Profile
About
పేరు: మాచి రాజు కామేశ్వర రావు
పుట్టిన వూరు.. పత్తిపాడు, తూర్పు గోదావరి జిల్లా.
ఎప్పటి నుంచి కధలు వ్రాస్తున్నారు? మొదటి కథ సెప్టెంబరు 1969 లో చందమామ లో ప్రచురితం
ఇప్పటి వరకూ వ్రాసినవి. 1.పిల్లల కథలు. 400 పైగా( ఇందులో 256 కథలు చందమామ లో వచ్చాయి)
2 పెద్దల కథలు.. వందకు పైగా ఆంధ్ర ప్రభ, పత్రిక , జ్యోతి, భూమి. స్వాతి, విపుల వగైరా, వగైరా దాదాపు అన్ని పత్రికలలో
3 నవలలు… స్వాతి మాస పత్రిక లో 4, చతుర లో 2, సహారి లో పిల్లల నవల ఒకటి సీరియల్ గా.
4. మొత్తం వెలువరించిన కథా సంపుటాలు 5
5. గుర్తింపు తెచ్చినవి.. చందమామ లో ప్రచురితం అయిన ‘ పారి పోయిన దొంగ ‘ కథ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ వారు తీసుకున్నారు. చందమామ లో వచ్చిన “ విధి నిర్వహణ “ కథను మహారాష్ట్ర గవర్నమెంట్ వారు 6 వ తరగతి పాఠ్యాంశం గా తీసుకున్నారు. “ అడుగు కో ఆపద “ నవలకి బాలల అకాడమి వారు నిర్వ హించిన నవలల పోటీలో ప్రథమ బహుమతి వచ్చింది. ఇవి కాక కొన్ని పత్రికల వాళ్ళూ, సంస్థల వాళ్ళు నిర్వహించిన కథల పోటీల్లో 5 బహుమతులు.
6. సాహిత్యకృషి. . మాచి రాజు భాల సహిత్య పీఠం స్థాపించి ఏటా 6 నుంచి 10 వరకూ చదివే బడి పిల్లలకు కథల పోటీలు, వారికి నగదు, పుస్తకాలు బహుమతిగా ఇవ్వడం. ప్రతి ఏటా ఇద్దరు బాల సాహితీ వేత్తలకు మాచి రాజు సీతా రామయ్య, రత్న కుమారి దంపతులస్మారక పురస్కారం గా ₹ 6000/- నగదు , జ్ఞాపిక, శాలువా తో సన్మానం