ ఉండటానికి కారకులు.
అలాగే నా వ్యాసాలకు సుస్థిర స్థానం కల్పించింది డా. జయప్రకాశ్ నారాయణ్ LOKSATTA ఫౌండర్. నా కవితలకు గుర్తింపు తెచ్చిన ప్రముఖ జర్నలిస్ట్ ఐ.వెంకట్రావ్ గారు, (నా మొదటి కవిత వారి '' పత్రిక ''లో వెలుగు చూసింది.)
విచిత్రం ఏమిటంటే వీరిలో మహిళా రచయిత్రు లెవరూ లేకపోడం.
రచయితలో వుండే ప్రత్యేకతను గుర్తించిన గుణం వీరిది. మరో విషయం ''జనార్ధన మహర్షి'' గారి కవితలు చదివి చిన్న మార్పులు చేస్తే బాగుంటుందేమో అని చెప్పినందుకు కొత్తగా ఏమాత్రమూ కోపం తెచ్చుకోకుండా ఆయన కొత్తగా రాసిన కవితల సంపుటిని నాకుపంపి '' సరిచూసి ఇస్తే నేరుగా ప్రింటికి ఇస్తాను ''అని చెప్పడం వారి విజ్ఞతకు సహస్ర వందనాలు. వీరంతా నేను ఎన్నటికీ మరువలేని మహానుభావులు.
ఇంకా కొందరు వున్నారు. సమయం వచ్చినపుడు వారిని గురించి చెబుతాను.
30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి,
ఉత్తమ అభ్యుదయ రచయిత్రి బిరుదు పొందారు.
(writing for development, progress, uplift)
![](https://static.wixstatic.com/media/acb93b_7974d06be1474f5c99a35e32b117f1d3~mv2.png/v1/fill/w_292,h_426,al_c,q_85,enc_auto/acb93b_7974d06be1474f5c99a35e32b117f1d3~mv2.png)
Commentaires