Profile
About
పేరు : *సింగీతం విజయలక్ష్మి*
జననం. : 12/04/1968
జన్మస్థలం: అనంతపురం
తండ్రి : బాపూరం గురురాజ రావు గారు, న్యాయవాది.
తల్లి : చంద్రకాంత బాయి.
తోబుట్టువులు : *అన్న గారు, తమ్ముడు,చెల్లెలు* వినుతా గాయత్రి
*బాల్యం విద్యాభ్యాసo*
పుట్టి పెరిగింది అనంతపురంలో.
చదువు : B.A , B.Ed, హిందీ ప్రవీణ
ఉద్యోగం : *1990 నుండి 1996 వరకు ఉపాధ్యాయురాలిగా పనిచేశాను.*
1996 జనవరిలో సింగీతం ఘటికాచలరావు గారితో వివాహం జరిగింది.
*మా వారు* రైల్వే ఇంటిగ్రల్ కోచ్ ఫేక్టరీలో సీనియర్ సెక్షన్ ఇంజినీర్ గా పనిచేసి ఏప్రిల్ 2024 లో పదవీ విరమణ పొందారు. కథా రచయిత, నవలా రచయితగా మంచి పేరుపొందారు.
*పిల్లలు* : ప్రద్యుమ్న రావు, ప్రద్యోత రావు
రచనా వ్యాసంగం:
2013లో భర్త ప్రోత్సాహంతో నేను వ్రాసిన మొట్టమొదటి కథ *నవ్య* వార పత్రికలో ప్రచురించ బడింది. ఆ తరువాత అంతర్జాల వార పత్రిక సహరి లో మూడు కథలు ప్రచురించ బడ్డాయి. ఇటీవల విశాలాక్షి పత్రిక వారు నిర్వహించిన పోటీలో సునామీ అనే కథకు బహుమతి లభించింది. భర్త, అన్నయ్య ప్రోత్సాహంతో కవితా సాహిత్యం మీద మక్కువ ఏర్పడి ఎన్నెన్నో కవితలు వ్రాసాను. పలుమార్లు పలురకాల పోటీలలో విజేతనయ్యాను. సాహిత్య రంగంలో ఉన్నత మజిలీలు చేరుకోవాలని అన్ని సాహిత్య ప్రక్రియలు ఇంకా బాగా వృద్ధి చేసుకోవాలని నా ఆకాంక్ష.